నటీనటులు : సుహాస్, విషికా కోట, పోసాని కృష్ణమురళి, రఘు కారుమంచి తదితరులు
డైరెక్టర్ : బాబీ వర్మ
సంగీతం : పవన్. సీహెచ్
సినిమాటోగ్రాఫర్ : సురేష్ సారంగం
ఎడిటర్ : వంశీ కృష్ణ రావి
నిర్మాత : ప్రశాంత్ మాండవ
విడుదల తేదీ : 21-09-2024
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. కొత్త తరహా కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో సుహాస్ (Suhas) నటించిన మరో వినూత్న చిత్రం ‘గొర్రె పురాణం’ (Gorre Puranam). బాబీ దర్శకుడు. ఈ సినిమాలో గొర్రెకు దర్శకుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
రవి(సుహాస్) ఒక వ్యక్తిని మర్డర్ చేసి జైలుకు వెళతాడు. మరోపక్క ఒక ముస్లిం వ్యక్తి గొర్రెను జుబా చేసి ఇంటిల్లిపాది బిర్యానీ చేసుకుందామని కొనుగోలు చేస్తాడు. అది తప్పించుకోవడంతో గొర్రెను పట్టుకునేందుకు దాని వెంట ముస్లిం వ్యక్తితో పాటు మరి కొంతమంది పడతారు. ఈ క్రమంలో ఆ గొర్రె ఒక గ్రామ దేవత గుడిలో దూరుతుంది. అక్కడ కల్లు తాగి జట్కా ఇవ్వడంతో దాన్ని తామే బలిస్తామని హిందువులు పట్టుబడతారు. ఈ వ్యవహారం కాస్త మీడియా దృష్టికి వెళ్తుంది. దీంతో మతకలహాలు రేకెత్తిస్తోంది అంటూ గొర్రెను పోలీసులు అరెస్టు చేస్తారు. రవి సెల్లోనే దాన్ని ఉంచుతారు. అసలు రవి ఒకరిని ఎందుకు మర్డర్ చేశాడు? రవి చేసిన మర్డర్‌కి గొర్రెకి సంబంధం ఏమిటి? జైలులో గొర్రెను చంపడానికి ప్రయత్నించిన వారెవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ఈ సినిమాలో సుహాస్ పాత్ర కొద్దిసేపే ఉంటుంది. ఉన్నంతలో అతడు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే తన సహజసిద్ధమైన యాక్టింగ్‌తో మెప్పించాడు. ఈ సినిమాలో నటీనటుల కంటే గొర్రె ఎక్కువసేపు కనిపిస్తుంది. దానికి ఎంతో ఫన్నీగా వాయిస్ ఓవర్ ఇచ్చి నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ నవ్వులు పూయించాడు. కమెడియన్ గెటప్ శ్రీను కూడా ఓ గొర్రెకు డబ్బింగ్ చెప్పాడు. మిగతా పాత్రల్లో కనిపించిన కమెడియన్ రఘు, జెన్నీ వంటి వాళ్ల పాత్రల నిడివి తక్కువే అయినా కథపై ప్రభావం చూపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు బాబీ వర్మ ఒక గొర్రెను ప్రధాన పాత్రధారిగా తీసుకొని చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. అసలు ఈ గొర్రె కథ ఎక్కడ మొదలైంది? ఈ గొర్రె ఏం కోరుకుంటుంది? దాని ఉద్దేశం ఏంటి? లాంటి విషయాలను వ్యాగ్యంగా చెబుతూనే కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్. ఈ క్రమంలో ప్రజలు, రాజకీయ నేతలు, మీడియాపై గట్టిగానే సెటైర్లు వేశారు. ఒక పక్కన నవ్విస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సుహాస్ పాత్రను తీర్చిదిద్దానం విధానం కూడా బాగుంది. అయితే అతడు ఎందుకు హత్య చేశాడు? మరో ముగ్గుర్ని ఎందుకు చంపాలని అనుకున్నాడు? అన్నది కనెక్టింగ్‌గా చూపించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. కమర్షియల్ హంగులు లేకపోవడం, ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అయ్యింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా సెట్ అయింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో రాజీ పడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
- సుహాస్ నటన
- కథ, కథనం
- డైలాగ్స్
మైనస్ పాయింట్స్
- కమర్షియల్ హంగులు లేకపోవడం
- వర్కౌట్ కాని ఎమోషన్స్
Celebrities Featured Articles Telugu Movies
Samantha: నన్ను ‘సెకండ్ హ్యాండ్, యూజ్డ్’ అంటున్నారు!