ఆర్య హీరోగా నటించిన ‘కెప్టెన్’ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. శక్తి సౌందరరాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్. ఈ తమిళ సినిమాను హీరో నితిన్ హోమ్ ప్రొడక్షన్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ తెలుగులో రిలీజ్ చేసింది. ప్రమోషన్లతో సినిమాలపై అంచనాలను పెంచారు. మరి మూవీ ఆ రేంజ్‌లో ఉందా? అంచనాలను అందుకోవడంలో సఫలమైందా లేదా తెలుసుకుందాం.
కథేంటంటే..
ఒక ధైర్యశాలి ఆర్మీ కెప్టెన్ తన జవాన్ల బృందంతో డేంజరస్ మిషన్ చేపడుతుంది. వీళ్లు ఒక మిస్టరీని ఛేదించడానికి ఒక నిషేధిత ఫారెస్ట్ ఏరియాకు వెళ్తారు. అక్కడికి ముందు వెళ్లిన వారందరి వివరించలేని మరణాల వెనుక రహస్యాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తారు. మరి వారికి ఆ ఆడవిలో ఎటువంటి ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రాణాలను పణంగా పెట్టి ఆ రహస్యాని కనుగొన్నారా? చివరికి కెప్టెన్ ఆ ప్రమాదకరమైన మిషన్‌లో విజయం సాధించగలడా? లేదా అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు శక్తి సౌందర రాజన్ ఇదివరకు పెట్ కామెడీ, జోంబీ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ , ఫాంటసీ కామెడీ చిత్రాలు తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఆ దర్శకుడి నుంచి మరో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. హాలీవుడ్ జానర్‌లో మన నెటివిటీని జోడించి తీసే ఈ దర్శకుడు ఈసారి మాత్రం తడబడ్డాడు. ఈ సినిమాలో కెప్టెన్‌తో పోరాడేందుకు ఒక కొత్త జీవిని సృష్టించాడు. అది హాలీవుడ్ మూవీ ప్రిడేటర్, దాని సీక్వెల్స్‌ను గుర్తుచేస్తుంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ దర్శకుడు కథ లేకుండా కేవలం ఒక బేసిక్ ప్లాట్ అవుట్‌టైన్‌తో సినిమాను తెరకెక్కించినట్లు అనిపిస్తుంది.
సౌందరరాజన్ సినిమాల్లో ప్రేక్షకులు ఆసక్తిగా చూసేందుకు ఏదో ఒక ఎమోషనల్ ఎలిమెంట్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఏ పాత్ర అంతగా కనెక్ట్ కాదు. అందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలే కనిపిస్తాయి. రొమాంటిక్ ట్రాక్‌ను కూడా కథలో బలవంతగా చొప్పించినట్లు అనిపిస్తుంది. కథానాయకుడిని, అతని ప్రపంచాన్ని పరిచయం చేయడం, అతని బృందం మధ్య స్నేహాన్ని చూపించడానికి ఒక పాటను పెట్టడం, రొమాంటిక్ సీన్స్ ఇలా అన్నీ రొటీన్‌గా అనిపిస్తాయి. హీరోతో పోరాడేందుకు క్రియేట్ చేసిన మినోటార్ అనే జీవి కూడా కృత్రిమంగా అనిపిస్తుంది. హీరోను చంపే అవకాశం ఉన్నా అది చంపకుండా వదిలేయడం డ్రామాటిక్‌గా అనిపిస్తుంది. ఇక కొన్ని శాస్త్రీయ పద్దతులు, బయో రేడియో సిగ్నల్స్ వంటివాటి గురించి చెప్పేందుకు ప్రయత్నించినా వాటిని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు.
కథ సరిగ్గా లేకపోవడంతో ఎవరి నటన హృదయానికి హత్తుకునేలా ఉండదు. ఆర్య ఇంతకుముందు నటించిన సినిమాలకు ఈ సినిమాకు చాలా తేడా ఉంది. ఇక సిమ్రన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక శాస్త్రవేత్త పాత్రలో నటించడం, ఆమె లక్ష్యాన్ని సాధించేందుకు ఏదైనా చేసేందుకు సిద్దపడటం అసలు అతికినట్లు అనిపించదు. ఐశ్వర్య లక్ష్మీ పాత్ర పరిధి చాలా తక్కువ. ఆమె మయలాళంలో మంచి సినిమాల్లో నటిస్తూ అసలు ఈ సినిమాకు ఎలా ఓకే చెప్పిందో అర్థం కాలేదు. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను చాలా నిరాశపరిచిందనే చెప్పుకోవాలి.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ