• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి

    అమెరికాలోని శాన్ డియాగో ‘కామిక్ కాన్’ ఈవెంట్‌లో జులై 20న(జులై 21న ఇండియాలో) ప్రాజెక్ట్K టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా సెయింట్ లూయిస్ మిస్సోరిలో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేక ఫీట్ చేశారు. అమెరికా వీధుల్లో కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం, ప్రాజెక్ట్ లోగో ఆకారంలో వచ్చే విధంగా వాహనాలను నిలిపి ఉంచారు. ‘లవ్ యూ ప్రభాస్’ అంటూ డార్లింగ్‌పై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. A BIG shoutout to the amazing Rebel Star #Prabhas fans from … Read more

    మోదీజీ దేవుడికే పాఠాలు చెబుతారు: రాహుల్

    ప్రధాని మోదీ భారత ప్రజలను భయపెడుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడి ప్రవాస భారతీయులతో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంతా తమకే తెలుసనుకునే వారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. చరిత్రకారులకే చరిత్ర చెప్పేలా, సైన్యానికే యుద్ధం నేర్పేలా చేస్తారు. చివరికి దేవుడికి కూడా పాఠాలు చెప్పేలా తయారయ్యారు. అలాంటి వారిలో ఒకరు మోదీ’ అంటూ కాలిఫోర్నియాలో జరిగిన మీటింగ్‌లో రాహుల్ విరుచుకు పడ్డారు. Just listen the speech of Mr #RahulGandhi "Santa … Read more

    ఆటోలో వచ్చిన అమెరికా సెక్రటరీ

    [VIDEO:](url) దేశ రాజధాని దిల్లీలో అమెరికా ఆటో గ్యాంగ్ చక్కర్లు కొట్టింది. అమెరికా కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ మార్చి 1న జరిగిన విదేశాంగ మంత్రుల జీ20 సదస్సుకు హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో దిల్లీలోని రాయబార కార్యాలయం నుంచి ఆటోలో సమావేశ మందిరానికి చేరుకున్నాడు. బ్లింకెన్‌ను అనుసరించి మరో మూడు ఆటోలు కాన్వాయ్‌గా రావడం విశేషం. ఈ వీడియోను అమెరికన్ ఎంబెస్సీ పంచుకుంటూ ‘మా ఆటోగ్యాంగ్’ని చూడండంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. Who says official motorcades have … Read more

    బీచ్‌లో పల్టీలు కొట్టిన విమానం

    అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో తేలికపాటి విమానం ప్రమాదానికి గురైంది. లాస్ ఏంజెలెస్ బీచ్‌ వైపు వస్తున్న ఈ విహంగం అదుపు తప్పింది. దీంతో తీరం వైపునకి కదులుతూ నేలకూలింది. బీచ్‌లో పడగానే పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే, టేకాఫ్ తీసుకున్న 9 నిమిషాలకే ప్లేన్ ఇలా క్రాష్ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా.. సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు … Read more