• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ప్రజలు చనిపోతున్నారు.. చర్చలు జరపండి’

    రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్దంలో ఏ దేశానికి విజయం దక్కదన్నారు. యుద్ధం కాణంగా ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధం ఫలితంపై ప్రతిష్టంభన నెలకొంది. ఎవరూ పూర్తి స్థాయిలో పుంజుకోలేక పోతున్నారు. కాబట్టి ఇరు దేశాలు చర్చలు జరుపుకొని ఓ నిర్ణయానికి రండి’. అని అలెగ్జాండర్ పిలుపునిచ్చారు.

    ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 50 మంది మృతి

    రష్యా క్లిపణి దాడిలో ఉక్రెయిన్‌లో 50 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఖర్కివ్‌ రీజియన్‌ కుపియాన్స్క్‌ జిల్లాలోని గ్రోజా గ్రామంపై ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రష్యా క్షిపణులతో విరుచుకపడింది. దాడి జరిగిన ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మరోపైపు ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ బలోపేతానికి సాయం చేయాలని మిత్రదేశాలను అభ్యర్థించింది.

    ఆకాశంలో భారీ వెలుగు.. హడలిపోయిన ప్రజలు

    [VIDEO](url): ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ గగనతలంలో ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. నాసాకు చెందిన ఉపగ్రహం భూ వాతావరణంలోకి ప్రవేశించడం వల్లే ఈ పరిణామం చోటుచేసుకుందని అధికారులు ప్రకటించారు. అంతకుముందు ఈ వెలుగును చూసిన కీవ్‌ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రష్యా వైమానిక దాడులు చేస్తోందని భయపడ్డారు. దీనికి అనుగుణంగా ఉక్రెయిన్‌ సైన్యం నుంచి వైమానిక దాడి హెచ్చరికలు జారీ అయ్యాయి. వెలుగు దృశ్యాలను పలు ఉక్రెయిన్‌ ఛానెళ్లు ప్రసారం కూడా చేశాయి. అయితే దీనిపై నాసా క్లారిటీ ఇవ్వడంతో కీవ్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. … Read more

    రష్యా క్షిపణిని కూల్చిన ఉక్రెయిన్ సేనలు

    [VIDEO:](url) ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా సేనలు క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేస్తున్నాయి. రష్యా మిసైల్ దాడులను ఉక్రెయిన్ సైతం అదే స్థాయిలో తిప్పికొడుతోంది. తాజాగా తక్కువ ఎత్తులో వచ్చి రష్యా క్రూయిజ్ క్షిపణిని ఉక్రెయిన్ సేనలు ధ్వంసం చేశాయి. ఈ వీడియోను ఉక్రెయిన్ అధికారులు షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Spectacular footage: Two Russian Kalibr cruise missiles shot down within seconds over Kyiv Oblast … Read more