• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AFG vs SL: అఫ్గాన్ సంచలన విజయం

    శ్రీలంకతో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ సంచలన విజయం నమోదుచేసింది. శ్రీలంకపై అఫ్గానిస్థాన్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఆఫ్గాన్ 45.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రహమత్ షా (62), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (58), అజ్మతుల్లా (73) అర్ధ శతకాలు బాదడంతో సునాయసంగా విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మదుశంక 2, కాసున్ రజిత ఒక వికెట్ పడగొట్టారు.

    AFG vs SL: శ్రీలంక ఆలౌట్

    నేడు ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ ఓడి శ్రీలంక బ్యాటింగ్‌ చేసింది. శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లు ఓపెనర్ పాథుమ్ నిశాంక (46) దిముత్ కరుణరత్నె (15), కుశాల్ మెండిస్ (39), సదీర సమరవిక్రమార్క (36) ఎంజొలో మాథ్యూస్‌ (23), చరిత్ అసలంక (22), ధనంజయ డి సిల్వా (14) పరుగులు చేశారు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లు ఫజల్ హక్‌ ఫారూఖీ 4, ముజిబుర్ రహ్మన్ 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రషీద్‌ఖాన్‌ ఒక్కో వికెట్ … Read more

    PAK vs AFG: అఫ్గానిస్థాన్ సంచలన విజయం

    వన్డే వరల్డ్‌కప్‪‌లో భాగంగా పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ ఘన విజయం సాధించింది. అఫ్గాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 7 వికెట్లు కొల్పోయి 283 పరుగుల చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆఫ్గాన్ జట్టు ఏ మాత్రం తడబాటు లేకుండా 49 ఓవర్లలోనే లక్ష‍్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు రహతుల్మా (65), ఇబ్రహిం జర్దాన్ (87) రహ్మత్ షా (77), హస్మతుల్లా (48) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

    NZvsAFG: అఫ్గనిస్తాన్ టార్గెట్ ఫిక్స్

    ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 288 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (20), విల్ యంగ్ (54), రచిన్ రవీంద్ర (32), డారిల్ మిచెల్ (1), టామ్ లాథమ్ (68), గ్లెన్ ఫిలిప్స్ (71), మార్క్ చాప్మన్ (25) పరుగులతో రాణించారు. ఇక అఫ్గాన్ బౌలర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్ (2), రషీద్ ఖాన్ (1), ముజీబ్ ఉర్ రహ్మాన్ … Read more

    వరుస భూకంపాలతో అఫ్ఘాన్‌ విలవిల

    వరుస భూకంపాలతో అల్లాడుతున్న అఫ్ఘానిస్తాన్‌లో నేడు మరో భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం 6.11 గంటల సమయంలో 6.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. హెరాత్ నగరానికి 29 కిలోమీటర్ల దూరంలో ఇది నమోదైనట్లు తెలిపింది. కాగా, అఫ్ఘాన్‌లో ఇప్పటికే వరుస భూకంపాలతో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. నాలుగు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఇప్పటికే శిథిలాల నుంచి 4 వేల మృతదేహాలను వెలికితీశారు.

    క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు

    ఆఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు చాటుకున్నాడు. ఆఫ్గాన్ భూకంప బాధితులకు తన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించాడు. రషీద్ మాట్లాడుతూ.. ‘ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్, ఫరా, బాద్గీస్‌ ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రవిషాదం మిగిల్చింది. తాను ప్రపంచ కప్ 2023 కోసం మొత్తం ఫీజును కష్టాల్లో ఉన్న ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను. భూకంపంలో దాదాపు 2400 పైగా మృతి చెందడం బాధను కలిగించింది’. అని రషీద్ పేర్కొన్నాడు.

    Asian Games: భారత్‌దే బంగారు పతకం

    ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు కావడంతో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు స్వర్ణం గెలుచుకుంది. తొలుత టాస్‌ నెగ్గి భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో 18.2 ఓవర్లకు 112/5 స్కోరు చేసింది. ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. అప్పటికి వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో భారత్‌ గెలిచినట్లు ప్రకటించారు.

    Asian Games: భారత్‌తో అఫ్గాన్ ఫైనల్ పోరు

    ఆసియా క్రీడల్లో భాగంగా నేడు రెండో సెమీస్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టును అఫ్గానిస్థాన్ ఓడించింది. ఈ క్రమంలో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లకు 115 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన అఫ్గాన్ 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది. దీంతో ఫైనల్లో భారత్-పాక్ పోరును చూద్దామనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో భారత్‌తో అఫ్గాన్ తలపడనుంది.