• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tamannaah Bhatia: బ్లాక్‌ శారీలో కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ!

    మిల్కీ బ్యూటీ తమన్నా మరోమారు తన అంద చందాలతో సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. 

    బ్లాక్‌ శారీలో తెల్లటి అందాలు ఆరబోసిన ఈ భామ.. యంగ్‌ హీరోయిన్లకు తానేమాత్రం తీసిపోనని చెప్పకనే చెబుతోంది. 

    తమన్నా ఇండస్ట్రీకి పరిచయమై 18 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. 

    మెుదట బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఆ తర్వాత దక్షిణాదిలో వరుస సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. 

    ఈ ఏడాది చిరంజీవితో చేసిన ‘భోళాశంకర్‌’ చిత్రం నిరాశ పరిచినా.. రజనీకాంత్‌ ‘జైలర్‌’తో ఈ భామ ఘన విజయాన్ని అందుకుంది. 

    అయితే జైలర్‌ విజయం తర్వాత తమన్నాకు ఆ స్థాయిలో సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఫ్యాన్స్‌ కాస్త నిరాశకు గురవుతున్నారు. 

    ప్రస్తుతం తమిళంలో ‘అరణ్మణై-4’ చిత్రంతో పాటు ‘హిందీ’లో వేద సినిమాలో తమన్నా నటిస్తోంది. అలాగే మలయాళంలోనూ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లపైనా ఈ భామ ఫోకస్‌ పెట్టింది. ఇటీవల ‘లస్ట్‌ స్టోరీస్‌-2’ వెబ్‌సిరీస్‌లో తమన్నా బోల్డ్‌గా కనిపించింది. తన ప్రియుడు విజయ్‌ వర్మతో ముద్దు సీన్లలో రెచ్చిపోయింది. 

    ఇప్పటికే 11th అవర్,  నవంబర్ స్టోరీ వంటి రెండు వెబ్ సిరీస్‌లతో తమన్నా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాదిలో ‘జీ కర్డా’, ‘ఆఖ్రీ సచ్‌’ వంటి సిరీస్‌లలో కనిపించి మెప్పించింది.

    ఓ వైపు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే వ్యాపార రంగంపైనా ఈ భామ దృష్టి సారిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ భారీ మెుత్తంలో సంపాదిస్తోంది. 

    మరోవైపు భాయ్‌ ఫ్రెండ్‌ విజయ్‌ వర్మతో షికార్లు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తుంది. అలాగే సోషల్‌ మీడియాలో తన గ్రామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv