• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత మహిళా పైలట్‌కు అరుదైన గౌరవం

    ఎయిర్‌ ఇండియా పైలట్‌ జోయా అగర్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత శాన్‌ ఫ్రాన్సిస్కో ఏవియేషన్‌ మ్యూజియంలో ఆమెకు చోటుదక్కింది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకు నార్త్‌పోల్‌ మీదుగా 16000 కిలోమీటర్లు ప్లేన్ నడిపిన తొలి భారత మహిళా పైలట్‌గా జోయా రికార్డు సృష్టించినందుకు గానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది. 2021లో జోయా ఈ ఘనత సాధించారు. ‘ SFO ఏవియేషన్‌ మ్యూజియంలో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. యూఎస్‌ఏలోని ప్రఖ్యాత మ్యూజియంలో నేను చిరకాలం నిలిచిపోతాననే ఊహను కూడా నేను … Read more

    పాంగ్యాంగ్‌ లేక్‌లో భారత్ యుద్ధసన్నద్ధత

    భారత్- చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలోని కీలకమైన పాంగ్యాంగ్ లేక్‌లో యుద్ధసన్నద్దతను ఇండియన్ ఆర్మీ ప్రదర్శించింది. ఈ ప్రాంతంలో చైనా ఆర్మీ కొద్ది రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాంగ్యాంగ్ లేక్‌లో పలుమార్లు పెట్రోలింగ్ చేసింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఇండియన్ ఆర్మీకి అత్యాధునికమైన బోట్స్‌ను అందించింది. ఒక్కో బోట్ ఏకకాలంలో 35 మంది జవాన్లను మోసుకెళ్లగలదు. ఈ బోట్లు ప్రవేశించడంతో పాంగ్యాంగ్ లేక్ ప్రాంతంలో భారత్‌కు వ్యూహాత్మక ఆదిపత్యం లభించే అవకాశం ఉంది. #WATCH | Indian Army showcased capability of … Read more

    75వ‌ స్వాతంత్య్ర వేడుక‌ల సంద‌ర్భంగా అంత‌రిక్షం నుంచి భార‌త్‌కు శుభాకాంక్ష‌లు

    భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర‌ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా, ఇటాలియన్ వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి అంత‌రిక్షం నుంచి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇస్రో చేప‌డుతున్న‌ “గగన్‌యాన్” విజయవంతం కావాలని కోరుతూ వీడియో సందేశాన్ని పంపారు – ఈ వీడియోను అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు షేర్ చేశారు. “ఇస్రోతో మా భాగస్వామ్యాన్ని విస్తరించడం, కలిసి విశ్వాన్ని అన్వేషించడం భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనల కోసం మనందరి లక్ష్యం” అని ఆమె చెప్పారు. ‘గగన్‌యాన్‌’కు సన్నాహాలు పూర్తయ్యాయని, భారత సంతతికి చెందిన మానవులు వచ్చే ఏడాది … Read more

    పాకిస్తాన్ లో సంక్షోభంపై మహిళ ఆవేదన

    పాకిస్తాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా రోజువారీ జీవనమే కష్టమవుతోంది. తాజాగా ఈ విషయంపై కన్నీరు పెడుతూ ఓ మహిళ పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘నేనేం చేయాలి?, ఇంటి అద్దె కట్టాల్, పెరిగిపోయిన కరెంటు బిల్లులు కట్టాలా, మీకు పన్నులు కట్టాలా, నా పిల్లలకు మందులు కొనాలా?’ అంటూ కన్నీరు పెట్టుకుంది. తన పిల్లలకు కడుపునింపాలా? ఆకలితో చావనివ్వాలా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. [వీడియో](url) کراچی سے تعلق رکھنے والی ایک ماں نے حکمرانوں کو اپنا بجلی … Read more

    ఆవు పేడ రాఖీలకు అమెరికా, మారిషస్లో మస్త్ డిమాండ్

    మన దగ్గర తయారైన స్పెషల్ రాఖీలు అమెరికా, మారిషస్ వంటి దేశాలకు 60 వేలకుపైగా ఎగుమతి అయ్యాయి. ఆ రాఖీలు జైపూర్‌కు చెందిన ఆర్గానిక్ ఆవు పేడతో తయారు చేయడం విశేషం. అమెరికా నుంచి 40 వేల రాఖీలకు ఆర్డర్‌ రాగా, మారిషస్‌ నుంచి మరో 20 వేల ఆర్డర్‌ వచ్చిందని ఆర్గానిక్‌ ఫార్మర్‌ ప్రొడ్యూసర్ తెలిపారు. దీంతో ఈ ఏడాది ఆవు పేడతో తయారు చేసిన రాఖీలు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలువనున్నాయి.

    ఘెార ప్రమాదంలో గర్భిణి సహా 5గురు మృతి

    అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో గురువారం జరిగిన ఓ ప్రమాదంలో గర్భిణి ఆమె ఏడాది కుమారుడు సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. అతి వేగంతో ఓ కారు మిగతా కార్లను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయిన విజువల్స్ లో ప్రమాదం జరిగిన తీరు కనబడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. వీడియో కోసం [ఇక్కడ](url) క్లిక్ చేయండి. TW: Surveillance video shows violent crash that left 5 dead, intersection of La … Read more

    బ్లూ ఆరిజిన్ అంతరిక్ష యాత్ర విజయవంతం

    ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ మరోసారి విజయవంతంగా అంతరిక్ష యాత్ర నిర్వహించింది. ఈసారి ఈ యాత్రలో ఇద్ద‌రు మ‌హిళ‌లు స‌హా మొత్తం ఆరుగురుని అంత‌రిక్షంలోకి తీసుకెళ్లింది. మొత్తం 11 నిమిషాల్లో ఈ యాత్ర పూర్తవగా.. స్పేస్ క్యాప్సూల్ అంత‌రిక్షంలోకి వెళ్లిన తరువాత ఆ ఆరుగురు బరువును కోల్పోయారు. దీంతో వారు గాలిలో చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. Forever changed. #NS22 pic.twitter.com/UWrtHLiHrH — … Read more

    చిలీలో వెలుగులోకి మిస్టీరియస్ సింక్‌హోల్

    చిలీ రాజధాని శాంటియాగోకు ఉత్తరాన 665 కిలోమీటర్ల (413 మైళ్ళ) దూరంలో భూమిపై పెద్ద సింక్ హోల్ ఏర్పడింది. అది 25 మీటర్ల (82 అడుగులు) వ్యాసం కల్గి ఉంది. విషయం తెలిసిన అధికారులు ఎలా ఏర్పడింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కాపర్ మైనింగ్ నిర్వహించే ప్రాంతంలో అది ఏర్పడటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. లోపల పరిశీలించగా నీరు మాత్రమే ఉందని పలువురు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ సింక్ హోల్ వైమానిక చిత్రాలను చిలీ మీడియా రిలీజ్ చేసింది.

    కొచ్చి ఎయిర్‌పోర్టు.. ప్ర‌పంచంలోనే మొద‌టి సోలార్ ఎయిర్‌పోర్ట్‌

    కొచ్చి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు 100 శాతం పూర్తిగా సోలార్ ప‌వ‌ర్‌తోనే న‌డుస్తుంది. దీనికోసం ర‌న్‌వే ప‌క్క‌న వేల కొద్ది సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేశారు. ఈ మొత్తం ఏరియా 30 ఫుట్‌బాల్ గ్రౌండ్‌ల‌కు స‌మానంగా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ రూఫ్‌టాప్‌ల‌పై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేశారు. ఇవి 10 వేల గృహాల‌కు స‌రిప‌డేంత విద్యుత్‌ను త‌యారుచేస్తున్నారు. ఇక్క‌డ అవ‌స‌ర‌మైన‌దానికంటే ఎక్కువ‌గా విద్యుత్ త‌యారీ అవుతుంది. దీంతో కేర‌ళ గ్రిడ్ సిస్ట‌మ్‌కు ప‌వర్ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. కొచ్చిని చూసి కోల్‌క‌తా ఎయిర్‌పోర్టులో కూడా ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు. … Read more

    అమెరికా కెంటుకీ వరదలు: 37కు చేరిన మృతులు

    అమెరికాలోని తూర్పు కెంటకీలో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 37కి చేరుకుంది. మరికొంత మంది గల్లంతైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రాణనష్టం సంఖ్య క్రమంగా పెరగవచ్చని పేర్కొన్నారు. ఆకస్మాత్తుగా భారీగా వరదనీరు రావడంతో అనేక ఇళ్లు నీటమునిగాయి. దీంతో 12 వేల కంటే ఎక్కువ గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలిపారు. మరోవైపు 300 మందికిపైగా వ్యక్తులు షెల్టర్లలో వసతి పొందుతున్నారని చెప్పారు. అంతేకాదు వరదల కారణంగా హైవేలు కొట్టుకుపోయాయని, వంతెనలు, ఇళ్లు ధ్వంసమయ్యాయని ప్రకటించారు.