• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్ పోలీస్ బాస్ ఎవరు..?

    ఎన్నికల వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. తెలంగాణ సీఎస్ శాంతికుమారి ముగ్గురు పేర్లతో కూడిన లిస్టును సీఈసీకి పంపించారు. ఈ ముగ్గురిలో ఒకరి పేరును నగర సీపీగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం లోపు ఈసీ నిర్ణయం వెలువడుతుందనే చర్చ జరుగుతోంది. కీలకమైన పోస్ట్ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది.

    20 మంది అధికారులకు ఈసీ షాక్

    తెలంగాణలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న 20 మంది అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. నలుగురు కలెక్టర్లు, ముగ్గురు పోలీస్ కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, అబ్కారీ శాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, రవాణా శాఖ కార్యదర్శిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వారికి ఎలాంటి విధులు అప్పగించొద్దని సీఎస్ శాంతికుమారిని ఆదేశించింది. కాగా, వీరిలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ ఉన్నారు.

    ఎన్నికల తేదీల విషయంలో బీజేపీ వ్యూహం..?

    ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను పరిశీలిస్తే తేదీల విషయంలో సీఈసీని బీజేపీ ప్రభావితం చేసిందా అనే అనుమానం కలుగుతోందని పలువురు అంటున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మిజోరాం, మధ్యప్రదేశ్‌లలో ముందుగా ఎన్నికలు నిర్వహించడం.. ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో చివరలో ఎన్నికలుండటమే దీనికి కారణమనే వాదన వినిపిస్తోంది. ముందుగా తాము అధికారంలో ఉన్న చోట ఎన్నికలు పూర్తి చేస్తే ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒత్తిడి లేకుండా ప్రచారం చేసుకునేందుకే ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఉచిత హామీలను అడ్డుకోలేం: సీఈసీ

    ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలను తాము అడ్డుకోలేమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. సోమవారం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో ఎన్నికల హామీలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలను ఎప్పటి లోగా అమలు చేస్తాయో రాజకీయ పార్టీలు చెప్పేలా ఒక విధానం తీసుకొచ్చామని చెప్పారు. హామీలను ఏ విధంగా, ఎప్పటి లోగా అమలు చేస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని రాజీవ్ పేర్కొన్నారు.

    8న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్

    తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 8-10వ తేదీల మధ్య విడుదల కానుంది. అయితే ఆదివారమే షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, చత్తీస్‌ఘర్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 10-15 మధ్య ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

    తెలంగాణకు ఎంతో ప్రాధాన్యత ఉంది: సీఈసీ

    రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ‘యంగెస్ట్ స్టేట్ తెలంగాణ.. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం. రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి.. అక్రమ నగదు – మద్యంను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు’ అని పేర్కొన్నారు.

    ఎన్నికల సన్నద్ధతపై వరుస భేటీలు

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. అధికారులతో ఎన్నికల సంఘం వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలు నిర్వహిస్తోంది. వరుసగా రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానం, మోడల్ కోడ్ అమలు వంటి వాటిపై సమాలోచనలు జరిపారు. కొందరు కలెక్టర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.