సమంత – విజయ్ దేవరకొండ వీరిద్దరు తెలుగు తెరపై అనతి కాలంలోనే స్టార్స్‌గా ఎదిగారు. పెద్దఎత్తున ఫ్యాన్ బేస్‌ను సంపాదించారు. విజయ్ -సామ్ సినీ కెరీర్ పక్కన పెడితే ఇద్దరూ తమ పర్సనల్ లైఫ్‌లో ఒకేరకంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వీరి ఆలోచనల్లో కొన్ని ఒకేరకంగా ఉండటం యాధృచ్చికమే అయినా.. కెరీర్ పరంగా ఒకే దారిలో అడుగులు వేస్తూ ఒకే టార్గెట్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న ఖుషీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్‌లో తొలి సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాందించి రౌడీ బాయ్‌గా ఫ్యాన్స్‌కు దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. తన యాటిట్యూడ్, టాకింగ్ నెస్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం మూవీలతోనే కాకుండా సొంతంగా బిజినెస్‌లు ప్రారంభిస్తూ అందులోనూ రాణిస్తున్నాడు. ఇదే దారిలో సమంత కూడా పయనిస్తోంది.
సినిమాల్లోకి వచ్చిన తొలిరోజుల్లోనే సమంత తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా అవకశాలు కొల్లగొడుతూ అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగు, తమళంలో దాదాపు అందరు అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
విజయ్ దేవరకొండ ఓవైపు సినిమాలు చేస్తూనే వ్యాపారాలపై దృష్టి పెట్టాడు. యూత్‌లో క్రేజ్ సంపాదించిన విజయ్.. ఆ క్రేజ్‌ను తన వ్యాపారానికి పెట్టుబడిగా మార్చుకున్నాడు. రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ ప్రారంభించి ఈ రంగంలోనూ సక్సెస్ సాధించాడు.
సొంత బ్రాండ్ కావడంతో తానే ప్రకటనల్లో నటిస్తూ ప్రమోట్ చేస్తున్నాడు. ఈ రౌడీ బ్రాండ్ మెన్స్‌వేర్‌కి యూత్‌లో మంచి డిమాండ్ ఉంది.
ఇక సామ్ గురించి చెప్పాలంటే.. ఫ్యాషన్ రంగంపై తనకున్న ఇంట్రెస్ట్‌తో ‘సాకీ’ అనే పేరుతో ఓ ఆన్‌లైన్ వస్త్ర వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది సమంత. ఈ ఆన్ లైన్ స్టోర్ కోసం సొంతంగా ప్రమోషన్స్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతోంది.
తన బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వ్యాపార ప్రకటనల్లో పాల్గొనడం సామ్, విజయ్‌లో ఉన్న కామన్ పాయింట్. వీటితో పాటు బడా వ్యాపార సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.
కేవలం వ్యాపారం, డబ్బు సంపాదించడమే కాకుండా సామాజిక స్పృహతో సమాజ సేవలో కూడా పాల్గొంటున్నారు ఇద్దరు స్టార్స్. ఈ క్రమంలో దేవరకొండ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను రౌడి స్టార్ ప్రారంభించాడు. దీని ద్వారా నిరుద్యోగులకు జాబ్ స్కిల్స్, ఇంగ్లిష్ వంటి వాటిలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.
అలాగే కోవిడ్ టైంలో విజయ్ ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు నిత్యవసర సరకులను ఉచితంగా అందించి పెద్ద మనసు చాటుకున్నాడు.
ఇక లెడీ బాస్ సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తోంది. ఈ ఫౌండేషన్ తరఫున ప్రాణాపాయంలో ఉన్న మహిళలు, చిన్నారులను సామ్ ఆదుకుంటోంది.
అయితే వీరిద్దరు కలిసి ఓ కామన్ బ్రాండ్ ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే రౌడీ బ్రాండ్‌తో విజయ్, సాకీ బ్రాండ్‌తో సమంత సొంత వ్యాపారాలు చేస్తుండగా ఈ రెండింటిని కలపడం లేదా , మరొ కొత్త బ్రాండ్‌తో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారట.
ఇక సినిమాల విషయానికొస్తే.. వీరిద్దరు జంటగా నటించిన ఖుషి మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఖుషి మూవీ పాటలు, ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ రోమాన్స్ అదిరిపోయింది. ఈ సినిమా విజయం ఇద్దరి స్టార్స్ కెరీర్‌కు కీలకం కానున్నాయి. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న విజయ్- సమంతలు ఈ చిత్రం సక్సెస్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!