• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బందీలు ప్రాణాలతోనే ఉన్నారు: ఇజ్రాయెల్

    హమాస్ మిలిటెంట్ల వద్ద బాందీలుగా ఉన్న చాలా మంది ప్రాణాలతోనే ఉన్నారని ఇజ్రాయెల్ వెల్లడించింది. దాదాపు 200 మంది హమాస్ చెరలో బందీలుగా ఉన్నారని పేర్కొంది. వారిలో ఎక్కువ శాతం సజీవంగా ఉన్నారని వెల్లడించింది. బందీల్లో 20 మంది చిన్నారులు, మరో 10-20 మంది 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఉన్నట్లు తెలిపింది. హమాస్‌ల చెర నుంచి వారిని కాపాడుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది.

    తక్కువ ధరకే ‘ఎక్స్‌’ ప్రీమియం ఫీచర్లు.

    ‘ఎక్స్‌’ (ట్విట్టర్) తాజాగా మరో కీలక అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ప్రీమియం పెయిడ్‌ సర్వీస్‌లో రెండు కీలక మార్పులు చేసింది. ఈ రెండు రకాల ప్రీమియం ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు తక్కువ ధరకే కొత్త ప్రీమియం ప్యాక్‌ను తీసుకురానున్నారు. అయితే, దీంట్లో వ్యాపార ప్రకటనలు ఉంటాయి. యాడ్స్‌ వచ్చినా పరవాలేదనుకుంటే.. ప్రీమియం ఫీచర్ల కోసం ఈ ప్యాక్‌ను పొందొచ్చు’ అని ఎక్స్ వెల్లడించింది.

    టీమిండియాను ఓడిస్తే డిన్నర్ డేట్‌కు వస్తా: పాక్ నటి

    గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో పాక్ నటి సెహర్ షిన్వారి విషం చిమ్ముతూ సంచలన ప్రకటన చేసింది. రేపు జరగబోయ్ భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడిస్తే.. బంగ్లాదేశ్ ఆటగాడితో డిన్నర్ డేట్‌కు వెళ్తానని ప్రకటించింది. ‘భగవంతుడా భారత జట్టును బాంగ్లాదేశ్ ఓడిస్తే ఆ దేశ ఆటగాడితో ఢాకాకు వెళ్లి డిన్నర్ డేట్‌కు చేస్తా’ అని షిన్వారి ట్వీట్ చేసింది. ఈ నటి గతంలో కూడా వివాదాస్పద పోస్ట్‌లు చేసింది.

    ఇజ్రాయేల్‌కు ‘హమాస్’ ఆఫర్

    గాజాపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు ఆపితే తమ చెరలో ఉన్న ఇజ్రాయేల్, ఇతర దేశాల పౌరులను విడిచి పెడతామని ఉగ్రసంస్థ హమాస్ తాజా ప్రతిపాదన చేసింది. గాజాలో ఇజ్రాయేల్ ఆక్రమించిన ప్రాంతాలను వదిలి వెళ్లాలి. వైమానిక దాడులను నిలిపివేయాలి. ఎలాంటి బాంబు దాడులు చేయకూడదు. బాంబు దాడులు ఆపితే గంటలోనే వారిని విడిచిపెడతామని ఆఫర్ ఇచ్చింది. హమాస్ బందీలుగా దాదాపు 200 మంది ఇజ్రాయేల్, ఇతర దేశాల పౌరులు ఉన్నట్లు సమాచారం.

    ఇజ్రాయెల్ పర్యటనకు బైడెన్

    రేపు ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని అమెరికా వైట్‌హౌస్ ప్రకటించింది. అనంతరం ఆయన జోర్డాన్‌కూ వెళ్లనున్నట్లు తెలిపింది. అక్కడ ఈజిప్ట్‌, పాలస్తీనా, జోర్డాన్‌ దేశాధినేతలతో సమావేశం కానున్నట్లు పేర్కొంది. తీవ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌ మద్దతు ఇవ్వడమే బైడెన్ పర్యటన ప్రధాన ఉద్దేశమని శ్వేతసౌధం పేర్కొంది. అలాగే గాజాలోని మానవతా సంక్షోభ నివారణ గురించీ చర్చిస్తారని పేర్కొంది.

    రేపు ఇజ్రాయేల్‌లో జోబైడెన్ పర్యటన

    రేపు ఇజ్రాయేల్‌లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పర్యటించనున్నారు. హమాస్ ఉగ్రదాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయేల్‌కు అండగా నిలిచేందుకే బైడెన్ అక్కడ పర్యటిస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతారు. అనంతరం ఇజ్రాయేల్ నుంచి జోర్డాన్ రాజధాని అమ్మన్‌కు వెళ్తారు. అక్కడ ఆ దేశ రాజు అబ్దుల్లా, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమవుతారు. పాలస్తీన ప్రజల ప్రతినిధులుగా హమాస్‌ను గుర్తించమని ఈ భేటీలో ఆయన ప్రకటించనున్నారు.

    ఐస్‌క్రీమ్‌ ట్రక్కుల్లో మృతదేహాలు

    గాజాలో పౌరుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. . ఇజ్రాయెల్‌ దాడుల్లో వేలాది మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.. వారి మృతదేహాలను భద్రపర్చేందుకు చోటు సరిపోవడం లేదు. దీంతో ఐస్‌క్రీమ్‌ ట్రక్కుల్లో మృతదేహాలను ఉంచే దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గజాలో అత్యంత విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు 2,600 మందికి పైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిని కాల్చేందుకు శ్మశానవాటికల్లోనూ స్థలం సరిపోకపోవడం లేదు.

    ఇజ్రాయెల్‌ దాడి.. 2215 మంది మృతి

    ఇజ్రాయెల్‌ దాడిలో గాజాలో 1300 భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో 2215 మంది మృతి గాజా పౌరులు మృతి చెందారు. హమాస్‌ మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తుంది. గతవారం రోజులుగా ఇజ్రాయెల్‌ సైన్యం పెద్ద పెద్ద భవంతులు పేకమేడల్లా కూల్చేస్తుంది. వీటిల్లో 5,540 హౌసింగ్‌ యూనిట్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఇక మరో 3,743 నివాసాలు మరమ్మతులు చేయలేని విధంగా దెబ్బతిన్నాయి.

    పిల్లలను ఆడిస్తున్న హమాస్‌ మిలిటెంట్లు

    ఇటీవల ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.. అక్కడ్నుంచి కొంతమంది పౌరులను బందీలుగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆ బందీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో ఉగ్రవాదులు బందీల పిల్లలను ఆడిస్తూ, కన్పించారు. ఓ మిలిటెంట్‌ ఒక చేతిలో ఏకే-47 తుపాకీ పట్టుకుని చంటిబిడ్డను ఎత్తుకుని ఆడిస్తున్నాడు. బందీలను తాము క్షేమంగానే చూసుకుంటున్నామనే సందేశాన్ని ఇచ్చేందుకే మిలిటెంట్లు ఈ వీడియోను విడుదల చేశారని అభిప్రాయాలు వస్తున్నాయి.

    హమాస్‌ కీలక నేత హతం

    ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హమాస్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఒకరిని మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. నిన్న రాత్రి జరిగిన వైమానికి దాడుల్లో హమాస్‌ వైమానిక విభాగానికి అధిపతిగా పనిచేసిన మురాద్ అబు మురాద్ మృతి చెందినట్లు పేర్కొన్నాయి. హమాస్‌ వైమానిక కార్యకలాపాల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న రాత్రి దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి.