• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Aus Vs Ban: టాస్ గెలిచి ఆసీస్ బౌలింగ్

    వన్డే వరల్డ్ ‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆస్ట్రేలియా తలపడుతోంది. పుణె వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తుదిజట్లు: ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టొయినిస్, సీన్ అబాట్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆడం జంపా, జోష్ హాజిల్‌వుడ్‌. బంగ్లాదేశ్‌ తాంజిద్ హసన్, లిటన్ దాస్, నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్( వికెట్ కీపర్), తౌహిద్ హృదోయ్, మెహిదీ … Read more

    ‘మా దేశానికొస్తే అతడికి రాళ్ల దెబ్బలు తప్పవు’

    శ్రీలంక-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ‘టైమ్‌డ్‌ ఔట్’ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. బంగ్లా కెప్టెన్ షకిబ్ తీరుపై శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ మ్యాచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన సోదరుడు ట్రెవిస్ కూడా షకిబ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘గేమ్‌లో షకిబ్ క్రీడా స్ఫూర్తి, మానవీయ విలువలు కూడా పాటించకపోవడం దారుణం. షకిబ్‌ను శ్రీలంకలోకి రానివ్వకూడదు. ఒకవేళ అతడు అంతర్జాతీయ మ్యాచ్‌ లేదా ఎల్‌పీఎల్‌లో పాల్గొంటే మాత్రం రాళ్ల దెబ్బలకు సిద్ధంగా ఉండాలి’. అని ట్రెవిస్‌ పేర్కొన్నాడు.

    PAK vs BAN: పాకిస్థాన్ విజయం

    నేడు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించింది. బంగ్లాపై పాక్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 205 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన పాక్ లక్ష్యాన్ని కేవలం 32.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. పాక్ బ్యాటర్లు అబ్దుల్లా షఫీక్‌ (68), ఫకర్‌ జమాన్‌ (81) అర్ధశతకాలతో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో పాక్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.

    PAK vs BAN: బంగ్లాదేశ్‌ ఆలౌట్

    ప్రపంచకప్‌లో భాగంగా నేడు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. లిట్టన్ దాస్‌ (45), మహ్మదుల్లా (56), షకీబ్ అల్ హసన్ (43), హసన్ మిరాజ్ (25) పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. పాక్‌ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3, మహ్మద్‌ వసీమ్‌ 3, హారిస్ రవూఫ్‌ 2, ఉసామా మీర్, ఇఫ్తికార్ అహ్మద్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

    NED vs BAN: నెదర్లాండ్స్ ఘన విజయం

    నేడు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ఘన విజయం సాధించింది. 87 పరుగుల తేడాతో బంగ్లాను నెదర్లాండ్స్‌ ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 142 పరుగులకే ఆలౌట్ అయింది. మెహదీ హసన్ మిరాజ్ (35) తప్పా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ 4, బాస్‌ డీ లీడే 2, ఆర్యన్ దత్‌, వాన్‌ బీక్, అకెర్మాన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

    BAN vs NED: నెదర్లాండ్స్ ఆలౌట్

    ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాక్ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్స్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. నెదర్లాండ్స్ బ్యాటర్లు స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (68), వెస్లీ బరేసి (41) సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (35) మిగిలిన బ్యార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షోరిపుల్ ఇస్లామ్ 2, ముస్తాఫిజుర్ రహ్మన్‌ 2, మెహదీ హసన్ 2, షకీబ్‌ అల్ హసన్‌ ఒక వికెట్ పడగొట్టారు

    స్వదేశానికి వెళ్లిన షకీబ్‌.. ఎందుకంటే?

    వరల్డ్‌కప్‌ మధ్యలో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్ అల్‌ హసన్‌ శిక్షణ కోసం ఢాకాకు వెళ్లాడు. తన మెంటార్‌ నజ్ముల్‌ అబెదీన్‌ ఫహీమ్‌తో కలిసి షేర్‌ బంగ్లా స్టేడియంలో ప్రాక్టీస్‌ చేశాడు. దాదాపు మూడు గంటల పాటు అతడి శిక్షణ కొనసాగింది. ప్రధానంగా త్రోడౌన్‌లను షకీబ్‌ ప్రాక్టీస్‌ చేసినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌ తన తర్వాతి రెండు మ్యాచ్‌లను నెదర్లాండ్స్‌ (29న), పాకిస్థాన్‌ (31న) జట్లతో ఆడనుంది. టోర్నీలో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన బంగ్లా, ఒక్కదాంట్లో గెలిచి, నాలుగింట్లో ఓడింది.

    రెండు రైళ్లు ఢీకొని 20 మంది మృతి

    బంగ్లాదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో ఉన్న రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కొల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ధ్వంసమైన కోచ్‌లను తొలగించేందుకు క్రేన్లను ఉపయోగిస్తున్నారు. .

    ఆ వైడ్‌ బాల్‌పై బంగ్లాదేశ్ క్లారిటీ

    బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.. అయితే కోహ్లీ సంచరీని అడ్డుకునేందుకు బంగ్లా బౌలర్ ఉద్దేశపూర్వకంగా వైడ్ బాల్ చేశాడని విమర్శలు ఎదురయ్యాయి. దీనిపై బంగ్లా కెప్టెన్ నజ్ముల్ శాంటో స్పందించాడు. ‘వైడ్ బాల్ వేయాలని ప్రత్యేక వ్యూహం ఏమిలేదు. బౌలింగ్ చేస్తున్నప్పుడు వైడ్లు వేయడం సహజం. కోహ్లీ విషయంలో కూడా అలా జరిగిపోయింది. ఎలాంటి ప్లాన్ చేయలేదు. వైడ్ బాల్ వేయాలనే ఉద్దేశం ఏ బౌలర్‌కు ఉండదు’ అని శాంటో క్లారిటీ … Read more

    సొంత జట్టుపై పాక్ నటి విమర్శలు?

    ఇటీవల పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారి ఓ ఆసక్తికర ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. భారత్‌ను ఓడిస్తే బంగ్లాదేశ్ క్రికెటర్‌తో డేట్ డిన్నర్‌కి వెళ్తానని ప్రకటించింది. అయితే నిన్న బంగ్లా ఓటమి తర్వాత ఆమె మరో ఆసక్తికర ట్వీట్ చేసింది. బంగ్లా ఆటను అభినందిస్తూ తన సొంత జట్టు పాక్‌పై పరోక్షంగా విమర్శలు చేసింది. ‘భారత్‌తో వారి సొంతగడ్డపై బంగ్లా గట్టిగా పోరాడింది. కొన్ని జట్లు పోటీని కూడా ఇవ్వలేకపోయాయి’, అని షిన్వారీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.