ఎఫ్2 మూవీలో ఉన్న నటులతో పాటు మరికొంత మందిని యాడ్ చేసి ఎఫ్3 మూవీ తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రిన్ కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి సినిమా ఎలా ఉంది..? అంచనాలకు చేరుకుందా..? ఇంతకీ స్టోరీ ఏంటి..? తదితర అంశాలు తెలుసుకుందాం.
కథేంటంటే..
వెంకీ(వెంకటేష్), వరుణ్ యాదవ్(వరుణ్ తేజ్) మధ్యతరగతికి చెందినవారు. డబ్బు కోసం నిరంతరం కష్టపడుతుంటారు. అయితే విజయనగరంలో బాగా డబ్బు ఉన్న ఒక వ్యాపారవేత్త తగిన వారసుడి కోసం చూస్తున్నట్లు తెలుసుకుంటారు. వెంకీ, వరుణ్ ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్లి మేమే నీ వారసులం అని చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు.
విశ్లేషణ:
దర్శకుడు అనిల్ రావిపూడి మొదటి నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్మూలాను నమ్ముకునే సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. కథ ఎలా ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లే, కామెడీతో సినిమాను గట్టెక్కిస్తాడు. ఎఫ్2 మూవీలో పెళ్లి, భార్యలతో ఫ్రస్ట్రేషన్ గురించి చెప్తూ కామెడీ పండించి సక్సెస్ సాధించాడు. ఎఫ్3 మూవీలో డబ్బు గురించి మనుషుల ఫ్రస్ట్రేషన్ చూపించాడు.
వెంకటేష్‌కు రేచీకటి, వరుణ్ తేజ్‌కు నత్తి జోడించి కొత్త ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగం సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఆ సీన్స్ వచ్చిన ప్రతీసారి ఎక్కడా ఓవర్ అనిపించకుండా సరదాగా సాగిపోతాయి. రాజేంద్రప్రసాద్ సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో నవ్వించాడు. మొదటి భాగం అంతా కామెడీతో సాగిపోతుంది. అసలు స్టోరీ ఇంటర్వెల్ సమయానికి స్టార్ట్ అవుతుంది. సెకండాఫ్‌లో కూడా స్టోరీ ఎక్కడో చూసినట్లు , కొన్ని ఫన్నీ సీన్స్, కొన్ని లాజిక్ లేని సీన్స్‌తో కొనసాగుతుంది. అయితే ముందునుంచి చెప్తున్నట్లుగానే కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. లాజిక్కులు వెతుక్కోకుండా కాసేపు చూసి నవ్వుకునే విధంగా సినిమా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
వెంకటేశ్, వరుణ్ తేజ్ వారికి ఇచ్చిన పాత్రల్లో 100 శాతం నవ్వులు పూయించేందుకు ప్రయత్నించారు. తమన్నాను ప్రాధాన్యత ఉన్న పాత్రలో చూడవచ్చు. మెహ్రిన్ మొదటి భాగంలో నవ్విస్తుంది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర పరిధి చాలా తక్కువ. ఇక ఈ సినిమాతో పాత సునీల్‌ను చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. అతడి డైలాగ్స్, మేనరిజమస్‌తో మెప్పించాడు. అలీ పాత్ర చిన్నదే అయినప్పటికీ బాగుంటుంది. ఇక వెన్నెల కిశోర్, ఇతర నటీనటులు వారి పాత్రల మేరకు నటించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌తో మెప్పించింది. సోనాల్ చౌహన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు.
సాంకేతిక విషయాలు :
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. అన్ని పాత్రలను బ్యాలెన్స్ చూస్తే తమ్మిరాజు ఎడిటింగ్ చక్కగా కుదిరింది. అనుకున్న కథను స్క్రీన్‌పై చూపించడంలో సక్సెస్ అయ్యాడు అనిల్ రావిపూడి.
బలాలు:
వెంకీ, వరుణ్ నటన
ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు
బలహీనతలు:
రొటీన్ స్టోరీ
లాజిక్ లేని సన్నివేశాలు
కొన్ని బోరింగ్ సీన్స్
రేటింగ్ : 2.75/5
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి