• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఘోరం.. కాల్పుల్లో 22 మంది మృతి

  అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లెవిస్టన్‌, మైనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో దాదాపు 60 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  అత్తను కాల్చిచంపిన అల్లుడు

  TS: హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓవ్యక్తి అత్తను అల్లుడు కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళ్తే గుండ్ల సింగారానికి చెందిన రమాదేవికి, ప్రసాద్‌తో 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో మూడేళ్లుగా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్‌.. తుపాకీని తీసుకుని అత్తగారి ఇంటికి వెళ్లాడు. అక్కడ అత్త కమలమ్మ(53)కు ప్రసాద్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపంతో ప్రసాద్ తుపాకీతో కమలమ్మను కాల్చిచంపాడు.

  కుటుంబాన్ని తప్పించి.. తూటాలకు బలై..

  ఇజ్రాయెల్‌‌లో అమాయక ప్రజలను హమాస్ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో మన హృదయాన్ని మెలిపెట్టేలా ఉంది. ఉగ్రవాదుల బారి నుంచి తన కుటుంబాన్ని రక్షించుకుని తను మాత్రం హమాస్‌ల తూటాలకు బలయ్యాడు. ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడ్డాన్ని గమనించి ఆ వ్యక్తి వెంటనే ఇంటి కిటికీ నుంచి కుటుంబసభ్యులను తప్పించాడు. ఈ క్రమంలో తాను తప్పించుకుంటుండగా అప్పటికే ముష్కరులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు కిటికీ వద్దే ప్రాణాలు కోల్పోయాడు. GRAPHIC: A heartbreaking video of a father … Read more

  టీచర్‌పై విద్యార్థులు కాల్పులు

  ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు స్కూల్ విద్యార్థులు రెచ్చిపోయారు. తమ స్కూల్ టీచర్‌పై గన్‌తో కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి ఓ వీడియో సందేశాన్ని పంపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కోచింగ్ సెంటర్లో పాఠాలు చెబుతున్న టీచర్‌ను విద్యార్థులు బయటకు రమ్మని పిలిచారు. వెంటనే అక్కడకు వచ్చిన టీచర్‌పై సదరు విద్యార్థులు వరస కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్ గాయం కావడంతో టీచర్‌ను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  మ్యాచ్ ఆడుతుండగా గ్రౌండ్‌లోకి పాము

  లంక ప్రీమియర్‌ లీగ్‌లో మరోసారి పాము కలకలం రేపింది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో నువాన్‌ ప్రదీప్‌ బౌలింగ్‌ చేసే ముందు ఫీల్డింగ్‌ సెట్‌ చేస్తుండగా గ్రౌండ్‌లోకి పాము ప్రవేశించింది. ఫీల్డ్‌ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా అటుఇటు జరుగుతున్న ఉదాన పామును తొక్కబోయాడు. అయితే ఆ భారీ పామును చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అనంతరం ఆ పాము మైదానంలో నుంచి వెళ్లిపోయి బౌండరీ లైన్‌ అవతల ఉన్న కెమెరాల వద్దకు వెళ్లింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, Lucky escape for @IAmIsuru17 from … Read more