• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Honor X60 Series: హానర్‌ నుంచి సరికొత్త ఫొన్, ఫీచర్లు తెలిస్తే అదిరిపోవాల్సిందే!

    Honor కంపెనీ తాజాగా Honor X60 మరియు Honor X60 Pro తో కూడిన Honor X60 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లోని ఫోన్లు సాంకేతికంగా అత్యాధునికంగా ఉండటమే కాకుండా వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఈ ఫోన్లు 108MP Samsung HM6 కెమెరా, MagicOS 8, Android 14 ఆధారంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ కొత్త ఫోన్లలో ఉన్న ముఖ్యమైన ఆఫర్లు ఏమిటో, భారతదేశంలో వీటి ధర ఎంత ఉండొచ్చో పరిశీలిద్దాం.

    Honor X60 ఫీచర్లు

    Honor X60 స్మార్ట్‌ఫోన్‌ విషయానికి వస్తే, ఇది 6.8-అంగుళాల (2412×1080 పిక్సెల్‌లు) FHD+ 120Hz LCD స్క్రీన్‌తో వస్తుంది, ఇది 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌ మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా 6nm ప్రాసెసర్‌ ద్వారా రన్‌ అవుతుంది. 12GB వరకు RAM, 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. కెమెరా విషయానికొస్తే, 108MP Samsung HM6 బ్యాక్ కెమెరా మరియు 8MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి, వీటితో ఈ స్మార్ట్ ఫొన్ నాణ్యమైన ఫోటోగ్రఫీని అందిస్తుంది.


    హానర్ X60 ఫోన్ 5800mAh సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది, ఇది 35W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది, ఇది సౌకర్యవంతమైన భద్రతను అందిస్తుంది. ధర విషయానికి వస్తే, హానర్ X60 చైనాలో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌కి 1,199 యువాన్ (సుమారు రూ. 14,500) ధరతో ప్రారంభమవుతుంది. ఇకపోతే, హై-ఎండ్ 12GB RAM + 512GB వేరియంట్‌కి 1,799 యువాన్ (సుమారు రూ. 21,222) వరకు ఉంటుంది. ఈ ఫోన్ ఎలిగెంట్ బ్లాక్, మూన్‌లైట్, సీ లేక్ క్విన్ వంటి ఆకర్షణీయమైన రంగు ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

    మరొకవైపు, Honor X60 Pro కూడా ప్రత్యేకమైన ఫీచర్లతో వస్తుంది. ఈ ప్రో మోడల్ 6.78-అంగుళాల కర్వ్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది అమోలెడ్ టెక్నాలజీతో 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. 10-బిట్ 10.7 బిలియన్ రంగులను చూపించే HDR 10 టెక్నాలజీ కలిగి ఉంటుంది. 3000 నిట్స్ హై బ్రైట్‌నెస్‌తో ఈ డిస్‌ప్లే సూపర్-స్మూత్ విజువల్స్‌ని అందిస్తుంది. X60 Pro Snapdragon 6 Gen 1 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది అత్యంత శక్తివంతమైన పనితీరును ప్రదర్శిస్తుంది. ఈ మోడల్‌ కూడా 12GB వరకు RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది.

    Honor X60 Pro కెమెరా విభాగంలో కూడా గేమ్-చేంజర్‌గా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ ఫోన్ కూడా 108MP Samsung HM6 బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఇది ఎలాంటి పరిసరాల్లోనైనా నాణ్యమైన ఫోటోలను తీసుకోవడంలో సహాయపడుతుంది. బ్యాటరీ విషయానికొస్తే, ఈ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 6600mAh పెద్ద బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఫోన్ బైడు ఉపగ్రహ SMS సపోర్ట్ వంటి ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంది.

    ధర విషయానికి వస్తే, Honor X60 Pro 8GB RAM + 128GB వేరియంట్ ధర 1,499 యువాన్ (సుమారు రూ. 17,683) నుండి ప్రారంభమవుతుంది. ఇది స్కై బ్లూ, బసాల్ట్ గ్రే, బర్నింగ్ ఆరెంజ్, ఎలిగెంట్ బ్లాక్ వంటి అట్రాక్టివ్ రంగులలో లభిస్తుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv