• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Saripodhaa Sanivaaram: తీవ్ర ఆందోళనలో హీరో నాని ఫ్యాన్స్‌.. అదే జరిగితే ఫలితం ఫసక్కేనా?

    స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా కథానాయకుడు నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నాడు. ఇదిలా ఉంటే నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) గురువారం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అదిరిపోవడంతో సినిమా సక్సెస్‌పై నాని ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. అయితే తాజాగా నాని అభిమానుల్లో కొత్త భయాలు మెుదలయ్యాయి. దీంతో వారు ఆందోళనలకు గురవుతున్నారు. ఇంతకీ వారిని వేధిస్తున్న సమస్య ఏంటి? అందుకు గల కారణాలు ఏంటి? ఈ కథనంలో చూద్దాం. 

    రన్‌ టైమ్‌ భయాలు!

    నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా ‘సరిపోదా శనివారం’ రూపొందింది. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో నానికి జోడీగా ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కంప్లీట్‌ అయ్యింది. సెన్సార్‌ టీమ్‌ యు/ఏ సర్టిఫికేట్‌ జారి చేసింది. అలాగే రన్‌ టైమ్‌ను 2 గంటల 46 నిమిషాలుగా ఫిక్స్‌ చేసింది. దీంతో నాని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నాని – వివేక్ ఆత్రేయ కాంబోలో ‘అంటే సుందరానికి’ మూవీ తెరకెక్కింది. 3 గంటల నిడివి కలిగిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ కూడా ఎక్కువ నిడివితో వస్తుండటంతో గత అనుభవం తిరిగి రీపిట్‌ అవుతుందా? అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కథ ఎంత బాగున్నా నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. 

    విలన్‌దే పైచేయి..!

    ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నానికి ప్రత్యర్థిగా తమిళ నటుడు ఎస్‌.జే. సూర్య (S.J. Suryah) నటించారు. దుర్మార్గమైన పోలీసు ఆఫీసర్‌గా అతడు కనిపించనున్నారు. అయితే ఇందులో నాని పాత్ర కంటే ఎస్‌. జే. సూర్య పాత్రనే ఎక్కువగా హైలెట్‌ కానున్నట్లు తెలుస్తోంది. హీరో పాత్ర చాలా వరకూ సైలెంట్‌గా ఉండిపోవాల్సి వస్తుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. శనివారం మాత్రమే చెలరేగిపోయే హీరో మిగిలిన రోజుల్లో కూల్‌ అండ్‌ కామ్‌గా ఉంటాడని మూవీ టీమ్‌ పరోక్షంగా ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌.జే. సూర్య పాత్ర సినిమాపై బలమైన ముద్ర వేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను గమనిస్తే నాని నటన బాగున్నప్పటికీ విలన్‌గా ఎస్‌.జే. సూర్య ఎక్కువగా ఇంపాక్ట్‌ చూపించారు. తన నటనతో ఇరగదీశాడు. దీంతో నాని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో కంటే ఎస్‌.జే. సూర్య యాక్టింగ్‌ హైలెట్ అయితే పరిస్థితి ఏంటని సమాలోచనల్లో పడ్డారు. అదే గనుక నిజమైతే నాని ఫ్యాన్స్‌కు నిరూత్సాహ పడక తప్పదు. 

    కథని ముందే రివీల్‌ చేస్తున్నాడు!

    ‘సరిపోదా శనివారం’ టీమ్‌కు నటుడు ఎస్‌.జే. సూర్య కొత్త చిక్కులు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చేస్తున్న ఇంటర్యూల్లో కథను నేరుగా చెప్పేస్తూ అందరికీ షాకిస్తున్నారు. హీరో శనివారం మాత్రమే ఎందుకు చెలరేగిపోతాడో ఆయన ఓ ఇంటర్యూలో రివిల్‌ చేసేశారు. అలాగే ఇటీవల నిర్వహించిన ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో నిడివి గురించి సైతం సెన్సార్‌ పూర్తి కాకుండానే చెప్పేశారు. ఇలా సినిమాలోని మెయిన్‌ పాయింట్స్‌ను రివీల్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ముందే అన్ని చెప్పేస్తే సినిమాపై ఆసక్తి ఏముంటుందని సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు. ‘మానాడు’ చిత్రంలో ఎస్‌.జే. సూర్య చెప్పిన ‘వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు రిపీట్‌’ డైలాగ్‌ను అతడికే అన్వయిస్తూ నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు. 

    ‘థియేటర్లలో శివ తాండవం చూస్తారు’

    ‘సరిపోదా శనివారం’ గురించి ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వివేక్‌ చేసే శివ తాండవం ఆగస్టు 29న థియేటర్‌లో చూస్తారు. అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇదొక మైలురాయి. సినిమా గురించి టెన్షన్‌ పడుతున్న సమయంలో జేక్స్‌ బిజోయ్‌ మ్యూజిక్‌ వింటే ఆ టెన్షన్‌ మొత్తం ఎగిరిపోయింది. ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్లండి. జేక్స్‌ అంతగా పని పెట్టాడు.  నిర్మాత దానయ్యగారు మంచి పాజిటివ్‌ మనిషి. సినిమా బాగా రావాలని ఆశిస్తారు. అందుకే మంచి కథలు ఆయన్ను వెతక్కుంటూ వస్తున్నాయి’ అని నాని అన్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv