• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HONOR 90 5G: మూడేళ్ల తర్వాత హానర్‌ గ్రాండ్ కమ్‌ బ్యాక్‌.. సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌!

    చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీల్లో ‘హానర్‌’ ఒకటి. ఆ కంపెనీ ఫోన్లకు టెక్‌ ప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ‘హువావే’ అనుబంధ సంస్థగా ఉన్న ‘హానర్‌’ ఎన్నో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్లను గతంలో విడుదల చేస్తూ వచ్చింది. అయితే మూడేళ్ల నుంచి హానర్‌ నుంచి ఒక్క స్మార్ట్‌ఫోన్‌ కూడా భారత మార్కెట్‌లో రిలీజ్‌ కాలేదు. ఈ క్రమంలో హానర్‌ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో ఇవాళ కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. ‘హానర్‌ 90 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను భారత దేశంలో లాంచ్‌ చేసింది. మధ్యాహ్నం 12:30 గం.లకు ఆన్‌లైన్‌ వేదికగా ఈ ఫోన్‌ రిలీజ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ధర, ఫీచర్లు, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    ఫోన్‌ స్క్రీన్‌ 

    HONOR 90 5G స్మార్ట్‌ఫోన్‌ను 6.7 అంగుళాల Full HD + కర్వ్‌డ్‌ AMOLED డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. 120Hz రిఫ్రెష్‌ రేటును ఫోన్‌కు అందించారు. ఇది 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. Qualcomm Snapdragon 7 Gen 1 ప్రొసెసర్‌, Android 13 ఆధారిత MagicOS 7.1 OSతో ఈ ఫోన్‌ వర్క్‌ చేయనుంది. 

    బిగ్‌ బ్యాటరీ

    హానర్‌ 90 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 66W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు చేయనుంది. ఫలితంగా ఫోన్‌ను చాలా క్విక్‌గా చార్జ్‌ చేసుకోవచ్చు. USB Type-C చార్జింగ్‌ స్లాట్‌తో ఈ ఫోన్‌ రాబోతోంది. 

    స్టోరేజ్‌ సామర్థ్యం

    HONOR 90 5G స్మార్ట్‌ఫోన్‌ మెుత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 8GB+256GB, 12GB+512GB వేరియంట్లలో మీ అవసరానికి అనుగుణంగా ఉన్న దానిని ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో ర్యామ్‌ ఎక్స్‌టెండ్‌ ఫీచర్‌ కూడా ఉంది. 

    కెమెరా క్వాలిటీ

    హానర్‌ 90 5జీ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫీచర్‌ హైలెట్‌ అని చెప్పవచ్చు. ఇందులో ప్రైమరీ కెమెరా 200 MPగా ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌లో దీన్ని ఫిక్స్‌ చేశారు. 12MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌, 2MP డెప్త్‌ కెమెరా సెన్సార్లు కూడా వెనకవైపు ఉన్నాయి. ఇక ముందు వైపు 50MP సెల్పీ కెమెరాను ఫిక్స్‌ చేశారు. ఈ కెమెరాల సాయంతో అత్యంత నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 

    కలర్స్‌

    హానర్‌ 90 5జీ స్మార్ట్‌ఫోన్‌ మెుత్తం నాలుగు రంగుల్లో అందుబాటులోకి రానుంది. డైమండ్‌ సిల్వర్‌, పీకాక్‌ బ్లూ, ఎమ్‌రాల్డ్‌ గ్రీన్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ కలర్స్‌లో మీకు నచ్చినది కొనుగోలు చేయవచ్చు. 

    ధర ఎంతంటే?

    హానర్‌ 90 5జీ మెుబైల్‌ ధరలను స్టోరేజ్‌ వేరియంట్‌ ఆధారంగా నిర్ణయించారు. 8GB+256GB ధరను రూ.27,999, 12GB + 512GB ధరను 29,999గా కంపెనీ నిర్ణయించింది. 

    సేల్‌ ఎప్పుడంటే?

    హానర్‌ 90 5జీ మెుబైల్‌ ఇవాళే లాంచ్‌ అయినప్పటికీ ఈనెల 18 నుంచి అందుబాటులోకి రానుంది. ఆ రోజు మద్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో సేల్స్‌ ప్రారంభం కానున్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv