• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hanuman Movie: హనుమాన్‌ సినిమా గురించి ఈ ప్రత్యేకతలు తెలుసా?

    తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ రూపొందించిన పాన్‌ ఇండియా చిత్రం ‘హనుమాన్‌’. సూపర్‌ హీరో మూవీగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా వస్తోన్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే హనుమాన్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    తక్కువ బడ్జెట్‌తో పూర్తిస్థాయి తెలుగు చిత్రంగా హనుమాన్‌ను తీర్చిదిద్దాలని డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ భావించారు. అయితే నిర్మాత ఇచ్చిన విశేష మద్దతుతో పాన్‌ వరల్డ్‌ మూవీగా దీనిని సిద్ధం చేశారు. దాదాపు 11 భాషల్లో ఈ చిత్రం రిలీజ్‌ కావడం విశేషం.

    ఈ సినిమా కోసం అంజనాద్రి అనే ప్రపంచాన్ని చిత్ర యూనిట్ సృష్టించింది. ఆ ఊరు చుట్టూనే కథ తిరుగుతుంది. దానిని రక్షించడం కోసం హనుమంతు అనే యువకుడు ఏం చేశాడన్నదే కథ.

    జూన్‌ 25, 2021న ఈ సినిమా పట్టాలెక్కింది. వట్టినాగులపల్లిలో స్థలాన్ని లీజ్‌కు తీసుకొని షూట్‌ చేశారు. ఆ ప్రాంతం స్థానికంగా హనుమాన్‌ స్టూడియోగా గుర్తింపు పొందింది.

    ఈ చిత్రంలో కోటి అనే వానరం పాత్రకు రవితేజ వాయిస్‌ ఓవర్ ఇచ్చారు. కోటి డైలాగ్స్‌ను వెటకారంగా తీర్చిదిద్దడంతో రవితేజ వాయిస్‌ అందుకు సరిగ్గా సరిపోతుందని టీమ్‌ భావించింది.  

    ఈ మూవీలో మెుత్తంగా 1600 వీఎఫ్ఎక్స్‌ షాట్స్‌ ఉంటాయట. వానరం, ఎలుకలు, చిరుత, పులిని చూపించడం వీఎఫ్‌ఎక్స్‌ వల్లే సాధ్యమైందని ప్రశాంత్ చెప్పారు. బడ్జెట్‌కు అనుగుణంగా కొత్త తరం వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌తో వర్క్‌ చేసినట్లు తెలిపారు.

    ఈ సినిమా కోసం ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్లు పని చేశారు. అనుదీప్‌, గౌరహరి, కృష్ణ మూవీ మేకింగ్‌లో భాగస్వామ్యులయ్యారు.

    హనుమంతుడిగా చిరంజీవి కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. సినిమా చూసి ఆ విషయం తెలుసుకోవాలని టీమ్‌ బదులిచ్చింది.

    వాన సినిమా హీరో వినయ్‌ రాయ్‌ ఇందులో విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించింది.

    హనుమాన్‌ సినిమా మెుత్తం నిడివి 2 గం. 40 నిమిషాలు. సెన్సార్‌ అనంతరం 2 గం. 38నిమిషాలు అయ్యింది. సినిమాకు ఏదైతే అవసరమో అదే షూట్‌ చేశామని డైరెక్టర్‌ తెలిపారు.

    డైరెక్టర్‌ ప్రశాంత్‌ తన వద్ద 30-40 కథలు రెడీగా ఉన్నాయని వెల్లడించారు. హనుమాన్‌ ఫలితం చూసి వాటిని పట్టాలెక్కిస్తానని పేర్కొన్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv