బెంగళూరుకు చెందిన ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) హైదరాబాద్ లో ప్రారంభమైంది. యాజమాన్యం తొలిసారిగా హైదరాబాద్‌లో తన శాఖను ప్రారంభించింది.
మాదాపూర్ లోని క్యాపిటల్ పార్క్ పక్కన ఈ కేఫ్‌ను ప్రారంభించారు. దుర్గం చెరువు మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఇది ఉంది. ఈ కేఫ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రారంభమైంది.
అయితే యాజమాన్యం కస్టమర్లకు తమ ఆహార రుచులను తెలియజేసేందుకు ఉచిత టిఫిన్స్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. జనవరి 18 వరకు ఉచితంగా టిఫిన్స్ అందించనుంది.
రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లోని టిఫిన్స్‌ను ఉచితంగా పొందాలంటే జనవరి 18 వరకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఈ కేఫ్‌లో చాలా రకాల టిఫిన్లు అందుబాటులో ఉంటాయి. రామేశ్వరం కేఫ్‌లో వెరైటీ ఇడ్లీలను లాగించొచ్చు. నేతి ఇడ్లీ, లెమన్ ఇడ్లీ, నేతి సాంబారు ఇడ్లీ, నేతి కారం ఇడ్లీ కేఫ్‌లో లభిస్తాయి. అలాగే సాంబార్ వడ కూడా వేడి వేడిగా పొందవచ్చు.
కేఫ్‌లోని దోశల విషయానికి వస్తే… సాదా దోశ, నేతి కారం దోశ, అల్లం దోశ, బటర్ మసాలా దోశ, నేతి ఉల్లి దోశ, రాగి దోశ, మల్టీ గ్రెయిన్ దోశ, జైన్ మసాలా దోశ, జైన్ సాంబార్ దోశ ఈ కేఫ్‌లో లభిస్తాయి.
ఇవి కాకుండా మధ్యాహ్నం సమయంలో నేతి కారం రైస్, గోంగూర రైస్, టామాటా రైస్, లెమన్ రైస్, పెరుగు చెట్నీతో పులావు, పులిహారా, పెరుగన్నం లభిస్తాయి. అలాగే అక్కి రోటి, రాగి రోటి, కేరళ పరోటా, గోధుమ పరోటాలు కూడా కేఫ్‌లో ఎంచక్కా లాగించొచ్చు.
టిఫిన్లతో పాటు మసాలా టీ, ఫిల్టర్ కాఫీ, బూస్ట్, హార్లిక్స్, బాదం మిల్క్, గులాబ్ జాము వంటివి కూడా కేఫ్‌లో లభిస్తాయి.
బెంగళూరులో చాలా ప్రసిద్ధి చెందిన ఈ రామేశ్వరం కేఫ్‌కు కస్టమర్ల తాకిడి ఓ రేంజ్లో ఉంటుంది. డైలీ 7500 మంది కస్టమర్లు ఈ కేఫ్‌కు వస్తుంటారు.
2021లో ప్రారంభమైన ఈ కేఫ్ అనతికాలంలోనే ఫేమస్ హోటల్‌గా మారిపోయింది. ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉంటూ నెలకు రూ.4 కోట్ల వరకు బిజినెస్ చేస్తోంది.
దివ్య, రాఘవేంద్రరావు అనే జంట ఈ కేఫ్‌కు శ్రీకారం చుట్టారు. వారికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంటే చాలా ఇష్టం. దీంతో కలాం స్వస్థలం అయిన రామేశ్వరం పేరు మీద ఈ హోటల్ ప్రారంభించారు.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్