క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమా అంటే ఒకప్పుడు థియేటర్లలో పండగ వాతావరణం ఉండేది. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీశారు. ముఖ్యంగా అంతఃపురం చిత్రం ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఇందులో దివంగత నటి సౌందర్య ఫీమేల్ లీడ్‌గా నటించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనపై సర్వత్ర ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కృష్ణ వంశీ ఎక్స్ వేదికగా తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో అంతఃపురం సినిమాలో సౌందర్యను ఏ హీరోయిన్‌తో రీప్లెస్ చేయగలదని ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఇందుకు కృష్ణ వంశీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.
కృష్ణవంశీ ఏమన్నారంటే?
సౌందర్య, సాయికుమాార్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన అంతఃపురం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇందులో క్రూరమైన తన మామ బారి నుంచి బిడ్డను కాపాడుకునే తల్లిగా సౌందర్య ఉత్తమ నటన కనబరిచింది. అయితే ఇప్పటి హీరోయిన్స్‌లో ‘అంతఃపురం’ ఎవరికి సెట్ అవుతుందని డైరెక్టర్ కృష్ణ వంశీని ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ అడిగాడు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ ‘సౌందర్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. కానీ ప్రస్తుతం హీరోయిన్స్ ఎంతో టాలెంటెడ్. తమ నటనతో మెస్మరైజ్ చేస్తున్నారు. వారిని గౌరవిస్తున్నా’ అని అన్నారు. దానికి ఆ నెటిజన్ బదులిస్తూ నివేతా థామస్, శ్రద్ధా కపూర్‌లలో ఎవరు సెట్ అవుతారు? అని మళ్లీ ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణవంశీ రిప్లే ఇస్తూ ప్రస్తుత హీరోయిన్స్‌లో సమంత, సాయిపల్లవి సౌందర్య పాత్రకు సెట్ కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సమంత, సాయిపల్లవి ఫ్యాన్స్ ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.
సౌందర్యను రీప్లేస్ చేయగలరా!
స్టార్ హీరోయిన్ సమంతకు గ్లామర్ బ్యూటీగానే కాకుండా మంచి నటిగానూ గుర్తింపు ఉంది. తన ఫస్ట్ ఫిల్మ్ ‘ఏమాయ చేశావే’తో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఆ తర్వాత ‘మనం’, ‘అ ఆ’, ‘యూటర్న్’, ‘జాను’, ‘యశోద’, ‘శాకుంతలం’, ‘బేబీ’ వంటి చిత్రాలతో నటిగా తనను నిరూపించుకుంది. అటు సాయిపల్లవి యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాలతో నటనలో తనకు సాటి ఎవరూ లేరని చాటి చెప్పింది. అటువంటి ఈ స్టార్ హీరోయిన్స్ అంతఃపురంలో సౌందర్య పాత్రకు కచ్చితంగా న్యాయం చేయగలరి నెటిజన్లు భావిస్తున్నారు.
డైరెక్టర్‌గా రెండు నేషనల్ అవార్డ్స్
డైరెక్టర్ కృష్ణ వంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. సినిమాల్లోకి వచ్చాక కృష్ణ వంశీ అని పిలుస్తారు.రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1995లో JD చక్రవర్తి నటించిన చిత్రం ‘గులాబీ’ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ‘అంత:పురం’, ‘చంద్రలేఖ’, ‘నిన్నే పెళ్లాడుతా’ మురారి, ఖడ్గం, శ్రీ ఆంజనేయం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. రీసెంట్గా ‘రంగమార్తండ’ అనే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమాను తీశారు. కృష్ణ వంశీ తన కెరీర్లో ఉత్తమ దర్శకుడిగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, నాలుగు నంది అవార్డులు అందుకున్నాడు.