• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తమిళనాడులో భారీ వర్షాలు

    తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించింది. మరోవైపు.. 12 జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కోయంబ‌త్తూరు, తిరువూర్, మ‌ధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో గురువారం కుండ‌పోత వాన కురిసింది.

    బస్సు బోల్తా 22 మందికి గాయాలు

    AP: చిత్తూరు జిల్లాలో ప్రమాదం జరిగింది, ప్రైవేటు బస్సు బోల్తా 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు- వేలూరు జాతీయ రహదారిపై వద్ద అదుపుతప్పింది. ఈ క్రమంలో గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు తీవ్రంగా గాయపడ్డారు.మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    విడుదలకు ముందు ‘లియో’కి షాక్

    విజయ్‌ హీరోగా నటించిన ‘లియో’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాతలకు తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. ఈ సినిమా మొదటి రోజు ఉదయం 4గంటల షోకు అనుమతించాలని ప్రభుత్వాన్ని చిత్ర బృందం కోరింది. అయితే వారి అభ్యర్థనను ప్రభుత్వం నిరాకరించింది. అలాగే ఉదయం 7గంటల షోను కూడా రద్దు చేసింది. అక్టోబర్‌ 19 ఉదయం 9నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ప్రదర్శించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.

    బాణసంచా కేంద్రంలో పేలుడు..7 మంది మృతి

    తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. రంగపాళ్యంలోని ఓ కేంద్రంలో బాణసంచా గోదాములో జరిగిన పేలుళ్ల ఘటనలో ఏడుమంది మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సేవల సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసేశారు. మృతులంతా అక్కడే పనిచేసే కార్మికులు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదాల్లో ఎంతమందికి గాయాలయ్యాయనే సమాచారం తెలియలేదు.

    ప్రాణాలకు తెగించి పామును కాపాడాడు

    ఓ ప‌ర్యావ‌ర‌ణ వేత్త చేసిన సాహ‌సానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. త‌మిళ‌నాడులోని క‌డ‌లూరు జిల్లాకు చెందిన నటరాజన్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషసర్పాన్ని కాపాడాడు. బాటిల్‌తో నీళ్లుతాగించి బతికించాడు. పాము మెల్లిగా కోలుకోవ‌డంతో దాన్ని పెద్ద ప్లాస్టిక్ బాటిల్‌లోకి ఎక్కించి అడ‌విలో విడిచిపెట్టాడు. విష‌పూరిత‌మైన ఆహారం వల్లే పాము డీహైడ్రేష‌న్‌కు గురైందని న‌ట‌రాజ‌న్‌ చెప్పుకొచ్చాడు. Man gives water to cobra straight from bottle to revive it, video goes viral pic.twitter.com/K0JUateWqp — $h!v@ (@Shivakumar50) July 5, 2023