• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RAM CHARAN BIRTHDAY: గ్లోబల్‌ స్టార్‌తో ఉన్న ఫోటోలు పంచుకున్న సెలబ్రిటీలు

    RRRతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన రామ్‌ చరణ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే #RC15 టైటిల్‌ అప్డేట్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తారలంతా చరణ్‌పై పుట్టిన రోజు శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. మహేశ్‌ బాబు, జూ. ఎన్టీఆర్ సహా అందరూ రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో కొంత మంది రామ్‌ చరణ్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుని తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాంటి అరుదైన ఫోటోలు మీకోసం

    కుమారుడు గ్లోబల్‌ స్టార్‌గా ఎదగడం..ఆస్కార్‌ వేదికపైకి వెళ్లడంతో పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు  మెగాస్టార్ చిరంజీవి. కొడుకుకు ముద్దు పెడుతూ ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్నా’ అంటూ  పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

    మంచు ఫ్యామిలీలో ట్రోల్స్‌కు గురి కాని ఒకే ఒక్కడు మంచు మనోజ్‌. అందరితో కలుపుగోలుగా ఉంటూ వివాదాలకు దాదాపుగా దూరంగా ఉంటాడు. మోహన్‌ బాబు, చిరంజీవి మధ్య విబేధాలు ఉన్నట్లు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. కానీ మనోజ్ మాత్రం…రియల్లీ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ మిత్రమా రియల్లీ సూపర్‌ డూపర్‌ హ్యాపీ బర్త్‌డే అంటూ రామ్‌ చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు.

    బాలివుడ్‌ అందగాడు వివేక్‌ ఒబెరాయ్‌ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించాడు. క్రిష్‌, రక్త చరిత్ర వంటి సినిమాలతో అందరికీ సుపరిచితుడు. రామ్‌ చరణ్‌తో కలిసి వినయ విధేయ రామలో నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ అప్పుడు తనతో దిగిన ఫోటోను పంచుకున్నారు.

    విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, KTR, రామ్‌ చరణ్‌తో కలిసి ఉన్న ఓ అరుదైన ఫోటోతో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

    మెగా ఫ్యామిలీలో హాలివుడ్‌ కటౌట్‌ ఉన్న హీరో వరుణ్‌ తేజ్‌. చిన్నప్పటి నుంచి చరణ్‌తో కలిసి పెరిగిన వారే. ఇక ‘ఆట మొదలైంది’ అంటూ వరుణ్‌ తేజ్‌, రామ్‌చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు.

    RRR సినిమా తెర వెనక పనిచేసిన వారిలో రాజమౌళి తనయుడు కార్తికేయ ఒకరు. కార్తికేయ గురించి సినిమా ప్రమోషన్లలోనూ ఎన్టీఆర్, రామ్‌ చరణ్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. వీరి మధ్య మంచి బంధం కూడా ఉంది.  ‘బ్రదర్‌ ఫ్రం అనదర్‌ మదర్‌’ అంటూ కార్తికేయ RRR సెట్‌లోని ఫోటో షేర్ చేశారు.

    రామ్‌ చరణ్‌తో రచ్చ సినిమా చేసిన సంపత్‌ నంది బ్రహ్మానందంతో కలిసి ఉన్న ఓ అపురూప చిత్రాన్ని పంచుకున్నారు.

    యంగ్‌ సెన్సేషనల్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ కూడా రామ్‌ చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకుని శుభాకాంక్షలు చెప్పాడు. ప్రస్తుతం ఈ దర్శకుడి నుంచి ‘హనుమాన్‌’ అనే ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. 

    కియారా అద్వానీ, శంకర్‌ సహా ‘గేమ్ చేంజర్‌’ టీం రామ్‌ చరణ్‌కు కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు చెప్పింది. ఈ ఫోటోలతో కియారా కూడా ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    రామ్‌చరణ్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు… చెర్రీకి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయంటే