మహిళలకు వారి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకునేంత తీరిక, ఖాళీ ఉండదు. అది ఉద్యోగానికి వెళ్లే వారైనా.. ఇంట్లోనే ఉండి పనిచేసే వారికైనా ఒకటే. అయితే మహిళలకు తమ ఆరోగ్యం పట్ల, ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో చివరి బుధవారాన్ని జాతీయ మహిళల ఆరోగ్యం, ఫిట్నెస్ దినోత్సవంగా ప్రకటించారు. ఇక రోజూ మహిళలు ఫిట్‌గా ఉండేందుకు పాటించవలసిన 6 సులువైన పద్ధతులను గురించి తెలుసుకుందాం…
ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి
ప్రతిరోజు ఉదయం మనం టిఫిన్‌గా ఏమి తీసుకుంటామో… అదే మన రోజువారి అవసరాలకు శక్తినిస్తుంది. బ్రేక్ ఫాస్ట్‌గా లైట్ ఫుడ్ తీసుకోవాలి. దానిలో ఎక్కువ పోషణ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. ఫైబర్, క్యాల్షియం, విటమిన్స్, గ్లూకోజ్ వీటిలో కచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. అవే మన దేహానికి రోజుకు సరిపడా శక్తిని ఇస్తాయి.
ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరి..!
ముందుగా నడవడం, కొద్దిగా వేగంగా పరుగెత్తడం వంటి చిన్నచిన్న వ్యాయామాలతో మొదలు పెట్టాలి. ఇక మొదట్లో కొద్దిగా కండరాల నొప్పులు వస్తాయి. అవి కారణంగా చూపి వ్యాయామం విరమించుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా మన శరీరం మంచి కోసమే అని వాటిని కొద్దిగా తట్టుకుంటే సరిపోతుంది. అలాగే మీ రోజువారి ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటే మీ కండరాల శక్తి మరింత పెరిగి ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీ శరీరం వ్యాయామానికి అలవాటు పడేందుకు ఒక వారం తీసుకుంటుంది. ఆ తర్వాత రోజూ ఒక గంట సేపు వేగంగా నడవడం, జాగింగ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరే కొద్దిగా కఠినమైన వ్యాయామ పద్ధతులను నేర్చుకుంటారు.
ఎప్పుడూ నీరు త్రాగుతూ ఉండాలి
వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం నుండి ఎంతో చెమటను కోల్పోతారు. కాబట్టి నీరు తరచుగా తీసుకోవడం అత్యవసరం. నీటిని సమృద్ధిగా తాగడం వల్ల రోజంతా చురుకుగా ఉంటారు. పైగా ప్రతిరోజు నీటిని తరచుగా తీసుకుంటే డీహైడ్రేషన్ బెడద అస్సలు ఉండదు.
కార్బోహైడ్రేట్లు కట్ చేయండి
ఈ విషయాన్ని ఆడవారు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలైన అన్నం (వరి, తెల్ల బియ్యం), బిస్కెట్లు, చాక్లెట్లు వంటివాటిని పూర్తిగా మానేయాలి. ఇవి ఎక్కువగా తీసుకుంటే మీ రక్తపోటు పెరుగుతుంది. అలాగే ఇన్సులిన్ మరింతగా ఉత్పత్తి చెంది శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. మీ రోజువారి ఆహారంలో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. పచ్చగా ఉండే ఆకుకూరలను తినడం ఎంతో మంచిది, అలాగే చిక్కుడు గింజలతో పాటుగా తక్కువ కొవ్వు ఉండే మాంసం, రకరకాల చేపలను తినడం మంచిది. వీలైతే రోజుకు ఆరుసార్లు కొద్దికొద్దిగా తినడం అలవాటు చేసుకోండి. అలా చేస్తే మీకు హృద్రోగ సమస్యలతోపాటు ఉదర సమస్యలు కూడా దూరమవుతాయి.
నిద్ర ప్రధానం
రోజుకి ఎనిమిది గంటలు కార్పొరేట్ జాబ్ చేసినా… రోజంతా ఇంటి పని చేసినా అలిసిపోయే మహిళలు రోజూ సరిపడా నిద్రపోవడం ఎంతో అవసరం. కనీసం 6 నుండి 8 గంటల నిద్ర ప్రతి ఒక్కరికి అవసరం. మీరు తీసుకున్న తిండికి చేసిన వ్యాయామానికి మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. వ్యాయామం చేసిన తర్వాత అయినా లేదా ఎక్కువగా పనిచేసిన తర్వాత నిద్ర వచ్చినప్పుడు దాన్ని ఆపుకోకుండా కనీసం ఒక అరగంట అయినా పడుకోవడం ఎంతో మంచిది.
ప్రేరణ చెందండి
ఇక వీటన్నింటికీ చేసేందుకు మీకు తరచూ ప్రేరణ ఎంతో అవసరం. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండండి. మధ్యలో వచ్చే చిన్నచిన్న అడ్డంకులను కారణంగా చూపి పైన ఉన్న వేటినీ మానవద్దు. ఎక్కువకాలం సుఖమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం జీవించాలి అంటే మీరు ఎప్పటికప్పుడు ప్రేరణ చెందుతూ ఉండాలి.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్