ఎంపీ విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ హైకోర్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో విజయసాయి మాట్లాడుతూ ‘‘ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు పరిధి దాటి ప్రవర్తించింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో రాష్ట్రం చూసుకుంటుంది. ఈ విషయంలో హైకోర్టు తలదూర్చడం భావ్యంగా లేదు. రాష్ట్రానికి శాసనాధికారం లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాజధాని ఒక చోట.. హైకోర్టు మరో చోట ఉన్న రాష్ట్రాలు లేవా? ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం మర్చిపోయింది.’’ అంటూ ఘాటుగా విమర్శిచారు.