రియల్‌మి తాజాగా భారత మార్కెట్లో టెక్‌లైఫ్ స్టూడియో H1 హెడ్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. ఇవి ఆకట్టుకునే డిజైన్ తో పాటు, హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ సాంకేతికతను కలిగి ఉన్నాయి. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేలా ఫోల్డబుల్ డిజైన్‌తో రూపొందించబడిన ఈ హెడ్‌ఫోన్స్, తక్కువ లేటెన్సీ (80ms)తో పనిచేసే విధంగా ఉన్నాయి. ఈ హెడ్‌ఫోన్స్‌ను రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి టెక్‌లైఫ్ స్టూడియో H1 హెడ్‌ఫోన్స్ ఫీచర్స్:
ఈ హెడ్‌ఫోన్స్ 40mm మెగా డైనమిక్ బాస్ డ్రైవర్‌లతో రూపొందించబడ్డాయి. LDAC ఆడియో కోడెక్, Hi-Res ఆడియో సర్టిఫికేషన్‌తో మార్కెట్లోకి వచ్చాయి. ముఖ్యంగా 43dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో పాటు, 3-లెవెల్ స్మార్ట్ ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్‌తో ఇవి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ టెక్నాలజీతో అత్యుత్తమ ఆడియో అనుభవాన్ని అందిస్తాయి.
ఇతర ఫీచర్లలో 80ms అల్ట్రా లో లేటెన్సీ, బ్లూటూత్ 5.4 సపోర్ట్ తో పనిచేయడం, 10 మీటర్ల వరకు వైర్‌లెస్ రేంజ్ ఉండడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి 600mAh బ్యాటరీని కలిగి ఉండగా, 1.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతాయి. ఈ హెడ్‌ఫోన్స్ రెడ్, వైట్, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
రియల్‌మి టెక్‌లైఫ్ స్టూడియో H1 హెడ్‌ఫోన్స్ అక్టోబర్ 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఇతర ప్రధాన రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హెడ్‌ఫోన్స్ ధర రూ. 4,999గా ఉండగా, ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ. 500 తగ్గింపు ధరతో, రూ. 4,499కి లభిస్తుంది.
రియల్‌మి P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్:
రియల్‌మి P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ కూడా విడుదలైంది. ఇందులో 6.67 అంగుళాల OLED డిస్‌ప్లే, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 తో అందుబాటులోకి వచ్చింది.
5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. కెమెరా సెగ్మెంట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా కలిగి ఉంది. 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉండి నాణ్యమైన ఫొటోలు తీస్తుంది. ఈ ఫోన్ IP రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా ఉంది.
రియల్‌మి P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999గా ఉంది. అక్టోబర్ 20 మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ రియల్‌మి వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు ప్రారంభ ఆఫర్‌లో రూ. 2000 తగ్గింపుతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.