• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అద్భుతమైన పెయింటింగ్.. వీడియో వైరల్

    పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఓ చెట్టుపై వేసిన పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ చెట్టును కౌగిలించుకొని వృక్షాలను రక్షించాలనే సందేశం ఇస్తున్నట్లుగా ఉన్న ఈ చిత్రం పర్యావరణ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సింగర్ కుమార్ సాను ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. magnificent art meaningful drawing#5DaysToTiger3Trailer#InternationalDayOfGirlChild#INDvsAFG #RashmikaMandanna#PalestineUnderAttack#AnimalTheFilm #AamirKhan #AmitabhBachchanBirthday#HamasMassacre #Israel#GazaUnderAttackpic.twitter.com/37KW4LviYf — Singer Kumar Sanu (@KumarsanuTc) October 11, 2023

    పవిత్రమైన నదిలో రీల్స్.. నెటిజన్స్ ఫైర్

    అయోధ్యలోని సరయు నదిలో ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పవిత్రమైన నదిలో ఇలాంటి పనులు చేయడమేంటని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అయోధ్య పోలీసులు స్పందించారు. అయోధ్య ఇన్‌స్పెక్టర్ ఆదేశాలతో విచారణ చేస్తున్నామని, మహిళపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు. గతంలోనూ ఈ నదిలో ఓ బాలిక డ్యాన్స్ చేయగా ఆమెపై చర్యలు తీసుకున్నారు. #अयोध्या :राम की पैड़ी में रील बनाते एक … Read more

    ఐసెట్ అభ్యర్థులకు స్పెషల్ కౌన్సెలింగ్

    తెలంగాణలో ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించి MBA, MCA కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 15న స్లాట్ బుకింగ్.. 16 నుంచి 17 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఉంటుంది. 20న సీట్ల కేటాయింపు చేయనుండగా.. 20 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 30 నుంచి 31 వరకు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.

    సైబర్ నేరగాళ్ల వలలో మాజీ మంత్రి

    కేంద్ర మాజీ టెలికాం మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకున్నారు. ఈ నెల 8న ఓ వ్యక్తి తాను బ్యాంక్ సిబ్బంది అంటూ కాల్ చేసి తన ఖాతా వివరాలు అడిగినట్లు తెలిపారు. అయితే ఎలాంటి వివరాలు చెప్పనప్పటికీ తన ఖాతా నుంచి రూ.99,999 డెబిట్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దయానిధి మారన్ గతంలో కేంద్ర ఐటీ, టెలికాం మంత్రిగా పనిచేశారు. ఈ రంగాల్లో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సేకరించడంలో కీలకంగా వ్యవహరించారు.

    బిగ్ అప్డేట్.. త్వరలో భారతీయుడు-3

    విశ్వనటుడు కమల్‌హాసన్ నటిస్తున్న భారతీయుడు-2 సీక్వెల్‌పై బిగ్ అప్డేట్ వచ్చింది. శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ మూవీని నాలుగేళ్ల క్రితం ప్రారంభించినప్పటికీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే ఇప్పటి వరకు తీసిన సీన్స్ పరిశీలించిన శంకర్ సినిమా నిడివి చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారట. మరో 30 రోజుల పాటు షూటింగ్ చేస్తే భారతీయుడు-3 కూడా పూర్తి చేయొచ్చని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అదనపు షూటింగ్ కోసం కమల్ హాసన్‌కు మరో రూ.120 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.

    క్రీడా ర్యాలీని ప్రారంభించిన గోవా సీఎం

    గోవాలో ఈ నెల 26 నుంచి నేషనల్ గేమ్స్ జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ క్రీడా జ్యోతి ర్యాలీని ప్రారంభించారు. 37వ నేషనల్ గేమ్స్ గురించి దేశ ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ క్రీడలను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి 2.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. గోవా రాజధాని పనాజీలో జరిగే ఈ గేమ్స్ నవంబర్ 9న ముగుస్తాయి. కాగా, గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై గత నెలలో క్రీడా … Read more

    ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్: మంత్రి అంబటి

    తమకు కక్ష సాధించాల్సిన అవసరం లేదని.. చంద్రబాబు అవినీతిపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే పోలీసులు అరెస్టు చేశారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, 175 స్థానాల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమని అంబటి అన్నారు. ఈ నెల 26 నుంచి బస్సు యాత్రతో పాటు ‘మళ్లీ జగనే ఎందుకు కావాలి’ అనే కార్యక్రమం సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    విజయ్ ‘లియో’లో రామ్‌చరణ్..?

    దళపతి విజయ్ నటించిన ‘లియో’లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించారనే చర్చ జరుగుతోంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలుండగా.. ఇందులో రామ్‌చరణ్ నటించారనే చర్చతో భారీ హైప్ వస్తోంది. ఓవర్సీస్ బుకింగ్ సైట్స్‌లో లీడ్ క్యాస్టింగ్‌లో రామ్‌చరణ్ పేరు ఉండటడే ఈ చర్చకు ప్రధాన కారణం. ఈ నెల 19న భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ మూవీని లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించాడు. అయితే రామ్‌చరణ్ నటించారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

    ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్

    ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా 5500 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో పది శాతం డిస్కౌంట్ సైతం ఇస్తున్నామన్నారు. గత ఏడాది రావడానికి, వెళ్లడానికి రెండు వైపులా టికెట్ తీసుకుంటేనే రాయితీ ఇచ్చామని.. ఈ సారి మాత్రం ఒకవైపు టికెట్ తీసుకున్నా ఇది వర్తిస్తుందని చెప్పారు.

    మద్యం, మాంసం బంద్: రణబీర్‌

    బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్‌ కపూర్ కొన్ని రోజుల పాటు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రామాయణం సినిమా పూర్తయ్యే వరకు రణబీర్‌‌తో పాటు మావీ టీం అంతా దీనిని ఫాలో అవుతున్నారనే చర్చ జరుగుతోంది. సంపూర్ణమైన భక్తితో సినిమా తీయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రణబీర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది.