• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mannara Chopra: ఎద అందాలతో మాయ చేస్తున్న మన్నారా చోప్రా!

    యంగ్‌ బ్యూటీ మన్నారా చోప్రా (Mannara Chopra).. మరోమారు తన అందచందాలతో సోషల్‌ మీడియాలో తళుక్కుముంది. ఎద అందాలను చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

    తాజాగా సెలెనా రఫుల్‌ షోల్డర్‌ మ్యాక్సీ డ్రెస్‌ (Selena Ruffle Shoulder Maxi Dress)లో ఫొటోషూట్‌ నిర్వహించిన ఈ సుందరి.. తన అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది. 

    మ్యాచింగ్‌ ఎయిర్‌ రింగ్స్‌, వాచ్‌ ధరించి యూనిక్‌ హెయిర్‌ స్టైల్‌తో కనువిందు చేసింది. ఈ భామ లేటెస్ట్ ఫొటోలను చూసిన నెటిజన్లు మైమరిపోతున్నారు. మన్నారా లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

    బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)కు స్వయానా సోదరి అయిన ఈ బ్యూటీ.. తెలుగు సినిమాతోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టడం విశేషం.

    2014లో ‘ప్రేమ గీమా జాంతా నై’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మన్నారా పరిచయమైంది. ఆర్‌.వి సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సింగర్‌ శ్రీరామ చంద్ర హీరోగా చేశాడు.

    ఆ తర్వాత బాలీవుడ్‌లో జిద్‌ (Zid) సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. అందులో మన్నారా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

    ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మన్నారా.. అక్కడ ‘సందమరుతమ్‌’, ‘కావల్‌’ చిత్రాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు చెప్పుకోతగ్గ విజయాన్ని అందుకోకపోవడంతో తిరిగి టాలీవుడ్‌పై మన్నారా ఫోకస్‌ పెట్టింది.

    తెలుగులో సునీల్‌తో ‘జక్కన్న’ (Jakkanna), సాయిధరమ్‌ తేజ్‌తో ‘తిక్క’ (Thikka), పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో ‘రోగ్‌’ (Rough) వంటి సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్‌ కాలేదు. 

    ఆ తర్వాత రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. తిరిగి తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా చేసిన  ‘సీత’ (Sita) సినిమా అడుగుపెట్టింది. ఆ చిత్రం కూడా ఈ భామకు ఆశించిన బ్రేక్ ఇవ్వలేదు.

    దీంతో బుల్లితెరపై ఫోకస్‌ పెట్టిన మన్నారా.. Bigg Boss 17 హిందీలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. అక్కడ తన ప్రవర్తన, ఆటతీరుతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెకండ్‌ రన్నరప్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. 

    గతేడాది ‘భూత్‌మేట్‌’ అనే హిందీ సిరీస్‌లో మన్నారా మెరిసింది. పారి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల ‘డ్యాన్స్‌ దివానే 4’ అనే హిందీ షోలో గెస్ట్‌ అప్పిరియన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ను అలరించింది. 

    తాజాగా తెలుగులో ‘తిరగబడరా సామి’ అనే చిత్రంలో ఈ భామ నటించింది. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తికాగా.. విడుదలకు సిద్ధంగా ఉంది. 

    అటు పంజాబీలో ఓహీ చాన్ ఓహీ రాతన్‌ అనే చిత్రంలో మన్నారా చోప్రా నటించింది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తైనట్లు వికీపిడీయా ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ మూవీ కూడా త్వరలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv