• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఐశ్వర్యరాయ్‌కి రెవెన్యూ నోటీసులు

  అలనాటి విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌కి రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. నాసిక్‌లోని ఓ భూమికి ఆమె పన్ను చెల్లించకపోవడంతో అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏడాది కాలంగా ఐశ్వర్య రాయ్‌ పన్నులు చెల్లించడం లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఐశ్వర్యం ఏడాదికి గానూ రూ.21,960 చెల్లించాల్సి ఉంది.10 రోజుల లోపు బకాయి చెల్లించకపోతే తగు చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.

  ఐశ్వర్యరాయ్ ఎమోషనల్ పోస్ట్

  తండ్రి కృష్ణరాజ్ రాయ్ జయంతి సందర్భంగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ కాస్త ఎమోషనల్ అయింది. ఇన్‌స్టా వేదికగా దివంగత తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘ప్రియమైన నాన్న.. అజ్జాకి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిన్ను గుర్తు చేసుకోవడంలోనే ప్రేమ, ఆరాధనలు దాగి ఉంటాయి. అమితమైన మా ప్రేమాభిమానాలు నీపై ఎప్పుడూ ఉంటాయి’ అని పోస్ట్ చేసింది. తన కుమార్తె ఆద్యతో కలిసి తండ్రి ఫొటో ముందర దిగిన సెల్ఫీని ఈ పోస్టుకు జత చేసింది. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ ‘కూతుర్లు ఎక్కువగా ప్రేమించేది తండ్రినే’ అంటూ … Read more

  ఐశ్వర్య అందాన్ని చూసి పెళ్లి చేసుకోలేదు; అభిషేక్ బచ్చన్

  ఐశ్వర్యరాయ్ అందాన్ని చూసి వివాహం చేసుకోలేదని ఆమె భర్త అభిషేక్ బచ్చన్ అన్నారు. తన మనసు అంతకన్నా అందమైనదని, అది చూసే ఐశ్యర్యను పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి చేసుకోవడంపై అభిషేక్‌పై విమర్శలు వచ్చాయి. వాటిపై ఇటీవలే ఆయన స్పందించారు. కాగా వీరిద్దరికీ వివాహమై 15 సంవత్సరాలు గడిచింది. వయసులో అభిషేక్ కంటే ఐశ్వర్య మూడేళ్లు పెద్దదైనా వారిమధ్య ఎప్పుడూ మనస్ఫర్ధలు వచ్చేవి కావు.

  ఐశ్‌ని విశ్వసుందరి చేసిన సమాధానం ఇదే

  నేడు విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ పుట్టినరోజు. అయితే, ఒకే ఒక సమాధానం ఆమెను 1994లో మిస్ వరల్డ్ చేసిందంటే నమ్మగలరా! ‘విశ్వసుందరికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి?’ అని జడ్జిలు ఐశ్‌ని ప్రశ్నించారు. ‘సమకాలీన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. సంపన్న, మధ్యతరగతిపై మాత్రమే కాకుండా పీడితుల పట్ల కూడా దయాగుణం కలిగి ఉండాలి. సమాజం విధించిన జాతి, మత భేదాలకు అతీతంగా ఆలోచించగలగాలి. ఈ లక్షణాలు ఒక వ్యక్తిని విశ్వ సుందరిగా, నికార్సైన మనిషిగా, నిజమైన మనిషిగా తీర్చిదిద్దగలవు’ అని సమాధానం చెప్పి కిరీటాన్ని సొంతం చేసుకుంది.

  ఓవర్సీస్‌లో ‘PS1’ అదుర్స్

  ఓవర్సీస్‌లో పొన్నియన్ సెల్వన్ 1 అదరగొడుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఆస్ట్రేలియాలో 86 సెంటర్లలో విడుదల కాగా, మధ్యాహ్నం వరకు 3,47,757 డాలర్లు వసూళ్లు చేసింది. న్యూజిలాండ్‌లో 23 కేంద్రాల్లో విడుదలై 33,020 డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఆస్ట్రేలియాలో ఈ రోజు రాత్రివరకల్లా సుమారు 4లక్షల డాలర్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. నేడు విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. స్వదేశంలోనూ బాగా ఆడుతోంది.

  భాగ్యనగరంలో మెరిసిన ఐశ్వర్య

  పొన్నియన్ సెల్వన్-1 ప్రిరిలీజ్ ఈవెంట్‌లో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తళుక్కన మెరిసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఐశ్వర్యరాయ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. కాగా ఐశ్వర్య.. పొన్నియన్ సెల్వన్-1 చిత్రంలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి తదితరులు నటించారు. Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter:

  ఐశ్, త్రిషలకు మణి హెచ్చరిక

  మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న చిత్రం PS1. ఈ చిత్రంలో అందాల తారలు ఐశ్వర్యరాయ్, త్రిష నటిస్తున్నారు. నందినిగా ఐశ్, కుందవిగా త్రిష ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అయితే షూటింగ్ కాలంలో మాట్లాడుకోవద్దని వీరిద్దరినీ దర్శకుడు హెచ్చరించాడట. వీరిమధ్య సాన్నిహిత్యం పెరిగితే.. అది సినిమాకు మైనస్ అవుతుందని భావించడమే ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది. ఐశ్, త్రిష ఈ సినిమాలో ప్రత్యర్థులుగా కనిపించనున్నారు. ఈ నెల 30న మూవీ విడుదల కానుంది.

  పొన్నియిన్ సెల్వన్‌లో విలన్‌గా ఐశ్వర్యరాయ్!

  పొన్నియిన్ సెల్వన్ మూవీలో ఐశ్వర్యరాయ్ నెగిటివ్ పాత్రలో యాక్ట్ చేస్తూ, డబుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ క్యారెక్టర్లో ఐష్ పాత్ర సినిమాకు కీలకం కానున్నట్లు సమాచారం. గతంలో కోలీవుడ్‌కు ఐశ్వర్యను హీరోయిన్‌గా పరిచయం చేసిన మణిరత్నం, ఇప్పుడు విలన్‌గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తుండగా.. మణిరత్నం, సుహాసిని, సుభాస్కరన్ అల్లిరాజాలు ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. మరోవైపు ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, ఆర్.శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్ ప్రధాన … Read more

  ఒక్క నిమిషం.. ఈ అమ్మాయి ఐశ్వర్యారాయ్ కాదు!

  ‘చూడండి.. ఐశ్వర్యారాయ్ ఎంత వైనంగా దండం పెడుతోందో’ అని అనుకుంటే మీరు పొరబడినట్లే. అవును. ఇందులో ఉన్న చిన్నది ఐశ్వర్యారాయ్ కాదు. ఆశితా సింగ్. ఇన్ స్టాలో వీడియోలు చేస్తుంటుంది. అచ్చం ఐశ్ నే పోలి ఉండటంతో ఈ అమ్మడి వీడియో ట్రెండ్ అవుతోంది. తీక్షణంగా చూస్తే తప్ప ఐశ్వర్యరాయ్ కాదనే విషయం తెలియదు. ముఖ్యంగా ఆ కళ్లు మనల్ని భ్రమలోకి నెట్టేస్తున్నాయి.   View this post on Instagram A post shared by Aashita Singh (@aashitarathore)

  ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’ నుంచి ఐశ్వర్య‌రాయ్ ఫోటో లీక్

  ఐశ్వ‌ర్య‌రాయ్ ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాలో న‌టిస్తుంది. ఇందులో మ‌హారాణి నందిని పాత్ర‌లో ఆమె క‌నిపించ‌నుంది. తాజాగా షూటింగ్‌లో ఆమెకు సంబంధించిన ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఐష్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఐశ్వ‌ర్య‌ను చాలాకాలం త‌ర్వాత మ‌ళ్లీ తెర‌పై అది కూడా ఒక మ‌హారాణిలా చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.