• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    ‘ఎందుకో అర్థం కావట్లేదు’: సురేఖ వాణి

    ప్రముఖ టాలివుడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి ఎమోషనల్‌ అయ్యారు. ఇటీవల సినిమాల కన్నా సోషల్‌ మీడియాలోనే కనిపిస్తున్న సురేఖ…. తనకు సినిమాలు రావట్లేదని భావోద్వేగానికి లోనయ్యారు. ‘స్వాతిముత్యం’ సక్సెస్‌ మీట్‌లో ఆమె మాట్లాడారు. ‘ఇటీవల చాలా మంది నేను సినిమాలు మానేశాను అనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. నేను సినిమా పిల్లను, సినిమాతోనే ఉంటా. ఇటీవల అవకాశాలు రావట్లేదు. అది ఎందుకో కూడా అర్థం కావట్లేదు’ అని సురేఖ చెప్పుకొచ్చారు.

    విజయ్‌, రష్మిక మాల్దీవ్స్‌ టూర్‌

    వెండితెర జోడీ విజయ్‌ దేవరకొండ, రష్మిక ప్రేమపై నిరంతరం వార్తలు వస్తూనే ఉంటాయి. వారు మాత్రం దీనిపై ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఇవాళ మరోసారి వీరి ప్రేమ వ్యవహారం వార్తల్లోకెక్కింది. వీరిద్దరూ కలిసి మాల్దీవులు టూర్‌ వెళ్తున్నారంటూ ప్రచారం సాగుతోంది.ఇవాళ ఉదయం రష్మిక ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఫోటోగ్రాఫర్లకు హాయ్‌ చెప్పి లోపలికి వెళ్లిపోయారు. కాసేపటికే విజయ్‌ కూడా ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నాడు. దీంతో వీరిద్దరూ కలిసి మాల్దీవుల టూర్‌ వెళ్తున్నారంటూ గుసగుసలు మొదలయ్యాయి.

    యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ‘హంట్’ టీజర్

    ఈనెల 3వ తేదీన విడుదలైన సుధీర్ బాబు ‘హంట్’ టీజర్ ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 4.5 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి దూసుకెళ్తుంది. మహేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు.

    ‘దీంతనానా’ ప్రోమో విడుదల

    అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట ప్రోమో విడుదలైంది. ‘దీంతనానా’ అంటూ సాగే పాటను సిద్ శ్రీరాం ఆలపించారు. ఈ పాటను అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అచు సంగీతం అందిస్తున్నారు.

    వినసొంపుగా ‘లైక్ షేర్ అండ్ సబ్స్‌క్రైబ్’ టైటిల్ సాంగ్

    సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్‌క్రైబ్’. నవంబర్ 4వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి తాజగా టైటిల్ సాంగ్ విడుదలైంది. ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ, సుదర్శన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.

    ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకున్న పూర్ణ

    అటు సినిమాతో, ఇటు షోలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉంటుంది నటి పూర్ణ. ఇటీవలే పెళ్లికూడా సిద్దమైన ఈ చబ్బీ బ్యూటీ దసరా సందర్భంగా పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లో సాంప్రదాయ అమ్మాయిగా ఉన్న పూర్ణను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. బయటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram:

    ‘ఓ పారి’ పాప్ సాంగ్ రిలీజ్

    పాన్ ఇండియా రెంజ్‌లో కంపోజ్‌ చేసిన ‘ఓ పారి’ పాప్‌ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేశారు. తొలిసారి హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ సాంగ్‌ను DSP కంపోజ్ చేశారు. ఈ పాటక్ లిరిక్స్, ఎడిటింగ్, డ్యాన్స్ అన్ని తానై వ్యవహరించారు. సాంగ్‌లోని లిరిక్స్ బాగున్నాయి. లోకెషన్స్‌ రిచ్‌గా కనిపించాయి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

    రావణ దహనం చేసిన ప్రభాస్

    ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జ‌రిగిన రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మంలో హీరో ప్ర‌భాస్ పాల్గొన్నారు. అక్క‌డ‌కు వ‌చ్చిన వారితో ఫొటోలు దిగ‌టంతో పాటు.. వారిచ్చిన కానుక‌ల‌ను స్వీక‌రించారు. విల్లు ఎక్కు పెట్టి బాణాన్ని సంధించి రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మం చేశారు. దర్శ‌కుడు ఓం రౌత్‌తో క‌లిసి అక్క‌డ రామ ల‌క్ష్మ‌ణులు, ఆంజ‌నేయుడు వేషం వేసుకున్న న‌టీన‌టుల‌కు హార‌తి ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ‘UnStoppable 2’ టీజర్ విడుదల

    విజయవాడలో ‘UnStoppable 2’ టీజర్‌ని నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ‘మా నాన్న నేర్పిన సంస్కారం వుంది. సినిమా రంగం ఎప్పుడూ బాగుండాలి. నా తండ్రే నాకు స్ఫూర్తి దైవం. సినీ పరిశ్రమకు చైర్మన్‌గా, హిందూపురానికి ఎమ్మెల్యేగా సేవలు చేస్తున్నా’ అని బాలకృష్ణ తన అనుభవాలను పంచుకున్నారు. కాగా, టీజర్‌లో బాలయ్య వినూత్న గెటప్‌లో అలరించారు. ఈ షోకు మొదటి గెస్ట్‌గా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రానున్నట్లు సమాచారం.

    ‘ఆదిపురుష్ VFX‌తో మాకు సంబంధం లేదు’

    ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ మూవీ నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కు మిశ్రమ స్పందన వస్తుంది. గ్రాఫిక్స్ తేలిపోయిందని, ఇంకా బాగా చేయాల్సి ఉందని కామెంట్స్ వచ్చాయి. తాజాగా దీనిపై NY VFXwalla సంస్థ స్పందించింది. తమకు, ఆదిపురుష్ సినిమాకు సంబంధం లేదని ప్రకటించింది. తాము ఆదిపురుష్ సినిమా VFX పనుల్లో భాగం కాలేదని వెల్లడించింది. కాగా NY VFXwalla బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌కు చెందిన సంస్థ.