హైదరాబాద్లో చరణ్, శంకర్ మూవీ షూటింగ్?
రామ్చరణ్, శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 9నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ పాటను చిత్రీకరించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఇందులో రామ్చరణ్ డ్యుయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చెర్రీ కొత్త లుక్కులో కనిపించనున్నాడు. పీరియాడికల్ పొలిటికల్ డ్రామాగా RC15 తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులోని ఓ పవర్ఫుల్ పాత్ర కోసం కన్నడ నటుడు ఉపేంద్రను సంప్రదించినట్లు టాక్.