• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దక్షిణాఫ్రికా లక్ష్యం 245 రన్స్‌

    వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో అప్గనిస్తాన్‌ జట్టు 244-10 (50) స్కోరు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 97*( 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో అప్గన్‌ స్కోరు 200 దాటగల్గింది. అఫ్గాన్‌ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ 25, ఇబ్రహీం జద్రాన్ 15, రహ్మాత్ షా 26, హష్మతుల్లా షాహిది 2, ఇక్రామ్‌ అలిఖిల్ 12, మహమ్మద్‌ నబీ 2, రషీద్‌ ఖాన్ 14, నూర్‌ అహ్మద్‌ 26, ముజీబ్‌ 8, నవీన్‌-ఉల్‌-హక్‌ 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి 2 … Read more

    AFG vs RSA: టాస్ గెలిచి ఆఫ్గాన్ బ్యాటింగ్

    వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తుది జట్లు.. ఆఫ్ఘనిస్తాన్‌: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్‌కీపర్‌), ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్ దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్‌), టెంబా బవుమా (కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డేవిడ్ మిల్లర్, గెరాల్డ్ … Read more

    న్యూజిలాండ్‌ ఘన విజయం

    వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అదరగొట్టింది. శ్రీలంక నిర్దేశించిన 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్‌ ఐదు వికెట్లు కోల్పోయి 23.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు డేవాన్ కాన్వే (45; 42 బంతుల్లో 9 ఫోర్లు), రచిన్‌ రవీంద్ర (42; 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కివీస్‌కు శుభారంభం అందించారు. తర్వాత వచ్చిన డారిల్‌ మిచెల్ (43; 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 2, మహీశ్ తీక్షణ, దుష్మంత … Read more

    స్వల్ప స్కోరుకు శ్రీలంక ఆలౌట్‌

    వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక స్వల్ప స్కోరుకే ఆలౌట్‌ అయ్యింది. 46.4 ఓవర్లలో 171-10 స్కోరు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్‌ పెరీరా (51) అర్ధ శతకంతో రాణించాడు. ఓ దశలో 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన లంకను మహీశ్‌ తీక్షణ (39) ఆదుకున్నాడు. అతడు చివరి వరకూ నాటౌట్‌గా నిలబడటం వల్లే లంక ఈ మాత్రం స్కోరైనా చేయగల్గింది. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 3, ఫెర్గూసన్‌ 2, శాంట్నర్‌ 2, రచిన్ రవీంద్ర 2, సౌథీ ఒక వికెట్ … Read more

    కుప్పకూలిన శ్రీలంక టాప్‌ ఆర్డర్

    ప్రపంచకప్‌ భాగంగా నేడు శ్రీలంకతో న్యూజిలాండ్ ఆఖరి లీగ్ మ్యాచ్‌ ఆడుతోంది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న శ్రీలంక తడబడుతోంది. ఇప్పటికే శ్రీలంక టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు మాత్రమే చేసింది. పాథుమ్ నిశాంక (2), కుశాల్ మెండిస్ (6), సదీరా సమరవిక్రమ (1), చరిత్ అసలంక (8) పరుగులు చేసిన ఔటయ్యారు.

    ‘మా దేశానికొస్తే అతడికి రాళ్ల దెబ్బలు తప్పవు’

    శ్రీలంక-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ‘టైమ్‌డ్‌ ఔట్’ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. బంగ్లా కెప్టెన్ షకిబ్ తీరుపై శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ మ్యాచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన సోదరుడు ట్రెవిస్ కూడా షకిబ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘గేమ్‌లో షకిబ్ క్రీడా స్ఫూర్తి, మానవీయ విలువలు కూడా పాటించకపోవడం దారుణం. షకిబ్‌ను శ్రీలంకలోకి రానివ్వకూడదు. ఒకవేళ అతడు అంతర్జాతీయ మ్యాచ్‌ లేదా ఎల్‌పీఎల్‌లో పాల్గొంటే మాత్రం రాళ్ల దెబ్బలకు సిద్ధంగా ఉండాలి’. అని ట్రెవిస్‌ పేర్కొన్నాడు.

    అలా మాట్లాడేందుకు సిగ్గుండాలి: షమీ

    పాక్‌ మాజీ ఆటగాడు హసన్‌ రజా టీమిండియాపై ఆరోపణలు గుప్పించాడు. భారత్ ఆడే మ్యాచ్‌ల కోసం విభిన్న బంతులను వాడుతున్నారని విమర్శలు చేశాడు. దీంతో అతడి నోటిదురుసుపై భారత పేసర్ మహమ్మద్‌ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అలా మాట్లాడేందుకు సిగ్గుండాలి. మీ గేమ్‌ మీద దృష్టిపెట్టాలి. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం కాదు. ఇప్పటికీ అదే ధోరణిలో ఉండటం హాస్యాస్పదం. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు.’ అని షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ పెట్టాడు. ఇప్పుడదీ వైరల్‌గా మారింది.

    షమీకి ఆఫర్‌ ఇచ్చిన హీరోయిన్‌..

    టీమిండియా బౌలర్ షమీకి ఓ హీరోయిన్ ఆఫర్ ఇచ్చింది. షమీని పెళ్లి చేసుకుంటానని పాయల్ ఘోష్ నేరుగా కోరింది. తన సోషల్‌ మీడియా ఖాతా నుంచి షమీకి ప్రపోజ్ చేసింది. కానీ షమీని పెళ్లి చేసుకోవడానికి ప్రత్యేక షరతు ఇలా పెట్టింది. ‘షమీ.. నువ్వు ఇంగ్లిష్‌ని మెరుగుపరుచుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.’ అంటూ ఒక కండీషన్‌ పెట్టి ట్వీట్ చేసింది. ‘మహ్మద్ షమీ.. సెమీ-ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నా నుంచి మీకు ఏ సహాయం కావాలి చెప్పాలని కోరింది’. … Read more

    వన్డే ఐసీసీ ర్యాంకులు విడుదల

    ICC వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ నంబర్‌వన్‌ స్థానం సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ రెండో స్థానానికి దిగజారాడు. శుభ్‌మన్‌ గిల్ 830 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్‌ అజామ్‌ 824 పాయింట్లు రెండో స్థానంలో ఉన్నాడు. క్వింటన్ డికాక్‌ (771), విరాట్ కోహ్లీ (770), డేవిడ్ వార్నర్ (743) తర్వాతి స్థానాల్లో నిలిచారు. శ్రేయస్‌ అయ్యర్ 17స్థానాలను ఎగబాకి 18వ ర్యాంక్‌ను సాధించాడు.

    BAN vs SL: బంగ్లాదేశ్‌ టార్గెట్‌ ఫిక్స్‌

    వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక మంచి స్కోరు చేసింది. 49.3 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 279 రన్స్ చేసింది. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక సెంచరీ (108)తో చెలరేగాడు. వికెట్లు పడుతున్న నిలకడగా ఆడి జట్టు మంచి స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా బ్యాటర్లలో నిస్సంక 41, సమరవిక్రమ 41, ధనంజయ 34 రాణించారు. బంగ్లా బౌలర్లలో తంజీన్‌ హసన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. షకీబుల్ 2, షోరిఫుల్‌ 2, మెహిడి హసన్ 1 వికెట్ తీశారు. బంగ్లా విజయానికి … Read more