• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sai Pallavi In Bollywood: ఆమిర్ ఖాన్ కొడుకుతో  సాయి పల్లవి రొమాన్స్!

    స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయింది. ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్‌కు దారులు తెరిచింది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేయనున్నారు.

    పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో భారత చిత్ర పరిశ్రమ ఏకమైంది. సౌత్ నార్త్ తేడా లేకుండా హీరో, హీరోయిన్లు అక్కడా ఇక్కడా నటిస్తున్నారు. ఇన్నాళ్లు హిందీ సినిమాల గురించి పెద్దగా పట్టించుకోని దక్షిణాది హీరోయిన్లు ఒక్కొక్కరుగా బాలీవుడ్ బాట పడుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌సిరీస్‌ ద్వారా తనలోని బోల్డ్ యాంగిల్‌ను సమంత చూపించి అక్కడ క్లిక్ అయింది.  పుష్ప క్రేజ్‌తో రష్మిక ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారింది. ఇప్పటికే పలు బాలీవుడ్ ప్రాజెక్టులపై ఆమె సైన్ చేసింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి సాయి పల్లవి కూడా చేరిపోయింది. 

    టాలీవుడ్‌లో విరాటపర్వం తర్వాత సాయి పల్లవికి అవకాశాలు సన్నగిల్లిపోయాయి. ఆ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. భోళాశంకర్‌లో చిరంజీవి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చినా.. ఈ ముద్దుగుమ్మ తిరస్కరించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తానని అప్పట్లో బాహాటంగానే చెప్పింది. గ్లామర్ షోలకు తాను దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.

    కథల ఎంపికలో జాగ్రత్తలు పాటింటే సాయి పల్లవి.. మరి బాలీవుడ్‌లో ఏలాంటి కంటెంట్‌కు ఓకే చెప్పిందో అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ అంటేనే గ్లామర్ షోకు పెద్ద పీట వేస్తుంది. మరి సాయి పల్లవి మడి కట్టుకోకుండా అందాల ఘాటు పెంచుతుందా? లేక దక్షిణాదిలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. 

    ఆమిర్ ఖాన్‌ కొడుకు జునైద్ ఖాన్‌తో సాయిపల్లవి చేసే సినిమా మంచి లవ్ స్టోరీగా సునీల్ పాండే తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉండటంతో  సాయి పల్లవి కథ వినగానే ఓకే చెప్పిసిందని టాక్. ఈ చిత్రం ఆమిర్ ఖాన్ రేంజ్‌కు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను చిత్ర యూనిట్ ప్రారంభించింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది.

    ప్రస్తుతం జునైద్ ఖాన్ యాశ్ రాజ్ ఫిల్మ్స్‌ నిర్మాణంలో వస్తున్న మహారాజా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదే జునైద్‌ ఖాన్‌కు ఫస్ట్ సినిమా. ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. 

    తొలి సినిమా రిలీజ్‌ కాకముందే బాలీవుడ్‌లో లవర్‌ బాయ్‌గా స్థిరపడేందుకు సాయి పల్లవితో మరో లవ్ స్టోరీకి జునైద్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ వర్గాల్లో నెలకొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv