• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RC15: రామ్‌ చరణ్ CEO  స్టోరీ ఇదేనా? కథ అయితే మాములుగా లేదు!

    ‘RRRకు  ఆస్కార్ అవార్డు రావడంతో రామ్‌చరణ్ చేసే అప్‌కమింగ్ ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ డైరెక్షన్‌లో ‘RC15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాతో బిజీబిజీగా గడుపుతున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా సినిమా కథ గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మరి ఆ విశేషాలు తెలుసుకుందాం. 

    కథ ఇదేనా?

    పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న కథను దర్శకుడు శంకర్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ ఇందులో డ్యుయల్ రోల్‌లో చేయనున్నారట. ఈ మేరకు కొన్ని సెట్ ఫొటోలు గతంలో లీక్ అయ్యాయి. గ్రామీణ నేపథ్యానికి చెందిన వ్యక్తిగా ఒక రోల్, IAS అధికారిగా మరొక రోల్‌లో చెర్రీ నటించనున్నారట. 

    తండ్రీ, కొడుకుల చుట్టూ..

    ఎన్నికల అధికారి పాత్రలో చరణ్ నటించనున్నాడు. రామ్‌చరణ్ తండ్రి ఓ రాజకీయ పార్టీ అధినేత. దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన పోరు ఉండనున్నట్లు తెలిసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకే హైలెట్‌గా ఉంటాయని సమాచారం.   వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపి, వాటిని రూపుమాపే ప్రయత్నంలో CEO గా  రామ్‌చరణ్ ఎదుర్కొన్న అనుభవాల గురించి ఇందులో చూపించనున్నారట. సినిమా మొత్తం తండ్రీ, కొడుకుల చుట్టూనే తిరుగుతుందని టాక్ 

    సామాజిక కోణం..

    శంకర్ సినిమా అంటే అందులో ఓ సోషల్ మెసేజ్ తప్పనిసరిగా ఉంటుంది. సమాజంలోని లోటుపాట్లను సినిమాల ద్వారా ప్రతిబింబించగలడు. దీంతో రామ్‌చరణ్ సినిమాలోనూ ఈ సోషల్ రిలవెన్స్ ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. చారిత్రక కట్టడమైన ‘చార్మినార్’ వద్ద ఇటీవల సినిమా షూటింగ్ జరుపుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. 

    శంకర్ మార్క్ ఎలిమెంట్స్..

    సినిమా నాణ్యత విషయంలో డైరెక్టర్ శంకర్ అస్సలు రాజీ పడరు. కచ్చితంగా ఉన్నతంగా తీర్చిదిద్దేవరకు అలసిపోడు. సాధారణంగా ఒక పాట షూటింగ్‌ని పూర్తి చేయడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. కానీ, శంకర్ మాత్రం దాదాపు 10 రోజులు కేటాయిస్తాడని సమాచారం. ఈ సినిమా బృందం న్యూజిలాండ్‌లోనూ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 

    ఎమోషన్స్.. 

    తన ప్రతి సినిమాలో శంకర్ ఎమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇందులోనూ బలమైన సీన్స్‌ని రాసుకున్నారట. ముఖ్యంగా తండ్రీకొడుకల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట. 

    గ్రాండియర్ విజువల్స్..

    రామ్‌చరణ్ సినిమాను శంకర్ గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నాడు. పాటల చిత్రీకరణలోనూ శంకర్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. పాటల కోసం ప్రపంచంలోని ఏ లొకేషన్‌కైనా వెళ్లేందుకు శంకర్ వెనుకాడడు. ఇటీవల న్యూజిలాండ్‌లో చిత్రబృందం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 

    టైటిల్ ఫిక్స్?

    శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న RC15 సినిమా గురించి చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు.C.E.O(Chief Electoral Officer) అనే టైటిల్‌ పెట్టారని టాక్. ఇక చరణ్ పుట్టిన రోజున టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పేశాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    క్రేజీ కాంబినేషన్‌

    RRR తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమాకు భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు ప్రాజెక్టును టేకప్ చేయడంతో అంచనాలు బలపడ్డాయి. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌జే సూర్య, సునీల్‌, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

    బర్త్‌డే కానుక

    చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ లోగోను తీర్చిదిద్దుతున్నారని మార్చి 27 బర్త్‌డే రోజున విడుదల చేస్తామని వెల్లడించారు. సినిమా విడుదలపై కూడా అటు ఇటుగా ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. 

    ఫ్యాన్స్‌‌కి పూనకాలే..

    సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ జరుగుతున్నా చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్‌లు లేవు. దీంతో ఒకొక్క విషయం తెలుస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దిల్‌రాజు కూడా మూవీ  అప్డేట్‌పై క్లారిటీ ఇవ్వడంతో ‘పూనకాలు లోడింగ్’ అంటూ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    GMA: రాజమౌళి ఓ ఇండియన్ స్పీల్‌బర్గ్.. టాక్ షోలో రామ్‌చరణ్ పంచుకున్న విశేషాలు