టెక్ ప్రియులు ఎంతగానో అభిమానించే కంపెనీల్లో యాపిల్ మెుదటి స్థానంలో ఉంటుంది. మిడిల్ క్లాస్ నుంచి అత్యంత సంపన్నుల వరకూ ప్రతీ ఒక్కరూ ఐఫోన్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే మిగత చాలా మంది బడ్జెట్ సహకరించక మిడిల్‌లోనే డ్రాప్ అవుతుంటారు. అటువంటి వారికోసమే యాపిల్ బంపరాఫర్ ఇచ్చింది. ఐఫోన్ 15 లాంచింగ్ వేడుకల్లో ఐఫోన్ 13, ఐఫోన్ 14 సిరీస్‌ల ధరలను భారీగా తగ్గించింది. దీంతో ఐఫోన్ ప్రియులు వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఐఫోన్ 13, 14లలో ఏది బెటర్? అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయా మెుబైల్స్ మధ్య ఉన్న వ్యత్యాసాలు, ఫీచర్లను వివరిస్తూ YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది.
ఫోన్ బరువు
బరువు విషయానికి వస్తే ఐఫోన్ 13, ఐఫోన్ 14 సిరీస్‌లో పెద్దగా వ్యత్యాసం లేదు. 13 సిరీస్ 174 గ్రాముల బరువు ఉంటే.. 14 సిరీస్ కాస్త స్లిమ్‌గా 172 గ్రాముల వెయిట్ కలిగి ఉంది.
బిల్డ్ క్వాలిటీ
బిల్డ్ క్వాలిటీ విషయంలో రెండు సిరీస్‌లు ఒకేలా ఉన్నాయి. గ్లాస్ ఫ్రంట్, గ్లాస్ బ్యాక్, అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ సిరీస్‌లను తీసుకొచ్చారు.
మెుబైల్ డిస్‌ప్లే
ఐఫోన్ 13, 14 సిరీస్‌లు రెండూ ఒకే డిస్‌ప్లే క్వాలిటీ వచ్చాయి. ఇవి Super Retina XDR OLED స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. HDR10, Dolby Vision, 800 nits (HBM), 1200 nits (peak) ఫీచర్లను వీటిని తీసుకొచ్చారు. అలాగే 6.1 అంగుళాల స్క్రీన్‌తో పాటు 1170 x 2532 pixels పిక్చర్ క్వాలిటీతో రూపుదిద్దుకున్నాయి.
ఆపరేటింగ్ సిస్టమ్
ఐఫోన్ మెుబైళ్లలో అత్యంత కీలకమైనది ఆపరేటింగ్ సిస్టమ్. ఐఫోన్ 13 సిరీస్‌ను iOS 15 OSతో తీసుకొచ్చారు. దీన్ని iOS 16.6.1, iOS 17 వరకూ అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఐఫోన్ 14 సిరీస్ విషయానికి వస్తే దీన్ని iOS 16 OSతో తీసుకొచ్చారు. iOS 17 OSకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని యాపిల్ చెబుతోంది.
CPU & GPU
ఐఫోన్ 13, 14 సిరీస్ రెండూ Hexa-core (2×3.23 GHz Avalanche + 4×1.82 GHz Blizzard)అనే CPU వ్యవస్థను కలిగి ఉన్నాయి. GPU విషయానికొస్తే 13 సిరీస్ Apple GPU (4-core graphics), 14 సిరీస్ Apple GPU (5-core graphics) కలిగి ఉన్నాయి. GPU విషయంలో 13 సిరీస్‌తో పోలిస్తే 14 కాస్త బెటర్ అని చెప్పవచ్చు.
స్టోరేజ్ సామర్థ్యం
ర్యామ్ విషయంలో ఐఫోన్ 13 కంటే 14 సిరీస్ ఇంకాస్త బెటర్‌గా ఉంది. ఎందుకంటే 13 సిరీస్ 4GB RAMను మాత్రమే కలిగి ఉండగా, 14 సిరీస్‌లోని అన్ని మోడల్స్‌ను 6GB RAMతో తీసుకొచ్చారు. 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లలో ఈ సిరీస్‌లోని మెుబైల్స్‌ను తీసుకొచ్చారు.
కెమెరా
ఐఫోన్లలో చెప్పుకోతగ్గ ఫీచర్లలో కెమెరా ఒకటి. ఈ కెమెరాల నాణ్యత ముందు ఇతర కంపెనీల ఫోన్లు దిగదిడుపేనని ఐఫోన్ యూజర్లు చెబుతుంటారు. ఐఫోన్ 13, 14 సిరీస్‌ను రెండూ వెనుకవైపు డ్యూయెల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. 12 MP + 12 MP కెమెరా సెన్సార్లను వీటికి అందించారు. ఇందులో ఒకటి వైడ్ కెమెరా కాగా, మరోటి అల్ట్రా వైడ్ ఫీచర్‌ను కలిగి ఉంది. దీని ద్వారా అత్యంత నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఇక ముందువైపు కూడా ఈ రెండు సిరీస్‌లను 12MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారు.
సెన్సార్లు
ఈ రెండు సిరీస్ ఐఫోన్లు దాదాపుగా ఒకే రకమైన సెన్సార్లను కలిగి ఉన్నాయి. Face ID, accelerometer, gyro, proximity, compass, barometer, Ultra Wideband (UWB) support సెన్సార్లు వీటిలో ఉన్నాయి. వీటితోపాటు 14 సిరీస్‌లో అదనంగా Emergency SOS ఆప్షన్‌ను ఇచ్చారు. అత్యవసర సమయాల్లో నెట్‌వర్క్ లేకపోయినా శాటిలైట్ ద్వారా SMS పంపడం లేదా పొందడం అనే ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు.
బ్యాటరీ
ఐఫోన్ 13 సిరీస్ Li-Ion 3240 mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. ఐఫోన్ 14 సిరీస్ Li-Ion 3279 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ రెండు సిరీస్ ఫోన్ల బ్యాటరీలను 30 నిమిషాల్లోనే 50శాతం మేర చార్జ్ చేసుకోవచ్చు.
కలర్స్
ఐఫోన్ 13 సిరీస్ మెుబైల్స్ మెుత్తం ఆరు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. Starlight, Midnight, Blue, Pink, Red, Green కలర్ వేరియంట్లను కలిగి ఉన్నాయి. అటు 14 సిరీస్ మెుబైల్స్‌ను కూడా Midnight, Purple, Starlight, Blue, Red, Yellow కలర్స్‌లో తీసుకొచ్చారు.
ధరలు ఎంతంటే?
ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ ఈవెంట్‌లో 13, 14 సిరీస్‌ల ధరలను రూ.10,000 మేర తగ్గిస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. దీని ప్రకారం iPhone 13 (128GB) ధర.69,900 నుంచి రూ.59,900 తగ్గింది. అటు ఐఫోన్ 14 (128GB) ధర కూడా రూ. 79,900 నుంచి రూ. 69,900 తగ్గింది.
ధరలు మరింత తగ్గే ఛాన్స్!
ఐఫోన్ 13, ఐఫోన్ 14 సిరీస్‌ల ధరలు త్వరలో మరింత తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించే అవకాశముంది. అటు అమెజాన్ సైతం ఐఫోన్ 13, 14 సిరీస్‌లపై రాయితీలు ఇవ్వొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత తక్కువకే ఈ ఫోన్లను పొందే వీలుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!