• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Maruthi Nagar Subramanyam Review: మధ్య వయస్కుడి నిరుద్యోగ  కష్టాలను కళ్లకు కట్టిన ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’.. సినిమా ఎలా ఉందంటే?

    న‌టీన‌టులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ త‌దిత‌రులు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: లక్ష్మణ్ కార్య సంగీతం : కళ్యాణ్‌ నాయక్‌ సినిమాటోగ్రఫీ : ఎం.ఎన్‌. బాల్‌రెడ్డి ఎడిటర్‌ : బొంతల నాగేశ్వర రెడ్డి సమర్పణ: తబితా సుకుమార్ సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల నిర్మాణం: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య విడుదల తేదీ : 23-08-2024 రావు రమేష్‌ (Rao Ramesh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’ (Maruti … Read more

    Telugu Top Item Songs Lyrics List: టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఐటెం సాంగ్స్‌.. వింటే పక్కాగా డ్యాన్స్‌ చేయాల్సిందే!

    టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌ కోసం సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్ ఉంది. అందుకే దర్శక నిర్మాతలు తమ కమర్షియల్‌ చిత్రంలో ప్రత్యేకమైన గీతాలు పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ ఎన్నో ఐటెం సాంగ్స్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. సంవత్సరాలు గడిచినా, (Telugu Top Item Songs Lyrics List)కొత్త ఐటెం సాంగ్స్‌ వచ్చినా ప్రేక్షకులపై అవి వేసిన మార్క్‌ ఎప్పటికీ చెరిగిపోవు. ఇంతకీ ఆ సాంగ్స్‌ ఏవి? అందులో నటించిన హీరో హీరోయిన్లు ఎవరు? ఆ … Read more

    HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్‌.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?

    మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజును మెగా అభిమానులు ఒక పండగలా భావిస్తుంటారు. అటు సెలబ్రిటీలు సైతం మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా విషెస్‌ చెబుతున్నారు. అయితే కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌గా ఉన్న ఆయన మెగాస్టార్‌ చిరంజీవిగా కోట్లాదిమంది అభిమానాన్ని చొరగానే స్థాయికి ఈజీగా చేరుకోలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.  తద్వారా మెగాస్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఉన్నత స్థానంలో నిలిపిన సంఘటనలు, అంశాలు … Read more

    Allu vs Mega Families: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌? చిరు బర్త్‌డే విషెస్‌లోనూ కానరాని ఎఫెక్షన్‌!

    పాలు, నీళ్లలా కలిసి ఉండే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌కు వ్యతిరేకంగా వైకాపా అభ్యర్థికి బన్నీ మద్దతు తెలపడం, ఓటు వేయాలని ప్రచారం కూడా చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్‌ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా ‘పుష్ప’ సినిమాపై విమర్శలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. … Read more

    Mokshagna Teja: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. ప్రశాంత్‌ వర్మ బిగ్‌ ప్లాన్‌!

    నట సింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో నందమూరి నట వారసుడిగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యాడు. మెున్నటి వరకూ కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ తాజాగా స్లిమ్‌ అయ్యి హీరోలా మేకోవర్ అయ్యాడు. హనుమాన్‌ ఫేమ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ అతడ్ని తెలుగు తెరకు పరిచయం చేయనున్నాడు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తేజ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన … Read more

    Mahesh Babu Voice To Mufasa: మహేష్‌ గొంతుతో గర్జించనున్న హాలీవుడ్‌ సింహాం ‘ముఫాసా’..!

    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ముందు వరుసలో ఉంటాడు. దర్శకధీరుడు రాజమౌళితో అతడి తర్వాతి ప్రాజెక్ట్‌ ఉండటంతో ‘SSMB29’పై ఇప్పటినుంచే భారీ అంచనాలు మెుదలయ్యాయి. అయితే రాజమౌళితో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో, ఎంత టైమ్‌ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పట్లో మహేష్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ను చూడలేమన్న బాధలో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు మహేష్‌ బాబు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఓ హాలీవుడ్‌ మూవీ తెలుగు వెర్షన్‌కు … Read more

    Bollywood Vs South Industries: బాలీవుడ్‌ – సౌత్‌ ఇండస్ట్రీల మధ్య కోల్డ్‌వార్‌ మెుదలైందా?

    బాలీవుడ్‌ వర్సెస్‌ సౌతిండియాగా ప్రస్తుత పరిస్థితులు పరిణమిస్తున్నాయి. సౌతిండియా చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుండటాన్ని కొందరు బాలీవుడ్ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు జాతీయ స్థాయి అవార్డులు ఎక్కువగా హిందీ చిత్రాలకే వచ్చేవి. కలెక్షన్ల పరంగానూ అందనంత ఎత్తులో ఉండేవి. అయితే గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా బాహుబలి తర్వాత నుంచి సౌత్ సినిమాల హవా ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద గణనీయంగా పెరిగింది. అదే సమయంలో బాలీవుడ్‌లో ఒకట్రెండు మినహా సంచలనం సృష్టించిన సినిమాలు రిలీజ్‌ … Read more

    Prabhas Vs Arshad Warsi: ప్రభాస్‌పై బాలీవుడ్‌ నటుడు అక్కసు.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన తెలుగు హీరోలు!

    ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో ప్రభాస్‌ (Prabhas) లుక్‌  జోకర్‌లా ఉందంటూ బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ (Arshad Warsi) చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై ప్రభాస్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అహం, ఈర్ష్య కలిగిన మనస్తత్వాల వల్లే బాలీవుడ్‌ ఫెయిలవుతూ వస్తోందని మండిపడుతున్నారు. అటు అర్షద్‌ వార్సీ వ్యాఖ్యలపై టాలీవుడ్‌ హీరోలు సైతం మండిపడ్డారు. ప్రభాస్‌కు మద్దతుగా నిలుస్తూ యువ హీరోలు సుధీర్‌ బాబు, ఆది గట్టి కౌంటర్లు ఇచ్చారు. … Read more

    Yuvraj Singh Biopic: యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌కు రంగం సిద్ధం.. మరి హీరో ఎవరు?

    భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. క్రీడలతో పాటు వివిధ రంగాల్లో విశేషంగా రాణించిన వ్యక్తుల జీవిత గాథలు వెండితెరపై ఆవిష్కతమవుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా పెను సంచలనం యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) బయోపిక్‌కు కూడా రంగం సిద్ధమైంది. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన యువరాజ్‌ సింగ్‌ వృతి, వ్యక్తిగత జీవితాల్లో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అటువంటి వ్యక్తిపై బయోపిక్‌ వస్తుడటం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావడంతో … Read more

    Raksha Bandhan 2024: తోబుట్టువులతో రాఖీ కట్టించుకున్న సెలబ్రిటీలు.. ఓ లుక్కేయండి!

    అన్నను కొండంత అండగా స్త్రీలు భావిస్తుంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రేమను, వారి యోగ క్షేమాలను చూసుకునేది కూడా అన్న లేదా తమ్ముడు మాత్రమే. కష్టసుఖాల్లో పాలుపంచుకునే తొలి మిత్రుడిగా సోదరుడ్ని చెబుతుంటారు. అన్న-చెల్లెళ్లు, అక్క-తమ్ముడి మధ్య ఉండే అప్యాయతలకు ప్రతీకగా ప్రతీ ఏటా రాఖీ పండగను జరుపుకుంటారు. ఒకరికొకరు అండగా ఉంటామని ఈ పండగ ద్వారా చాటి చెప్పుకుంటారు. అటు సెలబ్రిటీలు సైతం రాఖీ పండగను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం (ఆగస్టు 19) సందర్భంగా సెలబ్రిటీలు తమ సోదరులకు రాఖీ కట్టి తమ … Read more