• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • యూట్యూబ్‌లో చూసి రూ.60లక్షల ప్యాకేజీ

  యూట్యూబ్‌లో వీడియోలు చూసి గూగుల్‌లో రూ.60లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించారు రావూరి పూజిత. గుంటూరు కేఎల్ యూనివర్సిటీకి చెందిన పూజిత కోడింగ్‌పై ఆసక్తితో ఈ ఉద్యోగం సంపాదించారు. కోవిడ్19 సమయంలో కాలేజీలో చేరిన పూజిత.. రెండో సెమిస్టర్ నుంచి ఆన్‌లైన్ క్లాసులు విన్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి.. కొన్ని కోడింగ్ వెబ్‌సైట్లను సందర్శించి పూజిత ప్రిపేర్ అయ్యారు. టైం మేనేజ్‌మెంట్ చేసుకుంటూ ఆన్‌లైన్ అసెస్‌మెంట్లు, మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు. ఇలా పట్టు సాధించి గూగుల్‌లో రూ.60లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించారు. అమెజాన్, అడోబ్‌లలో … Read more

  ‘కళ్యాణం కమనీయం’ లిరిక్ వీడియో విడుదల

  సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం’. ఈ సినిమా నుంచి ‘హో ఎగిరే’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ప్రియా భవాని శంకర్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. యువి కాన్సెప్ట్స్ పతాకంపై అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాటుక కన్నే.. దాచెను నన్నే అంటూ సాగుతున్న ఈ లిరికల్ వీడియో సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. శ్రావణ్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా.. కపిల్ కపిలన్ పాటను ఆలపించాడు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ తరువాత … Read more

  ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్; గూస్‌బంప్స్ పక్కా

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ‘‘వీరయ్య.. వీరయ్య’’ టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటికే ఈ పాటను 5 మిలియన్ల మంది వీక్షించారు. ఈ పాటలో బాస్ స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దేవీశ్రీప్రసాద్ స్వరాలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, పవిత్రాచారి ఆలపించారు. ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  యూట్యూబ్‌ ఛానెల్స్ బ్లాక్

  తప్పుడు వార్తలను ప్రచారం చేసే యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. కేంద్రంతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి ఫేక్ న్యూస్ ఇస్తున్నారనే ఆరోపణలతో మూడు ఛానెళ్లను బ్లాక్ చేశారు. సీజేఐ, మోదీలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని వెల్లడించారు. వీటికి 33 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉండగా…వాటిలో ఉన్న వీడియోలన్నీ అబద్ధపు కంటెంట్‌ ఉన్నవేనని తెలిపారు. ఇందులో న్యూస్ హెడ్‌లైన్స్‌, సర్కారీ అప్‌డేట్, ఆజ్‌తక్‌ లైవ్‌ అనే ఛానెల్స్ ఉన్నాయి.

  YouTubeలో అదిరే ఫీచర్

  యూట్యూబ్‌లో నిర్దిష్టమైన సమాచారం కోసం మనం వీడియో మొత్తం చూడాల్సి ఉంటుంది. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా యూట్యూబ్ కొత్త ఫీచర్‌ని తీసుకొస్తోంది. ‘సెర్చ్ ఇన్ వీడియో’ ద్వారా వీడియోలో మనకు కావాల్సిన అంశం గురించి వెతకొచ్చు. దీంతో యూజర్లకు సమయం ఆదా అవుతుందని గూగుల్ ప్రకటించింది. దిల్లీలో జరుగుతున్న ‘గూగుల్ ఫర్ ఇండియా 2022’ కార్యక్రమంలో ఈ ఫీచర్‌ని తీసుకొస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. దిల్లీకి సంబంధించిన వీడియో చూస్తుంటే.. కింద సెర్చ్‌లో ఎర్రకోట గురించి వెతికామనుకోండి. వెంటనే పై వీడియోలోని ఎర్రకోట విజువల్స్‌ని … Read more

  17లక్షల వీడియోలు డిలీట్

  కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు 17లక్షల వీడియోలను యూట్యూబ్ డిలీట్ చేసింది. జులై నుంచి సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 56లక్షల వీడియోలను డిలీట్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. కేవలం ఒకే వ్యూ ఉన్న వీడియోలు, 10లోపు వీక్షణలు వచ్చిన వీడియోలను తొలగించినట్లు పేర్కొంది. అంతేగాకుండా, నిబంధనలకు విరుద్దహైన 73.7 కోట్ల కామెంట్లను కూడా యూట్యూబ్ తొలగించింది. కాగా, ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 11లక్షలకు పైగా వీడియోలు డిలీట్ అయ్యాయి.

  రంజింపజేస్తున్న ‘రంజితమే’ సాంగ్‌

  తమిళ్ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం వారసుడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘రంజితమే’ సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. హీరో విజయ్, ఎంఎం మానసి కలసి పాడిన ఈ పాటకు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు ఈ పాటకు యూట్యూబ్‌లో 40 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కాగా వారసుడు చిత్రాన్ని డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

  టిక్‌టాక్‌కు పోటీగా ‘షార్ట్స్ ఆన్ టీవీ’

  టిక్‌టాక్‌కు పోటీగా యూట్యూబ్ తీసుకొచ్చిన ‘షార్ట్స్ ఆన్ టీవీ’ యాప్‌ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. టీవీల్లో కూడా షార్ట్స్‌ని చూసేందుకు ఈ యాప్ వెసులుబాటు కల్పిస్తుంది. ఇంట్లోనే ఉంటూ 60 సెకన్లు, అంతకన్నా తక్కువ నిడివి ఉన్న రీల్స్‌ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. డిజైన్‌ని మరింత సులభతరం చేసి అత్యాధునికంగా ఈ యాప్‌ని తీర్చిదిద్దినట్లు కంపెనీ వెల్లడించింది. షార్ట్ వీడియోని పాస్ చేయడం, ప్లే చేయడం, వేరే వీడియోకి వెళ్లడం వంటి ఆప్షన్లను రిమోట్ ద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 30బిలియన్ల … Read more

  డాక్టర్లు, నర్సుల ఛానెళ్లను ధ్రువీకరిస్తాం: యూట్యూబ్‌

  తప్పుడు సమాచారంప్రచారం కాకుండా యూట్యూబ్‌ సామాజిక మాధ్యమం చర్యలు చేపట్టింది. డాక్టర్లు, నర్సులు సహా ఇతర ఆరోగ్యసంరక్షణ నిపుణులకు సంబంధించిన ఛానెల్స్‌ను ధ్రువీకరించిన తర్వాతే అనుమతి ఇవ్వనుంది. కరోనా మహమ్మారి, వాక్సిన్‌లకు సంబంధించిన కొన్ని వీడియోలు తప్పుడు సమాచారం అందించినందుకు యూట్యూబ్‌ విమర్శలను ఎదుర్కొంది. ఈ క్రమంలో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు యూట్యూబ్‌ స్పష్టం చేసింది.

  UPDATE: YouTubeలో హ్యాండిల్స్

  గూగుల్ అనుబంధ ప్లాట్‌ఫాం ‘YouTube’ మరో అప్డేట్‌తో ముందుకు వచ్చింది. తాజాగా ‘హ్యాండిల్స్’ ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో సులువుగా క్రియేటర్స్‌ని మనం కనుక్కోవచ్చు. క్రియేటర్స్‌తో వినియోగదారులు, యూజర్లతో క్రియేటర్లు ఒకరినొకరు నేరుగా చాట్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో క్రియేటర్స్‌తో సంభాషించాలంటే ఇదివరకు కామెంట్స్ రూపంలోనే చెప్పేవాళ్లం. కానీ ఇకనుంచి నేరుగా ఇంటరాక్ట్ అయ్యేందుకు అవకాశం కలగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.