• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒకే కుటుంబంలో 19 మంది మృతి

    ఇజ్రాయెల్ దాడిలో ఓ జర్నలిస్టు 19 మంది కుటుంబసభ్యులను కోల్పోయాడు. హమాస్‌ నెట్‌వర్క్‌ లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తుంది. ఈ క్రమంలోనే గాజా శివార్లలోని జబాలియాలో శరణార్థ శిబిరం ఉన్న అపార్ట్‌మెంటుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రముఖ మీడియా సంస్థ చెందిన ఓ జర్నలిస్టు కుటుంబంలో 19 మంది శరణార్థ శిబిరంలో ప్రాణాలు కోల్పోయారు.

    ఒకే ఫ్యామిలీలోని 9 మంది కాల్చివేత

    ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కాల్చివేశారు. దీంట్లో ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు. తూర్పు ఉక్రెయిన్‌కు చెందిన వోల్న‌వాకా ప‌ట్ట‌ణంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇళ్లు ఇవ్వ‌లేద‌న్న కోపంతో ర‌ష్యా సైనికులు ఆ కుటుంబాన్ని కాల్చివేసి ఉంటార‌ని ఉక్రెయిన్ ఆరోపించింది. ర‌క్త‌పు మ‌ర‌క‌లు, బుల్లెట్లు దిగిన శ‌రీరాలతో ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘ‌ట‌న ప‌ట్ల రెండు దేశాలు వేర్వురుగా ద‌ర్యాప్తు ప్రారంభించాయి.

    రష్యా ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం

    రష్యాలోని ఓ విమానాశ్రయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌ నుంచి బయలుదేరిన విమానం దగెస్థాన్‌ విమానాశ్రయంలో ఆగడంతో అక్కడి నిరసనకారులు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విమానాన్ని తమ ప్రాంతంలో ల్యాండ్‌ చేయడాన్నివారు తీవ్రంగా తప్పుబట్టారు. అంతేగాక విమానం దిగిన వారిపైకి దూసుకెళ్లారు. ఈ ఘటనలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నిరసనలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. When word spread that a plane from Tel Aviv was … Read more

    పడవ బోల్తా.. 70 మంది గల్లంతు

    ఆఫ్రికాలోని ఘోర విషాదం చోటుచేసుకుంది. నదిలో ఓ పడవ బోల్తా పడి 17 మంది మృతి చెందారు.. మరో 70 మందికి పైగా గల్లంతయ్యారు. దేశంలోనే అతిపెద్దదైన బెన్యూ నదిలో ఈ విషాదం జరిగింది. స్థానికులు చేపల మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న వ్యాపారులతో కూడిన పడవ నదిలో బోల్తా కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో పడవలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

    ‘ప్రజలు చనిపోతున్నారు.. చర్చలు జరపండి’

    రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్దంలో ఏ దేశానికి విజయం దక్కదన్నారు. యుద్ధం కాణంగా ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధం ఫలితంపై ప్రతిష్టంభన నెలకొంది. ఎవరూ పూర్తి స్థాయిలో పుంజుకోలేక పోతున్నారు. కాబట్టి ఇరు దేశాలు చర్చలు జరుపుకొని ఓ నిర్ణయానికి రండి’. అని అలెగ్జాండర్ పిలుపునిచ్చారు.

    ఢీకొన్న కార్లు, బస్సులు.. 32 మంది మృతి

    ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. అలెగ్జాండ్రియాలోని హైవేపై కార్లు, బస్సులు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 32 మంది మృతిచెందారు మరో 63 మంది తీవ్రంగా గాయపడారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు ప్యాసింజర్‌ బస్సులు, 10 కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. దీంతో ఓ కారు నుంచి ఆయిల్‌ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనున్న మిగతా వాహనాలకు అంటుకున్నాయి. దీంతో కొందరు వాహనాల్లోనే సజీవదహనమైయ్యారు.

    బతుకమ్మకు అరుదైన గౌరవం

    తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ‘బతుకమ్మ’ పండగకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని జార్జియాలో బతుకమ్మ పండగను గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ బ్రెయిన్‌ పి.కెంప్‌ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌ 3వ వారాన్ని బతుకమ్మ వారంగా ప్రకటించారు. ఈ ప్రకటనపై పలువురు తెలంగాణ అసోసియేషన్‌ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగగా బతుకమ్మ గుర్తింపు పొందింది. 12వ శతాబ్దం నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నట్లు ఆధారాలు ఉన్నాయి.

    ఆ దేశానికి వెళ్లాలంటే.. 1000 డాలర్ల ఫీజు కట్టాల్సిందే!

    భారత్‌, ఆఫ్రికా దేశాలకు ఎల్‌ సాల్వడార్‌ షాకిచ్చింది. ఇకపై తమ దేశంలోకి రావాలంటే 1000 డాలర్ల ఫీజు కట్టాలని పేర్కొంది. ఈ మేరకు ఎల్‌ సాల్వడార్‌ అధికారికంగా వెల్లడించింది. తమ దేశం మీదుగా అమెరికాకు వలసలను తగ్గించే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా ఆదేశాల మేరకు భారత్, 57 ఆఫ్రికా దేశాల ప్రయాణికులు ఇకపై ఎల్‌ సాల్వడార్‌ వెళ్లాలంటే.. వ్యాట్, ఇతర ఛార్జీలతో కలిపి 1130 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

    ఘోరం.. కాల్పుల్లో 22 మంది మృతి

    అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లెవిస్టన్‌, మైనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో దాదాపు 60 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    హమాస్‌పై దాడికి ఇజ్రాయెల్ సరికొత్త ఆయుద్ధం

    హమాస్ మిలిటెంట్లపై ప్రయోగించేందుకు ఇజ్రాయెల్ తన అమ్ములపొది నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీస్తోంది. తాజాగా ఐరన్ స్టింగ్ అనే ఆయుధ వ్యవస్థను రంగంలోకి దించింది. గాజాలో జనవాసాల మధ్య నుంచి రాకెట్లను ప్రయోగించే లాంఛర్లను ధ్వంసం చేసేందుకు ఐరన్ స్టింగ్ అనే ఆయుధాన్ని వాడటం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. తొలిసారి యుద్ధంలోకి ఈ ఆయుధాన్ని తీసుకువస్తున్నట్లు పేర్కొంది.