• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pawan kalyan: పవన్‌ ఫ్యాన్స్‌ కోసం అదిరిపోయే ట్రీట్‌ లోడింగ్‌.. తెలిస్తే ఎగిరిగంతేస్తారు! 

    టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయన నటిస్తోన్న లేటెస్ట్‌ చిత్రం ‘ఓజీ‘ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌). ‘సాహో’ (Saaho) ఫేమ్‌ సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో వ‌స్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ అభిమానుల్లో మంచి హైప్‌ క్రియేట్‌ చేసింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి చాలా వరకూ షూటింగ్‌ పూర్తవ్వగా.. పవన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ మాత్రం పెండింగ్‌లో ఉంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పవన్‌ బిజీగా ఉండటంతో షూటింగ్‌ కొన్ని రోజులు వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్‌ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోంది. 

    కొత్త పోస్టర్‌తో మరింత హైప్‌!

    మ్యూజిక్‌ డైరెక్టర్ థమన్‌ (SS Thaman) షేర్ చేసిన పోస్టర్‌లో.. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. కత్తి పట్టుకుని ప్రత్యర్థులను తెగనరుకుతున్న‌ట్లు ఈ పోస్టర్‌లో పవన్‌ ఉన్నాడు. దీనిని చూసిన పవన్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు. తమ హీరో కటౌట్‌కు తగ్గ సినిమా ‘ఓజీ’ అవుతుందని అంటున్నారు. ఇండస్ట్రీ రికార్డులను ‘ఓజీ’ కొల్లగొట్టడం ఖాయమని కామెంట్స్‌ రూపంలో తెలియజేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోంది. అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

    అదిరిపోయే ట్రీట్‌ లోడింగ్‌!

    ఓజీ తర్వాత ప్రస్తుతం పవన్‌ చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh). గబ్బర్‌ సింగ్‌ వంటి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ తర్వాత పవన్‌ – డైరెక్టర్‌ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీ పైన కూడా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ షూట్‌ కూడా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్‌ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్‌ చేశారు. ఈ మేరకు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ మూవీ నుంచి ఊహించనిది రాబోతుంది’ అంటూ ఎక్స్‌లో మేకర్స్‌ ట్వీట్‌ పెట్టారు. దీంతో ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ వస్తుందని అంతా భావిస్తున్నారు. పవన్‌ పొలిటికల్‌ డైలాగ్‌తో కూడిన ఓ వీడియోను రిలీజ్‌ చేయబోతున్నట్లు సమాచారం. 

    సన్నగిల్లుతున్న అంచనాలు!

    పవన్‌ కల్యాణ్‌ హీరోగా.. దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్‌లో మంచి హైప్‌ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఎటువంటి సాలిడ్‌ అప్‌డేట్‌ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తోంది. సినిమా షూటింగ్‌ వాయిదా మీదా వాయిదా పడుతుండటంతో పాటు అరకొరగా అప్‌డేట్స్‌ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇటీవల శివరాత్రి సందర్భంగా ఓ ప్రోమో రిలీజ్‌ చేస్తామని ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో పవన్‌ కెరీర్‌లో ప్రిస్టేజియస్‌ ప్రాజెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘హరిహర వీరమల్లు’పై పవన్‌ ఫ్యాన్స్‌లో ఆసక్తి తగ్గుతూ వస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv