• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇండో అమెరికన్లుకు శుభవార్త

    అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు అధ్యక్షుడు జో బైడెన్‌ శుభవార్త చెప్పారు. హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ ఎలాంటి ఉద్యోగాలైనా చేసేందుకు అనుమతించారు. ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌–ఈఏడీ గడువు కాలాన్ని ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త నిబంధనలు ఈఏడీల కోసం అప్లయ్‌ చేసుకునే వారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.

    మధ్యవర్తిత్వానికి సిద్ధమే: పుతిన్

    ఇజ్రాయెల్‌- హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాలు ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు, మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు. పౌరులపై ఆయుధాలను ఉపయోగించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని చెప్పారు. అమాయకుల మరణాలు ఆమోదయోగ్యం కాదని పుతిన్ వ్యాఖ్యానించారు.

    లాటరీలో రూ.14.699 కోట్లు జాక్‌పాట్

    అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వ్యక్తికి జాక్‌‌పాట్ తగిలింది. పవర్‌బాల్ జాక్‌పాట్ లాటరీలో అతడు ఏకంగా 1.765 బిలియన్ డాలర్లు (రూ.14.699 కోట్లు) ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. అయితే ఈ టికెట్ కొన్న వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

    13 మంది బందీలు మృతి: హమాస్

    ఇజ్రాయెల్‌పై దాడులకు దిగిన హమాస్ మిలిటెంట్లు ఆ దేశ పౌరులను బందీలుగా తీసుకువెళ్లారు. వారిని విడిపించుకునే క్రమంలో ఇజ్రాయెల్ గాజాలో నీరు, విద్యుత్, ఇంధన సరఫరాలను నిలిపేసింది. గాజాపై బీకర దాడులు చేస్తుంది. అయితే ఈ దాడుల్లో తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు 13 మంది మృతి చెందినట్లు హమాస్ వెల్లడించింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. బందీలను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రస్తుతం గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెట్టింది.

    ఇజ్రాయేల్ వార్నింగ్‌పై ఐరాస ఆందోళన

    గాజా- ఇజ్రాయేల్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి ఆందోళ వ్యక్తం చేసింది. తాజాగా గాజాలో నివసిస్తున్న ప్రజలు 24 గంటల్లోగా ఖాళీ చేసి దక్షిణాదికి వెళ్లాలని ఇజ్రాయేల్ సైన్యం హెచ్చరించింది. గాజాలో ఉన్న హమాస్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీని వల్ల సామాన్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని వెల్లడించింది. 11 లక్షల మంది సామాన్యులు ఉన్నపళంగా వెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. రెండు వర్గాలు సంయమనం పాటింటాలని సూచించింది.

    ‘అప్పటి వరకు గాజాలో అన్ని బంద్’

    హమాస్ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ పలు హెచ్చరికలు చేసింది. బందీలుగా ఉన్న తమ పౌరులను సురక్షితంగా విడిచిపెట్టాలని కోరింది. అప్పుడే గాజాకు నీరు, విద్యుత్, ఇందన సరఫరాలు పునరుద్ధరిస్తామని చెప్పింది. అప్పటి వరకు గాజాపై తమ నిబంధనలు కొనసాగుతాయని హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్నవారు క్షేమంగా ఇళ్లకు పంపాలని చెప్పింది. లేకుంటే తీవ్ర మరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉగ్రవాదులు దాడి చేసిన రెండో రోజు నుంచే గాజాను ఇజ్రాయెల్ అష్టదిగ్భందనం చేసిన విషయం తెలిసిందే..

    గాజా స్ట్రిప్‌లో తీవ్రంగా ఫుడ్ కొరత

    గాజా స్ట్రిప్ ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల కొరత సైతం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంపై గత గురువారం జరిగిన రాకెట్ల దాడిలో వెయ్యి మందకి పైగా పౌరులు మృతి చెందారు. యుద్ధ వాతావరణం కారణంగా అక్కడి ప్రజలు చాలా మంది ఇజ్రాయెల్, ఈజిప్ట్ భూ భాగంలోకి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు వారిని నిలువరించడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

    అంధకారంలోకి ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్‌లో గాజాపై హమాస్ ఉగ్రవాదుల భీకర దాడులను కొనసాగుతున్నాయి. హమాస్‌ విలిటెంట్లు కేంద్రంగా చేసుకున్న అనేక స్థావరాలపై ఇజ్రాయెల్‌ రక్షణ బలగాలు దాడులకు తెగబడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం మూతపడింది. గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్‌.. విద్యుత్తు, ఆహారం, ఔషధాలతోపాటు ఇంధన సరఫరాను నిలిపేసింది. దీంతోపాటు గాజా సరిహద్దులన్నింటినీ మూసివేయడంతో.. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి, ఇళ్లు, కార్యాలయాల్లో వాడే జనరేటర్లకు ఇంధనం తీసుకురావడం అసాధ్యంగా మారింది.

    వరుస భూకంపాలతో అఫ్ఘాన్‌ విలవిల

    వరుస భూకంపాలతో అల్లాడుతున్న అఫ్ఘానిస్తాన్‌లో నేడు మరో భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం 6.11 గంటల సమయంలో 6.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. హెరాత్ నగరానికి 29 కిలోమీటర్ల దూరంలో ఇది నమోదైనట్లు తెలిపింది. కాగా, అఫ్ఘాన్‌లో ఇప్పటికే వరుస భూకంపాలతో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. నాలుగు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఇప్పటికే శిథిలాల నుంచి 4 వేల మృతదేహాలను వెలికితీశారు.

    చనిపోయినట్లు నటించినా గుర్తించి చంపేశారు

    ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ ఉగ్రవాదులు నరమేధం కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదుల నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ మహిళ చనిపోయినట్లు నటించింది. అయినా ఆమె శ్వాసను గుర్తించి మరీ ఉగ్రవాదులు ప్రాణం తీశారు. మాపల్‌ ఆడమ్‌ (27) అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో ఆమె ఓ ట్రక్కు కింద దాక్కుని చనిపోయినట్లు నటించింది. అయితే ఆమె శ్వాస తీసుకోవడాన్ని గుర్తించిన ఉగ్రవాదులు ఆమెను హతమార్చారు.