• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇజ్రాయేల్‌కు ‘హమాస్’ ఆఫర్

    గాజాపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు ఆపితే తమ చెరలో ఉన్న ఇజ్రాయేల్, ఇతర దేశాల పౌరులను విడిచి పెడతామని ఉగ్రసంస్థ హమాస్ తాజా ప్రతిపాదన చేసింది. గాజాలో ఇజ్రాయేల్ ఆక్రమించిన ప్రాంతాలను వదిలి వెళ్లాలి. వైమానిక దాడులను నిలిపివేయాలి. ఎలాంటి బాంబు దాడులు చేయకూడదు. బాంబు దాడులు ఆపితే గంటలోనే వారిని విడిచిపెడతామని ఆఫర్ ఇచ్చింది. హమాస్ బందీలుగా దాదాపు 200 మంది ఇజ్రాయేల్, ఇతర దేశాల పౌరులు ఉన్నట్లు సమాచారం.

    రేపు ఇజ్రాయేల్‌లో జోబైడెన్ పర్యటన

    రేపు ఇజ్రాయేల్‌లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పర్యటించనున్నారు. హమాస్ ఉగ్రదాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయేల్‌కు అండగా నిలిచేందుకే బైడెన్ అక్కడ పర్యటిస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతారు. అనంతరం ఇజ్రాయేల్ నుంచి జోర్డాన్ రాజధాని అమ్మన్‌కు వెళ్తారు. అక్కడ ఆ దేశ రాజు అబ్దుల్లా, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమవుతారు. పాలస్తీన ప్రజల ప్రతినిధులుగా హమాస్‌ను గుర్తించమని ఈ భేటీలో ఆయన ప్రకటించనున్నారు.

    ఇస్లాం దేశాల అత్యవసర భేటీ!

    ఇజ్రాయేల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో ఆర్గనైజేషన్‌ ఆప్ ఇస్లామిక్ కంట్రీస్ కూటమి(OIC) సభ్య దేశాల భేటీకి పిలుపునిచ్చింది. ఈ కూటమికి సౌది అరేబియా నాయకత్వం వహిస్తోంది. గాజాలో ఏర్పడిన మానవత సంక్షోభం దృష్ట్యా సమావేశానికి ఆహ్వానించింది. గాజాలో సామాన్యుల పరిస్థితి హృదయ విదారకంగా మారింది. యుద్ధాన్ని నిలువరించేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల ఇజ్రాయేల్‌తో కుదిరిన ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇదే విషయాన్ని అమెరికా, ఇజ్రయేల్‌కు స్పష్టం చేసింది.

    హమాస్‌ కీలక నేత హతం

    ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హమాస్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఒకరిని మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. నిన్న రాత్రి జరిగిన వైమానికి దాడుల్లో హమాస్‌ వైమానిక విభాగానికి అధిపతిగా పనిచేసిన మురాద్ అబు మురాద్ మృతి చెందినట్లు పేర్కొన్నాయి. హమాస్‌ వైమానిక కార్యకలాపాల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న రాత్రి దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి.

    గాజా స్ట్రిప్‌లో తీవ్రంగా ఫుడ్ కొరత

    గాజా స్ట్రిప్ ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల కొరత సైతం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంపై గత గురువారం జరిగిన రాకెట్ల దాడిలో వెయ్యి మందకి పైగా పౌరులు మృతి చెందారు. యుద్ధ వాతావరణం కారణంగా అక్కడి ప్రజలు చాలా మంది ఇజ్రాయెల్, ఈజిప్ట్ భూ భాగంలోకి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు వారిని నిలువరించడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

    బాంబులతో దద్దరిల్లుతున్న గాజా

    గాజా బాంబుల మోతలతో దద్దరిల్లుతోంది. గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 1900 మంది చనిపోయారు. బందీలకు ఎలాంటి హాని చేసినా పాలస్తీనా అంతు చూస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు గాజాలో 900 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీన తెలిపింది. మరోవైపు హమాస్ ఉగ్రవాదుల దాడిలో 14 మంది అమెరికన్లు చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు.

    1500 మంది మిలిటెంట్లను ఏరిపారేశాం: ఇజ్రాయెల్

    తమ దేశంలోకి చొరబడి మారణ హోమం సృష్టిస్తున్న హమాస్ ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఏరిపారేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దాదాపు 1500 మంది హమాస్ ఉగ్రవాదుల మృత దేహాలను గుర్తించినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలు పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చినట్లు చెప్పారు. ఉగ్రవాదులు ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి వారిని తరిమికొట్టినట్లు ప్రకటించింది. అయితే ఇంకా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు వివరించాయి.

    హమాస్ మిలిటెంట్ల మారణ హోమం

    ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు మారణ హోమం సృష్టించారు. ఒకే సారి 260 మంది ప్రాణాలు తీసి కర్కశంగా వ్యవహరించారు. గాజా సరిహద్దులోని కిబ్బుజ్ రీమ్ వద్ద జరిగిన ఓ మ్యాజిక్ పార్టీకి దాదాపు 3 వేల మంది హాజరుకాగా మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో వారంతా కార్లలో పారిపోయేందుకు ప్రయత్నించగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారిపై మిలిటెంట్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మరికొన్ని చోట్ల ఇళ్లలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు.

    యుద్ధం కోరుకోలేదు.. కానీ తప్పడం లేదు

    ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం తాము మొదలు పెట్టలేదని.. అయితే ముగింపు మాత్రం తామే ఇస్తామని వెల్లడించారు. ఇజ్రాయెల్ యుద్దం కోరుకోలేదని, అయినప్పటికీ దేశం కోసం తప్పడం లేదని చెప్పారు. హమాస్ సైతం ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థేనని, ప్రజలంతా ఏకమై దానిని ఓడించాలని కోరారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిస్తే నాగరిక ప్రపంచం మొత్తం గెలిచినట్లేనని ఆయన అన్నారు.

    ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న ప్రముఖ నటి

    ప్రముఖ బాలీవుడ్ నటి నుస్రత్ బరుచ్చా ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఇజ్రాయెల్ వెళ్లిన ఆమె ఆ దేశంలోనే ఉండిపోయారు. ప్రస్తుతం అక్కడ భీకర యుద్ధం కొనసాగుతుండడంతో ఆమెతో కమ్యునికేషన్‌ సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నటి ఎక్కడో ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే నిన్న తన బృందంలోని ఒకరితో మాట్లాడుతూ ఓ బేస్‌మెంట్‌లో దాక్కున్నట్లు నటి తెలిపింది.