• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మేనేజర్‌ను చితకబాది చంపేశారు! వీడియో వైరల్

    [వీడియో:](url) ఓ స్టోర్ మేనేజర్‌ను కొంతమంది వ్యక్తులు దారుణంగా కొట్టి, హింసించి చంపేశారు. ఈ ఘటన యూపీలోని షాజహాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. బంకిమ్ సూరి అనే వ్యాపారవేత్త వద్ద శివమ్ జోరి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ పార్శిల్ కనిపించలేదనే నెపంతో శివమ్‌ను తాళ్లతో కట్టివేశారు. అనంతరం ఆరుగురు వ్యక్తులు కర్రలు, రాడ్లతో అతడిని చితకబాదారు. దెబ్బలకు తాళలేక అతడు ప్రాణాలు వదిలాడు. అనంతరం అతడి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట పడేసి వెళ్లిపోయారు. A man in Uttar Pradesh's #Shahjahanpur … Read more

    మూగజీవంపై నిస్వార్థ ప్రేమ; వీడియో వైరల్

    రహదారిపై గాయాలతో పడి ఉన్న కుక్కను ఓ వ్యక్తి కాపాడాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఏదో వాహనం ఢీకొట్టటంతో కుక్క అపస్మారక స్థితిలో రోడ్డుపైనే పడి ఉంది. ఇది గమనించిన ఓ యువకుడు దానిని కాపాడి.. ఇంటికి తీసుకెళ్లి గాయాలకు ప్రథమ చికిత్స అందించాడు. అతడి నిస్వార్థ సేవకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. https://www.instagram.com/reel/Cnevd5mpuDL/?utm_source=ig_web_copy_link

    మెట్రోలో చంద్రముఖి; పరుగులు తీసిన వ్యక్తి

    ఓ యువతి చంద్రముఖి అవతారంలో వచ్చి మెట్రోలోని ప్రయాణికులను హడలెత్తించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూల్..భూలయ్య(చంద్రముఖి) సినిమాలోని మంజులిక పాత్ర దుస్తులు ధరించి అచ్చం చంద్రముఖిలా మెట్రో ట్రైన్‌లోకి ప్రవేశించింది. నడుచుకుంటూ వెళ్తూ ప్రయాణికులను భయపెట్దింది. ఓ ప్రయాణికుడు ఆమెను చూసి పరుగులు తీశాడు. యువతి ప్రవర్తనపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by The RealShit Gyan (@the.realshit.gyan)

    బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన వ్యక్తి; వీడియో వైరల్

    ఓ వ్యక్తి బ్యాడ్మింట్ ఆడుతూనే కుప్పకూలి మరణించాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఈ ఘటన మస్కట్‌లో చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితులతో కలసి కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. చాలా హుషారుగా కోర్టులో అటు ఇటు పరిగెత్తుతూ గేమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో ఆ వ్యక్తి ఉన్నట్లుండి కోర్టులోనే కుప్పకూలిపోయాడు. స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. 2 Jan 2023 : Indian-origin man dies of ? attack? while … Read more

    వ్యక్తిని కంగారు పెట్టించిన కంగారూ

    ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తిని కంగారూ పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఏమైందో ఏమో ఓ వ్యక్తిని కంగారూ వెంబడించింది. ఈ క్రమంలో అతడు అదుపుతప్పి కిందపడిపోతాడు. అప్పుడ అది అతడని కాళ్లతో తన్నుతుంటుంది. చివరకు దాని నుంచి తప్పించుకుని ఓ కర్ర సాయంతో అదుపు చేస్తాడు. కానీ కంగారూ అస్సలు పట్టు విడవడం లేదు. ఎలాగోలా దాని బారి నుంచి ఆ వ్యక్తి బయటపడతాడు.

    సింహంతో పరాచకాలు; జులాయికి ముచ్చెమటలు

    ఓ వ్యక్తి సింహాన్ని ముట్టుకునేందుకు ప్రయత్నించి చావు దెబ్బ తిన్నాడు. జూలో రెండు సింహాలు ఉండగా ఓ వ్యక్తి వాటిని మచ్చిక చేసుకునేందుకు సింహంపై చేయి పెడతాడు. దీంతో ఆగ్రహంతో అతడి చేతిని తన నోటిలోకి లాక్కుంటుంది. చేతిని సింహం గట్టిగా కొరకడంతో బాధతో విలవిల్లాడాడు. అతడికి సాయం చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. కానీ సింహమే అతడిని వదిలేయడంతో బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. https://twitter.com/ViciousVideos/status/1607347367824474112?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1607347367824474112%7Ctwgr%5E7c6d15689d99dc1c7377b32bf1fe1218b242f237%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Finternational%2Fhorrifying-video-man-tries-pet-caged-lion-see-what-happens-next-1514315