ఇల్లు ఊడవడం అంటే చాలా మంది మహిళలకు తలకు మించిన భారంగా అనిపిస్తుంటుంది. చిన్న ఇల్లు అయితే పర్వాలేదు గానీ, పెద్ద పెద్ద హౌస్‌లను చీపురులతో చిమ్మడమంటే దానికి మించిన శ్రమ మరోటి ఉండదు. అందుకే ఈ కష్టం నుంచి ఇల్లాలిని దూరం చూసేందుకు వాక్యూమ్ క్లీనర్స్ (Vacuum Cleaners) అందుబాటులోకి వచ్చాయి. ఎంత పెద్ద ఇంటినైనా ఇవి నిమిషాల్లో శుభ్రం చేసేస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక కంపెనీలకు చెందిన వాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి. వాటిలో అత్యుత్తమైన వాటిని YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Philips PowerPro
గృహోపకరణ వస్తువులను అందించే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో పిలిప్స్ ఒకటి. ఈ కంపెనీ తీసుకొచ్చిన Philips PowerPro వాక్యూమ్ క్లీనర్‌కు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. దీనిని పవర్ సైక్లోన్ 5 టెక్నాలజీతో తీసుకొచ్చారు. 370 Watts పవర్, 1.5 litres సామర్థ్యాన్ని అందించారు. తక్కువ బరువునే కలిగి ఉండటం వల్ల మహిళలు ఈ వాక్యూమ్ క్లీనర్‌ను తేలిగ్గా వినియోగించవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.9,499కే లభిస్తోంది.
AGARO Ace Wet & Dry
మార్కెట్ లభిస్తోన్న మరో క్వాలిటీ వాక్యూమ్ క్లీనర్ ‘AGARO Ace Wet & Dry’. ఇది పొడి చెత్తతో పాటు, తడి చెత్తను సైతం అద్భుతంగా క్లీన్ చేయగలదు. 21 లీటర్ల సామర్థ్యం, 1600 Watts పవర్‌తో దీన్ని తీసుకొచ్చారు. ఇంటిని కడిగినప్పుడు నేలపై ఉన్న నీటిని ఈ మిషన్ ద్వారా తేలిగ్గా తొలిగించవచ్చు. దీని అసలు ధర రూ. 9,999 కాగా, అమెజాన్ రూ.4,999కే అందిస్తోంది.
Eureka Forbes Supervac
మీడియం రేంజ్ బడ్జెట్‌లో మంచి క్వాలిటీ వాక్యూమ్ క్లీనర్‌ను కోరుకునే వారు Eureka Forbes Supervac ట్రై చేయవచ్చు. ఇది అమెజాన్‌లో రూ. 5,999కే అందుబాటులో ఉంది. ఇందులో పవర్ కంట్రోల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మిషన్ కలెక్ట్ చేసిన డస్ట్‌ను చేతితో క్లీన్ చేసే పనిలేకుండా బటన్ నొక్కి తొలగించే వెసులుబాటు ఉంది.
INALSA Vacuum Quickvac-1000W
రూ.3000 లోపు మంచి వ్యాక్యూమ్ క్లీనర్ కోరుకునే వారు ‘INALSA Vacuum Quickvac-1000W’ పరిశీలించవచ్చు. దీని ద్వారా ఇంటినే కాకుండా సోఫా సెట్స్, కుర్చీలు, ఫర్నిచర్లను క్లీన్ చేయవచ్చు. 1.5 లీటర్ల సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. ముగ్గురు లేదా నలుగురు ఉన్న చిన్న ఫ్యామిలీకి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ సరిగ్గా సరిపోతుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ అమెజాన్‌లో రూ. 2,669 లభిస్తోంది.
AmazonBasics Wet and Dry
అమెజాన్ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తున్న వ్యాక్యూమ్ క్లీనర్ AmazonBasics Wet and Dry Vacuum Cleaner. మీ బడ్జెట్ రూ.5 వేలు లోపు అయితే దీన్ని ట్రై చేయవచ్చు. ఇది 15 లీటర్ల సామర్థ్యం.. 1400 Watts పవర్‌ను కలిగి ఉంది. తక్కువ శబ్దంతో ఇంటిని చకా చకా క్లీన్ చేస్తుంది. అమెజాన్‌లో ఇది రూ. 4,178కే లభిస్తోంది.
Panasonic Mc-Cg303R14C
టెక్ రంగంలో పానాసోనిక్‌కు మంచి పేరుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన Panasonic Mc-Cg303R14C వాక్యూమ్ క్లీనర్ వినియోగదారుల మన్ననలు పొందుతోంది. దీని ద్వారా కేవలం ఇంటినే కాకుండా కారు, గ్యారేజ్‌ను శుభ్రం చేసుకోవచ్చు. 1.2 లీటర్ల సామర్థ్యం, 1400 Watts పవర్‌ను ఇది కలిగి ఉంది. దీని అసలు ధర రూ.7,225 కాగా అమెజాన్‌లో ఇది 13% డిస్కౌంట్‌తో రూ.6,297కే అందుబాటులో ఉంది.
KENT Force Cyclonic
మార్కెట్‌లో లభిస్తోన్న మరో టాప్ రేటెడ్ మీడియం రేంజ్ వ్యాక్యూమ్ క్లీనర్ ‘KENT Force Cyclonic’. ఇది సూపర్ ఫాస్ట్ వేగంతో మీ ఇంటిని శుభ్రం చేస్తుంది. ఇది తక్కువ నాయిస్‌తో పనిచేస్తుంది. 2000 Watt పవర్‌తో 1 ఇయర్ వారంటీతో దీన్ని తీసుకొచ్చారు. ఈ వాక్యూమ్ క్లీనర్ అసలు ధర రూ.7,450. అమెజాన్ దీనిపై 19% డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఇది రూ.7,450 అందుబాటులోకి వచ్చింది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!