• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఆ కుటుంబాలకు రూ.30లక్షల పరిహారం’

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మురుగును శుభ్రం చేసే కార్మికులు మృతిచెందితే వారి కుటుంబాలకు పరిహారం అందజేయాలని ఆదేశించింది. దేశంలో మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ కార్మికులు చనిపోతున్నారని పిటిషన్ దాఖలైంది. దానిపై న్యాయస్థానం విచారణ జరిపింది. మురుగు శుభ్రం చేస్తూ కార్మికులు మృత్యువాతపడితే వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.30లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశించింది.

    చంద్రబాబు బెయిల్ విచారణ వాయిదా

    ఫైబర్‌నెట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ విచారణ సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు న్యాయవాది కోర్టు విచారణ జరిగేవరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను పొడిగించాలని కోరారు. అప్పటివరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని ఆయన సుప్రీంకోర్టుకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం వరకు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబను అరెస్టు చేయోద్దని సుప్రీం ఆదేశించింది.

    ‘ఆదిపురుష్’కు ఊరట.. కేసులు కొట్టేసిన సుప్రీం

    హీరో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా ఉందని కొందరు కోర్టుమెట్లు కూడా ఎక్కారు. తాజాగా వాటిన్నిటిని కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ ఇచ్చాక.. ఇక ఏ విషయంలో విచారణ అవసరం లేదని సుప్రీం పేర్కొంది. దీనిపై కోర్టు వాదనలు వ్యర్థమేనని చెప్పింది. అయితే ఆదిపురుష్ చిత్రాన్ని ఓంరౌత్ దర్శకత్వం వహించారు. చిత్రంలోని పాత్రల వేషధారణ, కొన్ని సన్నివేశాల్లో వాడిన బాషపై విమర్శలు వచ్చాయి.

    చంద్రబాబు పిటిషన్ వాయిదా

    చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ కేసును కొట్టివేయాలని చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు సుప్రీంలో విచారణ జరిగింది.

    సుప్రీంకోర్టులో రేవంత్‌కు భంగపాటు

    టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేయడంతో రేవంత్‌రెడ్డికి భంగపాటు తప్పలేదు.