• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RAKESH MASTER: ప్రభాస్‌, రామ్‌ పొత్తినేని, రవితేజకు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే!.. ఇవిగో వీడియోలు!

    రాకేష్ మాస్టర్ హ్యాష్ ట్యాగ్‌(#RakeshMaster) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల తాలుకు వీడియోలను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఎంతో మంది డ్యాన్స్ మాస్టర్లు, హీరోలకు శిక్షణ ఇచ్చిన రాకేష్ మాస్టర్ చివరి రోజుల్లో అందరికీ దూరమై ఏకాకిగా మిగలడంపై పలువరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముక్కు మీద కోపం, నిజాలను నిర్భయంగా చెప్పడం, ఎవర్నీ లెక్కచేయని మనస్తత్వం రాకేష్ మాస్టర్‌ను ఒంటరి చేసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 

    ప్రభాస్‌కు మాస్టర్

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కెరీర్ తొలి రోజుల్లో ఆయనకు డ్యాన్స్ శిక్షణ అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు రాకేష్ మాస్టర్ శిక్షణ ఇస్తున్న ఫొటోను నెటిజన్లు షేర్ చేశారు.

    RAPOకు డ్యాన్స్ శిక్షణ

    యంగ్ హీరో రామ్ పొత్తినేని కూడా రాకేష్ మాస్టర్ దగ్గర డ్యాన్స్‌లో మెళకువలు నేర్చుకున్నవాడే. ఆయన నటించిన దేవదాసు సినిమాకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సినిమాలోని డ్యాన్స్… RAPOకు ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే.

    మాస్ మహారాజా రవితేజ నటించిన ఓ సినిమాలోని  ఫుల్ సాంగ్‌లో రాకేష్ మాస్టర్ రవితేజతో కలిసి డ్యాన్స్ చేశారు.

    1500 సినిమాలకు కొరియోగ్రఫీ

    రాకేశ్ మాస్టర్‌ ఒకానొక దశలో టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగారు. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. ఈటీవీ డ్యాన్స్ షో ద్వారా రాకేష్ మాస్టర్ ప్రతిభ చాలా మందికి తెలిసింది.

    జనసేనకు ఓటు వేస్తా..

    తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ తెలిపారు. జనసేనకే తాను ఓటు వేస్తానని బహిరంగంగా ప్రకటించారు. జనసేనపై అభిమానంతో చేతిపై వేసుకున్న టాటూను చూపించారు. ఓటు వేసేటప్పుడు కులాలు పట్టించుకోనని స్పష్టం చేశారు. తాను రెడ్డి సామాజిక వర్గమైనా ఓటు మాత్రం పవన్ కళ్యాణ్‌కే వేస్తానని పేర్కొన్నారు.

    శేఖర్‌కు లైఫ్‌ ఇచ్చాడు..

    తన తమ్ముడు ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు అని రాకేష్ మాస్టర్ అక్కగారు అన్నారు. శేఖర్, జానీ, సత్య మాస్టర్లు చాలా కాలం పాటు తన తమ్ముడి ఇంట్లోనే ఉండేవారని చెప్పారు. రాకేష్ మాస్టర్ ఎవరికీ అన్యాయం చేయలేదని వివరించారు. డ్యాన్స్ ప్రొఫెషన్ వల్ల కుటుంబానికి దూరమయ్యానరని వెల్లడించారు. ఈ మధ్య ఫొన్ చేసి మమ్మల్ని కలవాలని ఉందని చెప్పుకొచ్చారు. అనారోగ్య సమస్యల వల్ల తననే ఇక్కడకు రావాలని కోరినట్లు చెప్పారు. అంతలోనే తన తమ్ముడు చనిపోవడం బాధకలిగిస్తోందని కన్నీటి పర్యంతం అయ్యారు. 

    https://www.facebook.com/watch/?v=188462650858056

    శేఖర్‌ మాస్టర్‌తో చెడింది ఇక్కడే..

    శేఖర్ మాస్టర్‌ను తన కన్న కొడుకులాగా చూసుకున్నాని పలు ఇంటర్వ్యూల్లో రాకేష్ మాస్టర్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ 150 సినిమాలో రెండు పాటలకు కొరియోగ్రఫీ చేసే అవకాశం శేఖర్ మాస్టర్‌కు వచ్చింది. అయితే ఆ విషయం తనకు శేఖర్ చెప్పలేదని రాకేష్ మాస్టర్ తెలిపారు. ఇంట్లో భార్యకు చెప్పాడు కానీ తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఇతరులతో తాము ఎలా ఉన్నా.. తమ మధ్య మాత్రం అబద్దాలు, దాపరికాలు తావు ఉండొద్దని ప్రతిజ్ఞ చేశామని చెప్పుకొచ్చారు. కానీ ఆ విషయాన్ని శేఖర్ మరిచాడని ఆరోపించారు. తనకు వచ్చిన అవకాశాలను శేఖర్‌కు ఇప్పించానని చెప్పుకొచ్చారు. తాను చనిపోతే… తన శవాన్ని కూడా శేఖర్ తాకొద్దని రాకేష్ మాస్టర్ అన్నారు.

    అయితే ఇదే విషయమై శేఖర్ మాస్టర్‌ కూడా స్పందించారు. ఖైదీ 150 సినిమాలో రెండు పాటలకు అవకాశం వచ్చిందని కానీ అవి కన్ఫర్మ్‌గా తెలియదని వెల్లడించాడు. కన్ఫర్మ్‌ అయ్యాక రాకేష్ మాస్టర్‌కు చెబుదామని అనుకున్నాని పేర్కొన్నాడు. తనను ఏరా పోరా అన్నా పడుతానని.. కానీ తన భార్యకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడరని శేఖర్ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచే వీరి మధ్య దూరం పెరిగింది. మరి ఈరోజు రాకేష్ మాస్టర్ అంత్య క్రియలకు శేఖర్ మాస్టర్ వస్తారో లేదో చూడాలి మరి..

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv