• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telugu Comedy Scenes: తెలుగులో ఎవర్‌గ్రీన్‌ కామెడీ సీన్స్‌.. చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..!

    తెలుగు సినీ అభిమానులు ఎక్కువగా హాస్యాన్ని ఇష్టపడుతుంటారు. తెరపైన హీరోలు, హాస్య నటులు చేసే కామెడీని చూస్తూ తమ సమస్యలు, ఒత్తిడిల నుంచి కాస్త ఉపశమనం పొందుతుంటారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ డైరెక్టర్లు సైతం తమ సినిమాల్లో హాస్య సన్నివేశాలకు పెద్దపీట వేస్తుంటారు. గత 20 ఏళ్లలో ఎన్నో కామెడీ సినిమాలు విడుదలై ప్రేక్షకుల మన్ననలు చూరగొన్నాయి. వాటిలోని హైలెట్‌ కామెడీ సీన్లను ఇప్పటికీ యూట్యూబ్‌లలో సెర్చ్ చేసి చూస్తుంటారు. ఈ నేపథ్యంలో గత కొన్నెళ్లలో వచ్చిన తెలుగు సినిమాల్లోని టాప్‌-10 కామెడీ సీన్స్‌ … Read more

    Mirna Menon: టాలీవుడ్‌లో మెరిసిన మరో అందాల తార.. మిర్నా మీనన్‌ హోయలకు ముగ్దులవుతున్న ప్రేక్షకులు..!

    అల్లరి నరేష్‌ తాజాగా నటించిన ‘ఉగ్రం’ మూవీలో ‘మిర్నా మీనన్‌’ హీరోయిన్‌గా నటించింది. ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఈ భామ తన అందచందాలతో ఆకట్టుకుంది. తమిళ చిత్రం ‘సంతానథెవన్‌’ చిత్రంతో మిర్నా మీనన్‌ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే చిన్న సినిమా కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.  తన తర్వాతి చిత్రంలో ఏకంగా మోహన్‌ లాల్‌ పక్కనే ఛాన్స్‌ కొట్టేసింది ఈ భామ. బిగ్‌ బ్రదర్ చిత్రంలో ఆర్య శెట్టి పాత్రలో మిర్నా మెరిసింది ఆది సాయికుమార్ హీరోగా గతేడాది వచ్చిన … Read more

    The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?

    ‘ది కేరళ స్టోరీ ‘ చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్‌, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన … Read more

    Telugu Novels:  జీవితంలో ఒక్కసారైనా చదవాల్సిన బెస్ట్ తెలుగు నవలు… వీటిని చదివితే పుస్తకాలతో ప్రేమలో పడటం ఖాయం! 

    ఈ రోజుల్లో వినోదం అనగానే ముందుగా థియేటర్లు, టీవీలు, ఓటీటీలు, బ్రౌజింగ్ క్రికెట్ వంటివి గుర్తుకువస్తాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. మనకి ముందున్న జనరేషన్స్‌ వాళ్లు పుస్తకాలతోనే ఎక్కువగా తమ సమయాన్ని గడిపేవారు. పుస్తకాల నుంచే వినోదంతో పాటు విజ్ఞానాన్ని సంపాదించేవారు. అయితే, నేటి తరం పుస్తకాలను చదవడం తగ్గించేసింది. చాలామందికి చదవాలన్న కుతూహలం ఉన్నా ఏయే పుస్తకాలు చదవాలో క్లారిటీ ఉండదు. ఇందుకోసం YouSay చిరు ప్రయత్నం చేసింది. మిమ్మల్ని బుక్ లవర్స్‌గా మార్చే పుస్తకాలను సంగ్రహించి వాటి తాత్పర్యం, సారాంశాలను … Read more

    10 Deadliest Roads In India: మృత్యువును పరిచయం చేసే అతి ప్రమాదకరమైన రోడ్లు.. వెళ్లారంటే మీ పని ఖల్లాస్‌ అంతే..!

    ప్రపంచంలోని సువిశాలమైన దేశాల్లో భారత్‌ ఒకటి. ఇక్కడి విభిన్నమైన పరిస్థితులు భారత్‌ను ఇతర దేశాలకంటే ఎంతో ప్రత్యేకంగా నిలుపుతోంది. ఉత్తరాన ఉన్న జమ్ముకశ్మీర్‌ నుంచి దక్షిణాన ఉన్న కన్యాకుమారి వరకూ ఉన్న ప్రాంతాలను కలుపుతూ ఎన్నో రోడ్డు మార్గాలు దేశంలో ఉన్నాయి. సముద్ర తీరాలు, పచ్చటి అడవులు, నదులు, ప్రకృతి సోయగాలను తాకుతూ వెళ్లే ఈ రోడ్డు మార్గాలు ప్రయాణికులకు, వాహనాదారులకు ఎన్నో మధురానుభూతులను పంచుతుంది. అయితే మరికొన్ని రోడ్లు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఆ రహదారుల్లో ప్రయాణించడమంటే ప్రాణాలను పణంగా పెట్టినట్లే. … Read more

    VIVO T2 5G REVIEW: రూ.20వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్… ఫీచర్లు కూడా అదుర్స్

    మెుబైల్‌ ఫోన్ల దిగ్గజం వివో నుంచి మరో మోడల్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్‌ అయిన T2 మోడల్ మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. VIVO T1కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. డిజైన్, బిల్డ్, కెమెరా సెటప్, ఛార్జింగ్ కేపెబిలిటీ వంటి మార్పులతో యూజర్లను ఈ 5G ఫోన్ మెస్మరైజ్ చేయనుంది. మరి ఈ ఫోన్ ఫీచర్లు? ధర, తదితర వివరాలను తెలుసుకుందాం. VIVO T2 VIVO T2 ఫోన్లకు భారత్‌లో మంచి  ఆదరణ ఉంది. పైగా మార్కెట్లో ఉన్న … Read more

    PAN INDIA MOVIE TITLES: టైటిల్‌తోనే ఈ సినిమాల రేంజ్ చెప్పేశారు..!

    ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ పదం కామన్‌గా వినిపిస్తోంది. అదే పాన్ ఇండియా. మొన్నటివరకు ఒక ప్రాంతానికే పరిమితమైన సినిమా పరిధి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఎంగేజింగ్ కంటెంట్‌తో పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆలోచన సినిమా టైటిల్ ఖరారు చేయడం దగ్గర నుంచే మొదలవుతోంది. అలా పాన్ ఇండియాగా వచ్చిన, రాబోతున్న సినిమాల టైటిల్స్‌ని పరిశీలిస్తే ఓ కామన్ పాయింట్ అర్థమవుతుంది. ఈ టైటిల్స్ ఏ ఒక్క భాష, … Read more

    This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!

    అసలు సిసైలన వేసవి నెల ప్రారంభమైంది. ఈ సమయంలో థియేటర్లకు రప్పించి ప్రేక్షకులను చల్లబర్చేందుకు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ వారం(మే 5) బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరోవైపు, ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి వివరాలు చూద్దాం.  రామబాణం హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్యం తరువాత గోపీచంద్, జగపతిబాబు, శ్రీవాస్ కాంబోలో వస్తోందీ సినిమా. … Read more

    Virat Kohli: వివాదాలకు కేంద్రంగా విరాట్ కోహ్లీ.. గంభీర్‌తో వివాదానికి అసలు కారణం ఇదేనా?

    విరాట్ కోహ్లీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మైదానంలో పరుగులు వరద పారించగల సత్తా ఉన్న ఆటగాడు. రికార్డుల్లో తన పేరు ఉండటం కాదు.. తన పేరు మీదే రికార్డులు ఉంటాయనడానికి నిదర్శనం. మైదానంలో సహజంగానే కోహ్లీ కాస్త హైపరాక్టివ్‌గా ఉంటాడు. దూకుడుగా ఉంటూ జట్టులో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, కొన్నిసార్లు కోహ్లీ లయ తప్పుతున్నాడేమోనని అనిపించక మానదు. అందుకే రికార్డుల మాదిరే.. వివాదాలు కూడా ఉన్నాయి. కారణాలేమైనప్పటికీ తన ప్రవర్తనతో విరాట్ విమర్శల సుడిగుండంలో చిక్కుకుంటున్నాడు.  గంభీర్‌తో.. టీమిండియా మాజీ … Read more

    AKHANDA 2: టార్గెట్ AP ఎలక్షన్స్.. ప్యూర్ పొలిటికల్ డ్రామాగా బాలయ్య, బోయపాటి సినిమా!

    నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. సింహా, లెజెండ్, అఖండ.. సినిమాలతో వీరు హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూడింట్లోనూ కామన్‌గా పొలిటికల్ టచ్ ఉంటుంది. నాటి వర్తమాన రాజకీయ పరిస్థితులకు అనువదించుకుని వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్.. ఈ సినిమాల్లో ఎన్నో ఉన్నాయి. అయితే, మరోసారి వీరి కాంబో రిపీట్ కానుంది. అఖండ పార్ట్ 2 కోసం ప్లాన్ చేస్తున్నారట. ఈ సారి పొలిటికల్ డోజ్ మరింత పెంచనున్నట్లు ఇండస్ట్రీలో … Read more