జబర్దస్త్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ సినిమాల్లోనూ రాణిస్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంటుంది. తనను ఆంటీ అని పిలవడంపై గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఓ నెటిజన్ దీనిపై ప్రశ్నించారు. అలా పిలిస్తే కోపం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. దీంతో కొందరి మాటల్లో అర్థాలు వేరుంటాయని అనసూయ స్పష్టం చేసింది. ఏదేమైనా ఇప్పుడు అలాంటి చెత్త కామెంట్స్‌ని పట్టించుకోవట్లేదని, తన పనిలో బిజీగా గడుపుతున్నట్లు అనసూయ వెల్లడించింది. ఇప్పుడు కోపం రావట్లేదని క్లారిటీ ఇచ్చింది.
మరోవైపు తన కొత్త సినిమా అప్డేట్లపై అనసూయ మాట్లాడింది. ఏప్రిల్ రెండో వారంలో తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పింది. ఆ సినిమా షూటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అనసూయ పేర్కొంది. టీవీ షోలు, ప్రారంభోత్సవాలు, యాడ్స్, మూవీస్ కన్నా తన కుటుంబానికే తొలి ప్రాధాన్యత అని అనసూయ తాజాగా స్పష్టం చేసింది. తాను పూర్తిగా శాకాహారిని అంటూ చెప్పుకొచ్చింది.
ఇటీవల రంగమార్తండ చిత్రంలో అనసూయ కీలకపాత్ర పోషించింది. ఈ సినిమాలో అనసూయ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం అనసూయ పుష్ప 2, అరి సహా పలు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం తాను చేస్తున్న పాత్రలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని అనసూయ అంటోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!