• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సబ్‌స్టేషన్‌కు మొసలిని తీసుకెళ్లి నిరసన

  విద్యుత్‌ సంక్షోభంపై కర్ణాటక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మొసలిని సబ్‌స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రొణిహాల గ్రామంలోని పొలాల్లో ఈ మొసలిని గుర్తించినట్లు రైతులు తెలిపారు. రాత్రి సమయంలో పాము, తేలు, మెుసలి బారిన పడి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యుత్‌ అధికారులను నిలదీశారు. కరెంటు లేక పంట పొలాలు ఎండిపోతున్నట్లు వాపోయారు. … Read more

  మెుసలిని శునకంగా సాకుతున్న వ్యక్తి

  అమెరికాలో మెుసలిని ఓ వ్యక్తి పెంపుడు శునకంగా సాకుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. హెన్నీ అనే వ్యక్తి బేస్‌ బాల్‌ చూసేందుకు ఈ మెుసలితో వెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. మెుసలితో ఫొటోలు వీడియోలు తీసుకున్నారు. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందని ఎవరిపై దాడి చేయదని హెన్నీ తెలిపాడు. 2015లో దానిని దత్తత తీసుకున్నట్లు చెప్పాడు. దానికి వాలీ అనే పేరు కూడా పెట్టినట్లు పేర్కొన్నాడు. ఇది 56 అడుగుల పొడవు ఉంటుందని చెప్పుకొచ్చాడు. A man, … Read more

  ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ను చంపిన మెుసలి

  ఓ మెుసలి ఫుట్‌బాల్‌ ఆటగాడ్ని బలితీసుకుంది. ఈత కొట్టేందుకు నదిలో దిగిన కోస్టారికా ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లోపెజ్‌ ఓర్టిజ్‌ను మొసలి చంపేసింది. ఈ ఘటన శాంతా క్రూజ్‌ నగరానికి దగ్గర్లో జరిగింది. మొసళ్లు ఉన్నాయనే కారణంతోనే ఆ నదిలో ఈత కొట్టడాన్ని నిషేధించారు. కానీ లోపెజ్‌ మాత్రం అది పట్టించుకోకుండా నీళ్లలోకి దూకాడు. అతణ్ని చంపిన మొసలి.. ఆ శవాన్ని నోట కరుచుకునే నీళ్లలో తిరిగింది. చివరకు మొసలిని తుపాకీతో కాల్చి చంపి, మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. డిపోర్టివో రియో కేనస్‌ క్లబ్‌ తరపున … Read more

  మెుసలిని పెళ్లాడిన మేయర్‌

  మెక్సికోలోని శాన్‌ పెడ్రో హువామెలులా పట్టణ మేయర్‌ విక్టర్‌ హ్యూగో సోసా ఓ మెుసలిని పెళ్లి చేసుకున్నాడు. చొంటల్‌, హువే అనే రెండు సమూహాల మధ్య శాంతి కొనసాగాలనే ఉద్దేశంతో అలీసియా ఆడ్రియానా అనే ఆడ ముసిలిని పెళ్లాడాడు. ప్రజలు పెళ్లికుమారుడిని చొంటల్‌ రాజుగా, మొసలిని రాణిగా భావిస్తారు. ఈ వేడుకకు ముందు ప్రజలు మొసలిని తమ ఇంటికి తీసుకు వెళ్లి ప్రత్యేక నృత్యం చేస్తారు. అనంతరం మొసలిని పెళ్లి వస్త్రాలతో అలంకరిస్తారు. This marriage? is historical. This will be written … Read more

  మెుసలితో ఆటలా?

  ఓ వ్యక్తి మెుసలిని ఆటపట్టిస్తూ ప్రాణాలతో చెలగాటమాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో [వైరల్‌](url) అయ్యింది. మెుసలిలా ఉండే దుస్తులు ధరించి దానిపక్కనే పాకాడు. అంతేకాదు, అది ముందుకు చూస్తుండగా చేయి బయటకు తీసి దాన్ని తాకేందుకు ప్రయత్నించాడు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అతడు ధైర్యవంతుడని కొందరు అంటుంటే మరికొందరు తెలివి తక్కువతనం అంటూ తిడుతున్నారు. ప్రాణాలకు ముప్పు తెచ్చే జంతువులతో జాగ్రత్తగా ఉంటే మంచిదంటున్నారు. कौन सा नशा किए थे…#crocodile #Viral #TrendingNow pic.twitter.com/VHTMF56ope — Narendra Singh (@NarendraNeer007) … Read more

  ఇదెక్కడి మొసలిరా బాబు.. చిరుతలా పరిగెడుతుంది !

  సాధారణంగా మొసళ్ళు నీళ్లలో చాలా గంభీరంగా తిరుగుతూ ఉంటాయి. నెల మీద కూడా పాకుతూ భయాన్ని పుట్టిస్తాయి. కానీ అమెరికాలోని ఓ జూ పార్కులో ఓ మనిషి వెనకాల మొసలి చిరుతలా పరిగెడుతున్న వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా తన ట్విట్టర్‌లో ‘మొసలి ఇలా పరిగెత్తడం మీరెప్పుడైనా చూశారా’ అంటూ పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. మొసలి పరిగెడుతున్న వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. I had never seen … Read more

  VIRAL: నీటిలోని మొసలినే ఎత్తుకెళ్లింది

  నీటిలోని మొసలి ఏనుగును కూడా లాగేస్తుందనే విషయం మనకు తెలిసిందే. అలాంటి మొసలిని ఓ పులి నీటిలోంచి బయటికి లాక్కొచ్చిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో నీళ్లలో ఉన్న మొసలిని గమనించిన పులి.. నీటిలోకి దూకింది. దూకిన వెంటనే మొసలిని తన నోట్లో బంధించి బయటికి లాక్కొచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ‘వాట్ ఏ పవర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. https://twitter.com/TheFigen/status/1558886132619804672?s=20&t=0Z7SCby7lZO2ZJfwLljRlQ