• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న జాన్వీక‌పూర్

    బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ నేడు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకుంది. స్నేహితుల‌తో క‌లిసి తిరుమ‌ల వచ్చిన ఆమె మొక్కును తీర్చుకుంది. బ్లూ క‌ల‌ర్ లంగాఓణీలో అచ్చ‌తెలుల‌మ్మ‌యిల క‌నిపించింది. జాన్వీ న‌టించిన గుడ్‌ల‌క్ జెర్రీ సినిమా ఇటీవ‌ల ఓటీటీలో విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఆమె మిస్ట‌ర్ అండ్ మిసెస్ మాహి, బ‌వాల్ సినిమాల‌తో బిజీగా ఉంది. షూటింగ్ నుంచి కాస్త‌ గ్యాప్ దొర‌క‌డంతో ఇలా భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగిపోయింది.

    బుట్ట‌బొమ్మ ట్రెడీష‌న‌ల్ లుక్స్‌

    బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ట్రెడీష‌న‌ల్ లుక్‌లో కనిపించింది. ఎల్లో క‌ల‌ర్ షెరారా డ్రెస్‌లో ఫోటోల‌కు పోజులిచ్చింది. ఎప్పుడూ హాట్ ఫోటోషూట్‌లతో రెచ్చిపోయే ఈ బ్యూటీ అప్పుడ‌ప్పుడు సాంప్ర‌దాయ‌క‌ప‌మైన చీర‌క‌ట్టులో కూడా ఆక‌ట్టుకుంటుంది. పూజా ప్ర‌స్తుతం తెలుగులో మ‌హేశ్ బాబు-త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తుంది. అదేవిధంగా పూరీ జ‌గ‌న్నాథ్-విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాలో కూడా ఆమే హీరోయిన్‌. హిందీలో క‌బీ ఈద్ క‌బీ దివాళి వంటి సినిమాల‌తో బిజీగా ఉంది. Courtesy Instagram: pooja hegde Courtesy Instagram: Courtesy Instagram: Courtesy … Read more

    పవర్ స్టార్ వద్దన్న సినిమాలు.. ఇండస్ట్రీ హిట్లు..!

    పవన్ కళ్యాణ్.. సినిమా సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిన కెరటం. ఆయన సినిమా తీస్తే.. ప్రేక్షకులకు పండగొస్తుంది. చిరునవ్వు నవ్వితే.. అందరి మొఖాల్లో ఆనందమొస్తుంది. మెడపై చేయి నిమిరితే.. అభిమానులకు కొండంత బలమొస్తుంది. సినీ ఇండస్ట్రీలో తనొక ఫైటర్. అమ్మాయిల మదిని దోచే లవర్. విలన్లకు చెమట పుట్టించే ఫయర్.  ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఆయన సొంతం. అయితే, పవన్ వద్దనుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బ్లస్టర్లుగా నిలిచాయి. అందులో నటించిన వారికి గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. సెప్టెంబరు 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా YouSay … Read more

    ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సంతోషంలో మునిగితేలుతున్న‌ కృతిస‌న‌న్‌

    నిన్న ఫిల్మేఫేర్ 2022 అవార్డుల వేడుక ముంబ‌యిలో ఘ‌నంగా జ‌రిగింది. కృతిస‌న‌న్‌కు మిమి సినిమాకుగాను ఉత్త‌మ‌న‌టిగా అవార్డు అందుకుంది. దీంతో ఆమె త‌న సంతోషాన్ని సోష‌ల్‌మీడియా ద్వారా షేర్ చేసుకుంది. మొత్తానికి నా క‌ల నెర‌వేరింది. ఈ రోజు ఇంట్లో నాతోపాటు ఈ బ్లాక్‌లేడీ ఉందని తెలిపింది. చిత్ర‌బృందంతో పాటు ఫిల్మ్‌ఫేర్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది. మిమి సినిమాలో కృతిస‌న‌న్ స‌రోగ‌సి మ‌ద‌ర్‌గా న‌టించి మంచి ప్ర‌శంస‌లు అందుకుంది.   View this post on Instagram A post shared by Kriti (@kritisanon)

    మ‌న‌వ‌రాలితో క‌లిసి మెగాస్టార్ వినాయ‌క చ‌వితి పూజ‌

    మెగాస్టార్ చిరంజీవి నేడు ఆయ‌న నివాసంలో వినాయ‌క చ‌వితి పూజ నిర్వ‌హించారు. ఇందులో చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ‌, త‌ల్లితో పాటు ఆయ‌న కూతురు శ్రీజ‌, మ‌న‌వ‌రాలు కూడా పాల్గొన్నారు. శ్రీజ కూతురు వినాయ‌క స్తోత్రం చ‌దువుతుంటే చూసి చిరంజీవి మురిసిపోతున్నాడు. ఇంట్లోనే మ‌ట్టి వినాయ‌కుడికి ఘ‌నంగా పూజ‌లు నిర్వ‌హించిన మెగాస్టార్ అంద‌రికీ వినాయ‌క‌చ‌వితి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

    పెద్ద‌మ్మ‌త‌ల్లిని ద‌ర్శించుకున్న ‘లైగ‌ర్’ టీమ్

    విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ‘లైగ‌ర్’ టీమ్ నేడు జూబ్లిహిల్స్ పెద్ద‌మ్మ‌త‌ల్లి ఆల‌యాన్ని సంద‌ర్శించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఛార్మి, పూరీ జ‌గ‌న్నాథ్, విషు రెడ్డి త‌దిత‌రులు ఇక్క‌డికి వ‌చ్చారు. విజ‌య్‌ను చూసేందుకు అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ హ‌డావిడి చేశారు. లైగ‌ర్ మూవీ నిన్న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. https://youtube.com/watch?v=VJmq-bUkHB0

    ఒంటిపై ఆవుపేడ పూసుకున్న మోనాలిసా

    భోజ్‌పురి నటి మోనాలిసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తరచూ తన హాట్ పిక్స్ పోస్ట్ చేసే ఈ భామా తాజాగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఓ ఫన్నీ షార్ట్ వీడియోలో మోనాలిసాకు దురద పుట్టడంతో ఆవుపేడను ఒంటికి పోసుకుంటున్న తీరు నవ్వు తెప్పిస్తోంది. ఆ వీడియో చూసిన మోనాలిసా ఫ్యాన్స్, నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

    ఆసక్తికరమైన అప్డేట్ పంచుకున్న ధృవ్ విక్రమ్

    తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు, నటుడు ధృవ్ విక్రమ్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. తన ట్రాక్ 1 అధికారిక మ్యూజిక్ వీడియోను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఓ ప్రోమోను విడుదల చేశాడు. ఈ మ్యూజిక్ వీడియోలో ధృవ్, ఉజ్వల్ గుప్తా పాడి నటించినట్లు తెలుస్తోంది. ‘మహాన్’ విజయం తరువాత ఎలాంటి సినిమాలు ఒప్పుకొని ధృవ్.. కథలను వింటున్నాడు. ఈ క్రమంలోనే మ్యూజిక్ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది.

    కేకే జయంతి : తెలుగులో కేకే అద్భుతమైన పాటలు

    కె.కె.గా సంగీత ప్రపంచానికి పరిచయమైన వ్యక్తి కృష్ణ కుమార్‌ కున్నత్‌. దేశంలోని అద్భుతమైన గాయకుల్లో ఒకడైన కేకే ఈ యేడాది మే 31న దివికేగారు. కోల్‌కతాలో ఓ సంగీత కార్యక్రమంలో గుండపోటు రావడంతో కెేకే చనిపోయారు. కానీ పాటల రూపంలో ఇప్పటికీ ఆయన మన మధ్యనే ఉన్నారు. హిందీ, తమిళ భాషలతో పాటు తెలుగులోనూ ఎన్నో అద్భుతమైన పాటలకు కేకే తన గాత్రంతో ప్రాణం పోశారు. ప్రేమికులు, ప్రేమ విఫలమైన వాళ్లు పాటలు వెతికితే అందులో కేకే పాట లేకుండా ఉండదు అంటే అతిశయోక్తి … Read more

    వ‌రుస ఫ్లాప్‌ల‌కు మేమే కార‌ణం: అక్ష‌య్ కుమార్‌

    అక్ష‌య్ కుమార్, ర‌కుల్ ప్రీత్ జంట‌గా న‌టించి ‘క‌ట్‌పుట్లీ’ మూవీ సెప్టెంబ‌ర్ 2న‌ హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో చిత్ర‌బృందం ముచ్చ‌టించింది. వ‌రుస‌గా హిందీలో సినిమాల‌న్నీ ఫ్లాప్ కావ‌డానికి కార‌ణాలేంటి అని రిపోర్ట‌ర్లు ప్ర‌శ్నిచారు. దానికి స‌మాధానంగా అక్ష‌య్ అది మా త‌ప్పే..మేము ఆడియ‌న్స్ ఏం కోరుకుంటున్నారో అటువంటి సినిమాలు చేయాలి. నేను ఎవ‌ర్ని త‌ప్పు ప‌ట్ట‌డంలేదు. నా క‌థ‌ల ఎంపిక విష‌యంలోనే జాగ్ర‌త్త వ‌హించాలి అని చెప్పాడు. ఇక ఓటీటీలో చేయ‌డం సేఫ్టీ కోసం ఏం కాద‌ని ఇక్క‌డ … Read more