ఓ వ్యక్తి మెుసలిని ఆటపట్టిస్తూ ప్రాణాలతో చెలగాటమాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో [వైరల్](url) అయ్యింది. మెుసలిలా ఉండే దుస్తులు ధరించి దానిపక్కనే పాకాడు. అంతేకాదు, అది ముందుకు చూస్తుండగా చేయి బయటకు తీసి దాన్ని తాకేందుకు ప్రయత్నించాడు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అతడు ధైర్యవంతుడని కొందరు అంటుంటే మరికొందరు తెలివి తక్కువతనం అంటూ తిడుతున్నారు. ప్రాణాలకు ముప్పు తెచ్చే జంతువులతో జాగ్రత్తగా ఉంటే మంచిదంటున్నారు.