ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ (Sukumar)కు ఇండస్ట్రీలో మంచి బాండింగ్ ఉంది. అది పలు సందర్భాల్లో నిరూపితమైంది కూడా. బన్నీ-సుకుమార్ కాంబోలో ఇప్పటికే మూడు చిత్రాలు (ఆర్య, ఆర్య 2, పుష్ప) రాగా అందులో రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కాంబోలో ‘పుష్ప 2‘ తెరకెక్కుతోంది. కొన్ని రోజుల క్రితం వరకూ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగింది. అయితే అనూహ్యంగా ఈ మూవీ షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. దీనికి కారణం సుకుమార్, అల్లు అర్జున్ మధ్య తలెత్తిన వివాదాలేనని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు బన్నీ షూటింగ్‌ను పక్కకు పెట్టి విహారయాత్రకు వెళ్లడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.
సుకుమార్ – బన్నీ మధ్య కోల్డ్‌వార్?
‘పుష్ప: ది రూల్’ షూటింగ్ విషయంలో అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. తీరా షూటింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశముందని తెలిసి వాయిదా వేశారు. అయితే సినిమా వాయిదా వేసినప్పటికీ షూటింగ్ సక్రమంగా జరగడం లేదని బన్నీ గుర్రుగా ఉన్నారట. తను పూర్తిగా సహకరిస్తున్నా సుకుమార్ సరిగ్గా వినియోగించుకోవడం లేదని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే షూటింగ్‌ను నిలిపేసి సుకుమార్ అమెరికాకు వెళ్లడంపై బన్నీలో మరింత అసంతృప్తి కారణమైందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గడ్డం తీసేసిన బన్నీ
సుకుమార్ శైలి నచ్చని అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. అతడు యూరప్ వెళ్లారని టాక్ వినిపిస్తోంది. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బన్నీ గడ్డం ట్రిమ్ చేసి కనిపించారు. వాస్తవానికి పుష్ప గాడు అంటే ఆ గడ్డం లుక్కే మెయిన్. గడ్డం మీద చేయి వేసి తగ్గేదేలే అని బన్నీ చెప్పిన డైలాగ్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై భారీ ఎత్తున రీల్స్ సైతం అప్పట్లో వచ్చాయి. అటువంటిది గడ్డాన్ని బన్నీ ట్రిమ్ చేసి పర్యటనకు వెళ్లడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సుకుమార్‌తో ఉన్న విభేదాల వల్లే బన్నీ షూటింగ్‌కు దూరం అయ్యారా? అన్న ప్రశ్న నెట్టింట వినిపిస్తోంది.
‘పుష్ప 2’ మళ్లీ వాయిదా?
డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు విదేశీ పర్యటనకు వెళ్లడంతో ప్రస్తుతం ‘పుష్ప 2’ అటకెక్కింది. ఇంకా చాలా సన్నివేశాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరువురు లేకపోవడం ‘పుష్ప 2’ రిలీజ్‌పై ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కు మార్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్లోనైనా పుష్ప గాడిని చూస్తామా? అన్న ప్రశ్న ఆడియన్స్‌లో తలెత్తుతోంది. ప్రస్తుతం బన్నీ గడ్డాన్ని ట్రిమ్ చేసి యూరప్ వెళ్లారు. పుష్ప పాత్రకు తగ్గట్లు గడ్డం పెంచాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుంది. అంటే ఒక నెల రోజుల సమయం వృథా అయినట్లేనని ఫిల్మ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
‘పుష్ప 2’కి విలన్ కష్టాలు!
మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ‘పుష్ప 2’లో విలన్ పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ ఆలస్యం కారణంగా ఫహద్ కూడా కొంత నిరాశలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. పైగా ఫహద్ చేతిలో 6,7 పెద్ద సినిమాలే ఉన్నాయి. దాంతో అతడు అడిగినన్ని కాల్ షీట్లు ఇచ్చేలా కనిపించడం లేదు. దాంతో అతడు ఇచ్చిన డేట్స్‌లోనే షూట్ ఫినిష్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదీకాక కాంబోలో ఉన్న ఆర్టిస్టులు అందరూ పెద్దవారే కావడం డైరెక్టర్ సుకుమార్‌కు పెద్ద సమస్యగా మారింది. ఇన్ని సమస్యలను సుకుమార్ ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నో చెప్పిన జాన్వీ కపూర్
పుష్ప 2లో ఐటెం సాంగ్ ఏ నటి చేస్తారన్న ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతోంది. కొన్ని రోజుల క్రితం యానిమల్ బ్యూటీ తిప్తి దిమ్రీ పేరు వినిపించింది. ఆమెను చిత్ర యూనిట్ సంప్రదించగా ఐటెం సాంగ్ చేసేందుకు ఓకే చెప్పినట్లు రూమర్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఆమెను కాకుండా జాన్వీ కపూర్‌ను ఐటెం సాంగ్ కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆమెను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలతో నటిస్తుండటంతో ఐటెం సాంగ్ చేసేందుకు జాన్వీ నో చెప్పినట్లు సమాచారం. ఇలాంటి సాంగ్స్ చేస్తే తన ఇమేజ్‌కు డ్యామేజ్ కలుగుతుందని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది.