• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్విట్టర్‌లో కీలక మార్పు

    ట్విట్టర్‌ కీలక మార్పు తీసుకొచ్చింది. రిప్లయ్‌లను పరిమితం చేసింది. ఇకపై వెరిఫైడ్ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్‌లు వచ్చేలా కొత్త ఆప్షన్‌ను యాడ్ చేసింది. ఇదివరకు ఎవరైన వెరీఫైడ్ అకౌంట్ ఉన్న ప్రముఖులు పోస్ట్ పెడితే సాధారణ అకౌంట్లు ఉన్నవారు కామెంట్ల రూపంలో రిప్లయ్ ఇచ్చేవారు. తాజా అప్షన్‌ను వెరిఫైడ్ యూజర్ యాడ్ చేసుకుంటే కేవలం వెరిఫైడ్ అకౌంట్ హోల్డర్ నుంచే రిప్లయ్‌లు వస్తాయి. సాధారణ అకౌంట్ల నుంచి రావు. ఈ ఆప్షన్ వల్ల ప్రముఖులకు ట్రోలింగ్ బెడద తగ్గనుంది.

    1500 మంది మిలిటెంట్లను ఏరిపారేశాం: ఇజ్రాయెల్

    తమ దేశంలోకి చొరబడి మారణ హోమం సృష్టిస్తున్న హమాస్ ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఏరిపారేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దాదాపు 1500 మంది హమాస్ ఉగ్రవాదుల మృత దేహాలను గుర్తించినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలు పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చినట్లు చెప్పారు. ఉగ్రవాదులు ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి వారిని తరిమికొట్టినట్లు ప్రకటించింది. అయితే ఇంకా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు వివరించాయి.

    హమాస్ మిలిటెంట్ల మారణ హోమం

    ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు మారణ హోమం సృష్టించారు. ఒకే సారి 260 మంది ప్రాణాలు తీసి కర్కశంగా వ్యవహరించారు. గాజా సరిహద్దులోని కిబ్బుజ్ రీమ్ వద్ద జరిగిన ఓ మ్యాజిక్ పార్టీకి దాదాపు 3 వేల మంది హాజరుకాగా మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో వారంతా కార్లలో పారిపోయేందుకు ప్రయత్నించగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారిపై మిలిటెంట్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మరికొన్ని చోట్ల ఇళ్లలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు.

    యుద్ధం కోరుకోలేదు.. కానీ తప్పడం లేదు

    ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం తాము మొదలు పెట్టలేదని.. అయితే ముగింపు మాత్రం తామే ఇస్తామని వెల్లడించారు. ఇజ్రాయెల్ యుద్దం కోరుకోలేదని, అయినప్పటికీ దేశం కోసం తప్పడం లేదని చెప్పారు. హమాస్ సైతం ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థేనని, ప్రజలంతా ఏకమై దానిని ఓడించాలని కోరారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిస్తే నాగరిక ప్రపంచం మొత్తం గెలిచినట్లేనని ఆయన అన్నారు.

    హమాస్‌ దాడిలో 9 మంది మృతి

    ఇజ్రాయెల్‌లో హమాస్‌ జరిపిన దాడిలో తొమ్మిది మంది అమెరికాన్లు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది మంది అమెరికన్‌ పౌరుల ఆచూకీ తెలియకుండా పోయిందని అమెరికా వెల్లడించింది. తొలుత నలుగురు చనిపోయినట్లు పేర్కొనగా.. తాజాగా ఆ సంఖ్య తొమ్మిదికి చేరిందని అమెరికా ప్రకటించింది. అయితే, ఆచూకీ తెలియని వారు బందీలుగా ఉన్నారా..? చనిపోయారా..? అన్నది స్పష్టత లేదని వాషింగ్టన్‌ వెల్లడించింది.

    కుటుంబాన్ని తప్పించి.. తూటాలకు బలై..

    ఇజ్రాయెల్‌‌లో అమాయక ప్రజలను హమాస్ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో మన హృదయాన్ని మెలిపెట్టేలా ఉంది. ఉగ్రవాదుల బారి నుంచి తన కుటుంబాన్ని రక్షించుకుని తను మాత్రం హమాస్‌ల తూటాలకు బలయ్యాడు. ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడ్డాన్ని గమనించి ఆ వ్యక్తి వెంటనే ఇంటి కిటికీ నుంచి కుటుంబసభ్యులను తప్పించాడు. ఈ క్రమంలో తాను తప్పించుకుంటుండగా అప్పటికే ముష్కరులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు కిటికీ వద్దే ప్రాణాలు కోల్పోయాడు. GRAPHIC: A heartbreaking video of a father … Read more

    యద్ధం ఎఫెక్ట్: పెరిగిన చమురు ధరలు

    ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ చమురు ధర నాలుగు శాతానికి పైగా పెరిగి 87.5 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఎస్‌ రకం ధర 85.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. ఈ నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చమురు సరఫరాలపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    పాలస్తీనాకు షాక్ ఇచ్చిన భారత్ హ్యాకర్లు

    పాలస్తీనా, హమాస్‌లకు చెందిన పలు కీలక వెబ్‌సైట్లను భారత్ హ్యాకర్లు హ్యాక్ చేసి గట్టి షాక్ ఇచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు పలు దేశాలకు చెందిన హ్యాకర్లు పాలస్తీనా, హమాస్‌లకు మద్ధతుగా పనిచేస్తున్నారు. వారు ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థకు చెందిన వెబ్ సైట్లను హ్యాక్ చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ హ్యాకర్స్ ఫోర్స్’తో పని చేస్తున్న బృందం ఇజ్రాయెల్‌కు మద్ధతుగా నిలిచాయి. పాలస్తీనా ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్‌సైట్లతో పాటు హమాస్ సైట్లను హ్యాక్ చేసి షాక్ ఇచ్చారు.

    300 మందిని బలిగొన్న భూకంపం

    అఫ్గానిస్తాన్‌లో సంభవించిన భూకంపం ధాటికి ఇప్పటివరకూ 300 మందికి పైగా చనిపోయారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. 500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. భూకంపం తాకిడికి జెందా జాన్‌ జిల్లాలోని నాలుగు గ్రామాల్లో వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమైనట్లు అఫ్గాన్‌ జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. అఫ్గాన్‌–ఇరాన్‌ సరిహద్దులకు సమీపంలోని హీరట్‌ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం కనీసం ఏడుసార్లు భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే(USGS) పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.3గా నమోదైందని పేర్కొంది. A horrifying earthquake in Afghanistan’s Herat … Read more

    భూకంపం.. 14 మంది మృతి

    అఫ్గానిస్థాన్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. 78 మంది తీవ్రంగా గాయపడ్డారు. అఫ్గానిస్థాన్‌‌లో ఉదయం భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 6.3గా నమోదైందని USGS వెల్లడించింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా. అనేకమంది శిథిలాల కింద చిక్కుకున్నారని తెలుస్తోంది. ఘటన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.